DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భగవద్గీతయే  సర్వ శ్రేష్ట పర్నలిటీ డెవెలెప్ మెంట్ కోర్సు : చిన్న జీయర్ స్వామి 

జీయర్ స్వామి ఆధ్వర్యవం లో  à°µà±ˆà°­à°µà°‚à°—à°¾ ఉత్తర ద్వార దర్శనం, గీతా పారాయణ  

హైదరాబాద్, డిశంబర్ 18 , 2018 (DNS Online ): శ్రీమద్భాగవద్గిత ప్రపంచంలోనే అత్యున్నత విశిష్టమైన

పర్సనాలిటీ డెవెలప్ మెంట్ కోర్సు అని, మానవాళి జీవన విధానాన్ని తెలియచేస్తుందని త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలియచేసారు. మంగళవారం గీతా జయంతి

పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని శంషాబాద్ లో గల జీవా లో శ్రీరంగ నాధుని సన్నిధిలో నిర్వహించిన సమగ్ర భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని ఆయన

ప్రత్యక్షంగా నిర్వహించారు. గీత లోని 700 శ్లోకాలను స్వయంగా పఠనం చేస్తూ భక్తులచే పఠింప చేశారు. ప్రతి అధ్యాయం లోని సారాంశాన్ని అంతరార్ధాన్ని, ప్రస్తుత సమాజానికి

ఏవిధంగా అన్వయించబడుతుందో వివరించారు. 

ఈ సందర్బంగా స్వామిజి మాట్లాడుతూ భగవద్గీత మహాభారత యుద్ధం లో కర్తవ్యమ్ తెలియక సతమతమవుతున్న అర్జునునికి

శ్రీకృష్ణ భగవానుడు చేసిన మహా జ్ఞాన బోధ అన్నారు. ప్రస్తుతం మానవ సమాజం కూడా ఎన్నో సమస్యలతో జీవనాన్ని సవ్యంగా కొనసాగించలేక సతమతమవుతోందన్నారు. ప్రతి ఒక్కరూ

భగవద్గిత చదవడం అలవాటు చేసుకోవాలని, అవకాశం ఉన్నంతలో అంతరార్ధాన్ని కూడా తెలుసుకోవాలన్నారు. 

యువతకు మార్గదర్శకమే :

భగవద్గీత కృష్ణుడు అర్జునునికి

బోధించినప్పుడు అర్జునుని యువకుడేనని, అతని భవిష్యతును మార్గదర్శకం చేసేందుకే శ్రీకృష్ణ భగవానుడు అందించిన జ్ఞాన బోధ అన్నారు. వేల సంవత్సరాల క్రితమే భగవానుడు

ఈ సమాజానికి ఈ కోర్సు అందించాడని, దాన్ని కాలరాసుకుని, తెలియని, అక్కరలేని విషయాల కోసం వెంపర్లాడుతున్నారన్నారు. ప్రస్తుత యువతరం తీవ్ర ఒత్తిళ్ల మధ్య విద్య, ఉపాధి

లో సమస్యలను ఎదుర్కొంటున్నారని, భగవద్గిత పారాయణ చేసియున్నట్టయితే వాటిని సునాయాసంగా ఎదుర్కొనే సూచనలు తెలుస్తాయన్నారు. ప్రస్తుతం యువత సునిశిత మనస్కులని,

వారికి మార్గదర్శకం చేయాల్సిన భాద్యత తల్లిదండ్రులు, విద్యాలయాల అధ్యాపకుల పైనే ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే భగవద్గిత విశిష్టతను అలవాటు చేయాల్సిన అవసరం

ఉందన్నారు. 

వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు :

మార్గశీర్ష మాసం లో అత్యంత వైశిష్ట్యం కల్గిన వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవ వేడుకలను చిన్న జీయర్ స్వామి

ఆశ్రమం లో వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి స్వామిజి ఆరాధ్య మూర్తులైన సపరివారంగా శ్రీరామచంద్ర స్వామి, శ్రీ రంగనాధులు భక్తులకు మంగళవారం ప్రాత: కాలం

నుంచే దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ప్రాధాన్యత, ఆవిర్భావ చరిత్రను స్వామిజి భక్తులకు వివరించారు. ధనుర్మాసం కావడం అనంతరం తిరుప్పావై సేవాకాలం

నిర్వహించారు. ఈ తిరుప్పావై గోష్ఠి లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం భక్తులందరికీ తీర్థగోష్ఠి నిర్వహించారు. ఈ వేడుకల్లో మైహోం

సంస్థ చైర్మన్ రామేశ్వర రావు, జీయర్ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

 

 

#dns   # dns live   #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #jeeyar  #chinna jeeyar  #bhagavad gita  #jet  #gita parayana

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam