DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆరంభం నేటి నుండి విధుల్లోకి

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి,  à°†à°—స్టు  16, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాకంగా ప్రారంభించిన గ్రామ వలంటీర్ల

వ్యవస్థ నేటి నుంచి ఆరంభం కానుంది. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను అసలైన, అర్హులైన లబ్దిదారుల ఇంటి గుమ్మానికి చేర్చడమే ఈ వలంటీర్లు ప్రధాన విధి.

గ్రామ వలంటీర్ల వ్యవస్థ ద్వారా  à°¸à±à°®à°¾à°°à± మూడు లక్షలమందికి పైగా నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది.  à°ªà±à°°à°¤à°¿à°¨à±†à°²à°¾ వారికి 5000 రూపాయల వరకు గౌరవ వేతనం అందుతుంది. పెద్ద

సంఖ్యలో ఉపాధి లభించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా మున్సిపల్, గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్ శాఖల పర్యవేక్షణలో వలంటీర్లు

పనిచేయాల్సి ఉంటుంది. 31 రకాల విధులను ప్రభుత్వం కేటాయించింది. సకాలంలో, పారదర్శకంగా సేవలను అందించడం వారి ముందున్న లక్ష్యం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యానికి

అనుగుణంగా అవినీతి రహితంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను లబ్దిదారులకు అందజేయాల్సి ఉంటుందని చెబుతున్నారు అధికారులు.  à°’క్కో వలంటీర్ తన పరిధిలోని 50 కుటుంబాల

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి గ్రామ పంచాయతీ కార్యదర్శికి నివేదించడం మొదలుకుని పింఛన్లు, చౌక ధరల దుకాణాల ద్వారా అందే నిత్యావసర సరుకులను

లబ్దిదారులకు అందజేయడం వంటి పారదర్శకంగా చేయాల్సి ఉంటుంది. శుక్రవారం నుంచి 23à°µ తేదీ వరకు వలంటీర్లకు కేటాయించిన కుటుంబాల వద్దకు వారు వెళ్లాల్సి ఉంటుంది.  26à°µ

తేదీ నుంచి 30à°µ తేదీ వరకు ఇళ్ల స్థలాల కోసం సర్వే చేపట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్‌ 1à°µ తేదీ నుంచి 10 వరకు చౌక డిపోల

ద్వారా సరఫరా అయ్యే బియ్యం సంచులను తెల్లరేషన్ కార్డు à°—à°² కుటుంబాల ఇంటి వద్దకు చేర్చాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.  à°…దే నెల 11 నుంచి 15à°µ తేదీ వరకు

పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు, రైతు భరోసా లబ్ధిదారుల గుర్తింపులను వలంటీర్లే జారీ చేయాల్సి ఉంటుంది. 

పైలట్‌ ప్రాజెక్టుగా నాణ్యమైన, ప్యాకింగ్‌

చేసిన బియ్యం పంపిణీని శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam