DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యువత పాలిట ఆశాజ్యోతి -  ఉపాధి జ్యోతి వెబ్ సైట్

ఉపాధి అవకాశాలు పెంపు కోసం వెబ్ సైట్ ప్రారంభం 

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 23, 2019 (డిఎన్‌ఎస్‌):

 à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు రూపొందించిన ఉపాధి జ్యోతి వెబ్ సైట్ శుక్రవారం ప్రారంభం అయింది. బాపూజి కళామందిర్ లో జరిగిన కార్యక్రమంలో

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెబ్ సైట్ ను ప్రారంభించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో ఉపాధి జ్యోతి వెబ్ సైట్ ను

ఆవిష్కరించారు. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతను, వివిధ పారిశ్రామిక సంస్ధలు, వ్యాపార, ఉద్యోగ కల్పన కార్యాలయాలు, సంస్ధలతో అనుసంధానించడం ఈ వెబ్ సైట్ ముఖ్య

ఉద్దేశ్యం. జిల్లాలో యువత తమ అర్హతలను వెబ్ సైట్ లో నమోదు చేసుకోవడం ద్వారా వైబ్ సైట్ లో అనుసంధానమైన సంస్ధలు తమకు అవసరమైన విద్యార్హతలు, అనుభవం కలిగిన

అభ్యర్ధులను వైబ్ సైట్ ద్వారా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. జిల్లా యువతకు ఇది ఒక చక్కని అనుసంధాన వేదికగాను, ఉపాధి మార్గానికి చక్కని బాటగాను ఉంటుంది. యువత తమ

అర్హతలకు ఏ సంస్ధలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో పరిశీలించుకనే అవకాశం వెబ్ సైట్ లో ఉండగా, వైబ్ సైట్ లో నమోదైన సంస్ధలు తమకు సరిపడే విద్యార్హత, అనుభవం కలిగిన

యువతను ఎంపిక చేసుకునే అవకాశం సైతం ఉంది. ఇటు యువతకు, అటు సంస్ధలకు వారధిగా ఉపాధి జ్యోతి వెబ్ సైట్ పనిచేస్తుంది. జిల్లా యువతకు చక్కని వేదికగా నిలుస్తుంది.

 

        à°ˆ సందర్భంగా రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ నిరుద్యోగం ప్రభలుతున్నరోజుల్లో ఉపాధి జ్యోతి వెబ్ సైట్ యువతకు మంచి అవకాశం

కల్పిస్తుందన్నారు. నిత్య జీవితంలో నిజాయితీగా బ్రతుకుతెరువుకోసం చేసుకునేది ఉద్యోగమన్నారు. ఆదాయం ఉండటం వలన గౌరవంగా జీవించుటకు అవకాశం ఉంటుందని

పేర్కొన్నారు. ఉద్యోగానికి అవసరమగు మంచి శిక్షణ పొందాలని పేర్కొన్నారు. స్ధానికంగా ఏర్పాటు చేసే కర్మాగారాలు, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్ధానికులకు

కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిందని అన్నారు. అందుకు అనుగుణంగా యువత చదువుతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తద్వారా ఉద్యోగాలు పొందవచ్చని

చెప్పారు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు పొందుటకు కృషి చేయాలని, తప్పుడు దారిలో వెళ్లుటకు ప్రయత్నించరాదని యువతకు పిలుపునిచ్చారు. మంచి శిక్షణ పొందాలని మెలుకువలు

నేర్చుకోవాలని కోరారు. ప్రస్తుతం భర్తీ చేస్తున్న గ్రామ సచివాలయ పోస్టులు పూర్తిగా ప్రతిభ ఆధారంగా నింపడం జరుగుతుందని స్పష్టం చేసారు. నిజాయితీగా పరీక్షను

రాయాలని, మంచి మార్కులను సంపాదించిన వారే పోస్టులను పొందుతారని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అవినీతి రహిత పాలనకు శ్రీకారం చుట్టారని

చెప్పారు. యువతకు శ్రద్ద, ఆసక్తి ఉండాలని తద్వారా జీవితాశయం సిద్ధిస్తుందని అన్నారు. జిల్లాలో లక్ష ఉద్యోగాలను కల్పించుటకు జిల్లా యంత్రాంగం ప్రయత్నించడం

శుభసూచకమని మంత్రి అన్నారు. ఇటువంటి అవకాశాలను యువత వినియోగించుకోవాలని కోరారు.

          శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ ఉపాధి జ్యోతి వెబ్ సైట్

చక్కటి ప్రయత్నం అన్నారు. వెబ్ సైట్ ద్వారా పెద్ద ప్రయోజనం ఉందని పేర్కొన్నారు. ప్రతి పనిలో నైపుణ్యం అవసరమని దానిని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం

యువతలో నైపుణ్య అభివృద్ధికి ప్రయత్నం చేస్తుందని తెలిపారు. చిన్న ఉద్యోగమనే ఆలోచనతో ఆగిపోవద్దని పిలుపునిస్తూ చిన్న ఉద్యోగాలలో చేరినవారు గొప్ప విజయాలు

సాధిస్తారని అనేక మంది రుజువు చేసారని తెలిపారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి అనేక మంది సిఫారసులకు వస్తున్నారని, అటువంటి సిఫారసులు చెల్లవని, పూర్తిగా

ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

          జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లా నుండి ఎక్కువ మంది వలసలు వెలుతున్నారని, వలసల నివారణకు

అర్హమైన వారికి ఉపాధి కల్పించుటకు ఉపాధి జ్యోతి వెబ్ సైట్ ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో యువత వివరాలు అందుబాటులో ఉంటే ఉపాధికల్పనకు అవకాశం కలుగుతుందనే

ఉద్ధేశ్యంతో వెబ్ సైట్ ను ఆవిష్కరించామన్నారు. యువతకు, ఉపాధి కల్పన సంస్ధలకు వారధిగా వెబ్ సైట్ పనిచేస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి నెల ఒక జాబ్ మేళాను

నిర్వహించాలని సంకల్పించామని, తద్వారా లక్ష మంది యువతకు ఉపాధి కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఉద్యోగ మేళాలో నిర్వహించే ఉద్యోగాలకు సరిపడే

విధంగా నైపుణ్యాలు అభివృద్ధి పరచుకోవాలని కోరారు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఖాళీగా ఉండరాదనే అభిమతంతో ఉన్నామని పేర్కొంటూ దూరం దగ్గర అనే తేడా లేకుండా ఉపాధి కలిగిన

ప్రదేశానికి వెళ్ళుటకు యువత సిద్ధంగా ఉండాలని కోరారు. ఉపాధి జ్యోతి వెప్ సైట్ సాఫ్ట్ వేర్ ను మీ సేవా కేంద్రాలలో పెట్టడం జరిగిందని, అచ్చట రూ.25 చెల్లించి యువత

నమోదు కావచ్చని తెలిపారు. వెబ్ సైట్ ద్వారానే జాబ్ మేళాకు హాజరు కావచ్చని, ప్లేస్ మెంటు ఆర్డర్ కూడా వెబ్ సైట్ ద్వారానే లభిస్తుందని అన్నారు. అభ్యర్ధి ఫోన్ నంబరుకు

మెసేజ్ వస్తుందని ఆయన చెప్పారు.
          à°¡à°¿.ఆర్.à°¡à°¿.ఏ ద్వారా అందించిన నైపుణ్య శిక్షణా కార్యక్రమంలో శిక్షణ పొంది ఖజానా జ్యూయలరీల సహాయ మేనేజర్ à°—à°¾ పనిచేస్తున్న

కింతలికి చెందిన ఆర్.దాలిబాబు, రిటైల్ రంగంలో పనిచేస్తున్న పావని శిక్షణా కార్యక్రమం వలన కలిగిన ప్రయోజనాలను వివరించారు. శిక్షణ ఎంతో ఉపయుక్తంగా ఉందని తద్వారా

ఉపాధి పొందామని పేర్కొన్నారు.
          à°ˆ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ ఏ.కళ్యాణ చక్రవర్తి,

రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, బి.సి కార్పొరేషన కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, ఎస్.సికార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు సి.హెచ్.మహాలక్ష్మి, సెట్

శ్రీ ముఖ్య కార్యనిర్వహాక అధికారి వి.వి.ఆర్.ఎస్. మూర్తి, మెప్మా ప్రాజెక్టు డైరక్టర్ ఎం.కిరణ్ కుమార్, నైపుణ్య అభివృద్ధి సంస్ధ జిల్లా మేనేజర్ డా.గోవింద రావు, మాజీ

పురపాలక ఛైర్మన్ అంధవరపు వరం., చిరంజీవి నాగ్, కోణార్క్ శ్రీనివాసరావు, మామిడి శ్రీకాంత్, మండ రవి, మహిబుల్లా ఖాన్, వివిధ సంస్ధల ప్రతినిధులు, యువత తదితరులు

పాల్గొన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam