DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ట్రాఫిక్ కెమెరాలు కూడా పోలీసు అంటే భయపడుతున్నాయా ? 

సీసీ కెమెరాలు కేవలం సామాన్యులకు మాత్రమే ఫోటోలు తీస్తాయా?

పోలీసు దర్పానికి ఫైన్  à°µà±†à°¯à±à°¯à°°à°¾ ? వెయ్య కూడదా? 

తప్పులెన్నువారు తమ తప్పు ఎరుగరా అన్నది

వాస్తవమా?

నో పార్కింగ్ లో ఉన్న పోలీసు బైక్ లకు ఫైన్ వేయకూడదా?  

విశాఖ లో శృతిమించిన పోలీసు తనిఖీలు, అందరికీ ఫైన్ లే 

ప్రశ్నించే సాహసం

చెయ్యద్దు :  . . .

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). ..

విశాఖపట్నం, సెప్టెంబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖలో ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర ఉన్న సీసీ

కెమెరాలు కూడా పోలీసులు అంటే భయపెడుతున్నాయా అంటే? అవుననే చెప్పాలి. సామాన్యులు  à°Ÿà±à°°à°¾à°«à°¿à°•à± సిగ్నల్ దగ్గర స్టాప్ లైన్ పైకి వస్తే క్లిక్ మని ఫోటోలు తీసే ట్రాఫిక్

సీసీ కెమెరాలు అక్కడే తప్పులు చేసే పోలీసు వాహనదారులకు మాత్రం పని చెయ్యడం లేదు. ప్రధానంగా మద్దిలపాలెం కూడలి వద్ద విపరీతం గా పని చేసే సీసీ కెమెరాలు పోలీసులు

వాహనాలకు ఫోటోలు తీసిన దాఖలాలు లేవు.     

మద్దిలపాలెం లో విపరీతం. :. .

విశాఖ నగరం నడిబొడ్డులో ఉన్న మద్దిలపాలెం కూడలి అత్యంత రద్దీ కేంద్రం. ఇక్కడే

పోలీసు చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసారు. అయితే ఈ చెక్ పోస్ట్ చుట్టూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జాతీయ రహదారి పై సగం రోడ్డు ఆక్రమించేలా పోలీసు వాహనాలు పార్కింగ్

చేసి మరీ,  à°ªà±à°°à°œà°²à°•à± నీతులు చెప్తున్నారు. ఇక్కడే సామాన్యుల కు భారీ మొత్తం లో ఫైన్లు వేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కేవలం సామాన్యులకు మాత్రమే ఫోటోలు తీసే

సీసీ కెమెరాలు డజన్ల కొద్దీ రాంగ్ పార్కింగ్ చేసిన పోలీసుల బైక్ లు, రక్షక్ వాహనాలకు మాత్రం ఫోటోలు తియ్యడం లేదు, ఫైన్ లు వెయ్యడం లేదు. అంటే పోలీసు అంటే సీసీ

కెమెరాకు సైతం భయపెడుతున్నాయా లేక భయపెడుతున్నారా అనే అనుమానం కలుగుతోంది.  

నూతన రవాణా చట్టాన్ని అమలు లోకి రాక ముందే విశాఖ పోలీసులు శృతిమించిన పనితీరు

మొదలు పెట్టేసారు. కనిపించిన ప్రతీ వాహనానికి ఫైన్ లు వెయ్యడం మొదలెట్టేశారు.  

నో పార్కింగ్ లోనే తమ వాహనం పెట్టి తనిఖీలు : . . .

బీచ్ రోడ్ లో పార్కింగ్

చేసే వాహనాలను టార్గెట్ గా విస్తృత తనిఖీలు చేస్తూ కనిపించిన ప్రతీ వాహనానికి ఫైన్ వెయ్యడానికే శాయశక్తులా కృషి చేస్తున్నారు. అయితే వీళ్ళు నో పార్కింగ్ లోనే

తమ వాహనాలను పార్కింగ్ చేసి మరీ ఇతరులకు ఫైన్ వేసేస్తున్నారు. ముఖ్యంగా నోవాటెల్ హోటల్ ఎదురుగా నో పార్కింగ్ వాహనం జోన్ ఉందంటూ పోలీసులు తనిఖీలు

చేస్తున్నారు. 

జీతం చాలక స్విగ్గి సేవలు ? . :.. 

విశాఖ నగరం లో పోలీసు సిబ్బందికి నెలసరి వేతనం సరిపోవడం లేదో లేక అసలు జీతాలే రావడం లేదో తెలియదు కానీ

కొందరు తాత్కాలికంగా వీరే ఉద్యోగాలు కూడా చేస్తున్నట్టు కనపడుతోంది. దీనికి నిదర్శనమే విశాఖ వీధుల్లో పోలీసు స్టిక్కర్ కల్గిన ఒక బైక్ పై ఒక వ్యక్తి స్విగ్గి

సేవలు అందిస్తున్నాడు. చేస్తున్నపని తప్పు కాదు, అయితే తన వాహనం పై పోలీస్ స్టిక్కర్ మాత్రం వేసుకోవడం తప్పు. ఈ వాహనం విశాఖ నగరం వీధుల్లోనే తిరుగుతున్నప్పడికీ ఏ

పోలీసు తనిఖీ సిబ్బంది à°ˆ వాహనాన్నిఆపి తనిఖీ చెయ్యక పోవడం గమనార్హం. 

కోలనీల్లోనూ తనిఖీలు. : . . 

ప్రధాన రహదారుల్లో చెయ్యవలసిన పోలీసు తనిఖీలను విశాఖ

పోలీసులు మరింత ముందుకు పోయి కోలనీల్లో కూడా రాత్రివేళల్లో తనికీలు చేసేస్తున్నారు. చట్ట ప్రకారం గృహవాస కోలనీల్లో ఎటువంటి పోలీసు తనిఖీలు చెయ్యకూడదు. అయినా

సరే. . . మా డ్యూటీ మాదే అన్నట్టుగా . . .

ప్రధానంగా అక్కయ్యపాలెం జాతీయ రహదారికి రెండు వైపులా ఉన్న కోలనీల్లో రాత్రిళ్ళు తనిఖీలు చేపడుతున్నారు. ఇంటినుంచి

ద్విచక్ర వాహనం పై పక్క వీధిలోకి వెళ్లాలన్న భయపడే స్థితి ని పోలీసుకు కల్పిస్తున్నారు. అత్యవసరంగా మెడిసిన్ కోసం బయటకు వచ్చినా అంతే తనిఖీ పేరుతొ ఫోటో

తీస్తున్నారు ఫైన్ వేస్తున్నారు. 

ప్రశ్నించే సాహసం చెయ్యద్దు :  . . .

ముందు తమ శాఖలో ఉన్న తప్పులు సరిదిద్దుకోకుండా ప్రజలకు నీతులు చెప్తున్నా ఈ సిబ్బంది

ని మాత్రం ప్రశ్నించే ప్రయత్నం చెయ్యవద్దు. మీరు హెల్మట్ ఉన్న లేదని, లైసెన్సు ఉన్న లేదనే సాకు పెట్టి వేలకు వేలు ఫైన్లు బాదే అవకాశం ఉంది జాగ్రత్త. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam