DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సూర్యప్రభ తో యోగ‌ముద్ర‌లో బ‌ద్రినారాయ‌ణుడు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - 2019

సూర్యప్రభ వాహనం - ఆయురారోగ్య‌ప్రాప్తి: . . .

చంద్రప్రభవాహనం - మాన‌సిక‌శాంతి ప్రాప్తి: . . 

(DNS రిపోర్ట్ : NSV రమణ

, స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . .

తిరుపతి, అక్టోబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌): కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి సాల‌à°•‌ట్ల బ్రహ్మోత్సవాలలో ఏడో రోజైన ఆదివారం ఉదయం

శేషాచలాధీశుడు సూర్యప్రభ వాహనంపై à°¸‌ప్త అశ్వాల‌పై యోగ‌ముద్ర‌లో à°¬‌ద్రినారాయ‌ణుడి అలంకారంలో తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం 9 నుండి 11

గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు,

కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి

స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యప్రభ వాహనం - ఆయురారోగ్య‌ప్రాప్తి: . . .

           à°¬à±à°°à°¹à±à°®à±‹à°¤à±à°¸à°µà°¾à°²à°²à±‹ ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు

సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ భక్తులను ఆరోగ్యవంతులను చేస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు,

ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న

సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన

సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

          అనంతరం సాయంత్రం 6

నుండి 7 à°—à°‚à°Ÿà°² వరకు ఊంజల్‌ సేవ వైభవంగా జరగనుంది.

చంద్రప్రభవాహనంపై సర్వజగద్ర‌క్ష‌కుడు : . . .

         à°¬à±à°°à°¹à±à°®à±‹à°¤à±à°¸à°µà°¾à°²à°²à±‹ 7à°µ రోజు రాత్రి 8 à°—à°‚à°Ÿà°² నుండి 10 à°—à°‚à°Ÿà°² నడుమ

శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపనున్నాడు.

చంద్రప్రభవాహనం - మాన‌సిక‌శాంతి ప్రాప్తి: . . 

        చంద్రప్రభ

వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చి తన చల్లని అమృత కిరణాలతో భక్తులను అమృతస్వరూపులను చేస్తారు. నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వానికీ అధిపతి.

వాహనం చంద్రుడు ఆహ్లాదకారి. శ్రీవారు చంద్రమండల మధ్యస్థుడై పరమాహ్లాదకారి అయ్యాడు. సర్వకళాసమాహారాత్మకుడైన ఆదినారాయణుడు తన కళల నుండి 16 కళలు చంద్రునిపై

ప్రసరింపజేసినందున చంద్రుడు కళానిధి అయ్యాడు. చంద్రదర్శనంతో సముద్రం ఉప్పొంగినట్టు, చంద్రప్రభామధ్యస్థుడైన శ్రీకల్యాణచంద్రుణ్ణి దర్శించడంతో భక్తుల హృదయ

క్షీరసాగరాలు ఉత్తుంగప్రమోద తరంగాలతో పొంగి ఆనందిస్తాయి. చంద్రప్రభ వాహనంలో శ్రీవారిని దర్శించడం సకలతాపహరం.

        à°ˆ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ

పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌à°¦‌ర్శి శ్రీ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లి

అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, à°…à°¦‌à°¨‌పు ఈవో శ్రీ ఎవి.à°§‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.à°¬‌సంత్‌కుమార్‌, సివిఎస్‌వో

శ్రీ గోపినాథ్‌జెట్టి, à°ª‌లువురు ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అక్టోబ‌రు 7à°¨ రథోత్సవం

        శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా

సోమ‌వారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 7 గంటలకు à°°‌థోత్స‌వం ప్రారంభ‌à°®‌వుతుంది. రాత్రి 8 నుండి 10 à°—à°‚à°Ÿà°² వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను

కటాక్షించనున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam