DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్తుల పాలిట శంకర నేత్రమే. . .ఈ శంకర్ ఫౌండేషన్: ద్రోణంరాజు 

ఐనాక్స్ కు అవకాశం ఇవ్వడం మా అదృష్టం : మోహిత్ భార్గవ 

అందరి సహకారంతోనే 3 లక్షల శస్త్ర చికిత్సలు : మణిమాల 

సంస్థలో ప్రతి ఉద్యోగీ చీఫ్ మెడికల్

ఆఫీసరే. . . : మణిమాల 

నగరంలోనే శంకర్ ఫౌండేషన్ పూర్తి ఆపరేషన్ సేవలు . . . 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, నవంబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌): ఆర్తుల

పాలిట శంకర నేత్రమే. . .à°ˆ శంకర్ ఫౌండేషన్ నేత్రాలయం అని విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ ( వి à°Žà°‚ ఆర్  à°¡à°¿ ఏ) చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

గురువారం విశాఖనగరంలోని మద్దిలపాలెం వద్ద గల కళాభారతి ఆడిటోరియం ఎదురుగా గల శంకర్ ఫౌండేషన్ సంస్థను అధికారికంగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన

మాట్లాడుతూ ఆర్తుల పాలిట ఆపద్బాందువులా నిలిచి నిస్వార్ధ సేవలు అందిస్తున్న శంకర్ ఫౌండేషన్ కు ప్రభుత్వ సహకారం కూడా పూర్తిగా లభించేందుకు తమ వంతు కృషి

చేస్తానని హామీ ఇచ్చారు. వి ఎం ఆర్ డి ఏ పరిధిలో కొన్ని గ్రామాల్లో స్థలం కేటాయించడం జరుగుతుందని వీరి నేత్ర సేవా కార్యక్రమాలకు వినియోగించవచ్చని తెలిపారు.

గ్రామీణ స్థాయిలో సైతం నిస్వార్ధ సేవలు అందిస్తున్న శంకర్ ఫౌండేషన్ నేత్ర వైద్య సంస్థ ఇక నుంచి విశాఖ నగరంలోనే పూర్తి స్థాయి  à°†à°ªà°°à±‡à°·à°¨à± సేవలు అందుబాటులోకి

వచ్చాయి. 

అందరి సహకారంతోనే 3 లక్షల శస్త్ర చికిత్సలు: మణిమాల 

సమాజం లోని మానవతామూర్తులు అందరి సహకారంతోనూ గత 22 సంవత్సరాల కాలంలో సుమారు 3 లక్షలకు

పైగానే నేత్ర శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగలిగామని శంకర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ కె బి ఎన్ మణిమాల తెలిపారు. గత రెండు దశాబ్దాల ప్రస్థానంలో తమతో

పాటు ప్రయాణించిన ప్రతి ఒక్కరిని ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలైనా హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( విశాఖ్ రిఫైనరీ), విశాఖపట్నం

పోర్ట్ ట్రస్ట్ తదితర సంస్థల సహకారంతో సామాజిక భాద్యత కార్యక్రమాల్లో భాగంగా ఆపరేషన్ థియేటర్ల నిర్మాణం చేయగలిగామని తెలిపారు. ఐనాక్స్ సంస్థ సహకారం తో ఆపరేషన్

పరికరాలు, కళ్ళ అద్దాల పరికరాలు తదితర అత్యవసర సామాగ్రి లభిస్తోందన్నారు. స్వచ్చంద సంస్థలు, కార్యకర్తలు సహకారంతో గ్రామీణ స్థాయిల్లో నేత్ర పరీక్షలు

చేయగలుగుతున్నామని, అవసరమైన వారిని విశాఖ నగరంలోని సంస్థ ఆసుపత్రికి తీసుకువచ్చి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి, వారికి ఉచితంగా కళ్ళ అద్దాలు కూడా ఇచ్చి మరీ

తిరిగి ఇళ్ల వద్ద దింపుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో ఆరోగ్రశ్రీ సేవలు, ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం, జర్నలిస్ట్ లకు హెల్త్ స్కీం

తదితర సేవలను అందిస్తున్నామన్నారు.  
మద్దిలపాలెం లోని ఈ సంస్థ రోటరీ వారి సౌజన్యంతో తమ శంకర్ ఫౌండేషన్ సంస్థ కు లభించిందని, ఇక్కడ నేత్ర పరీక్షల నుంచి పూర్తి

స్థాయి ఆపరేషన్ సేవలు అందుబాటులోకి ఉన్నాయన్నారు. 

ప్రతి ఉద్యోగీ చీఫ్ మెడికల్ ఆఫీసరే. . . : మణిమాల 

శంకర్ ఫౌండేషన్ సంస్థలో పని చేసే ప్రతి ఉద్యోగీ చీఫ్

మెడికల్ ఆఫసరేనని మణిమాల ప్రకటించారు. తమ సంస్థలో సుమారు 300 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, తమ సంస్థ విజయవంతంగా నడవడానికి పారిశుధ్య విభాగ

సిబ్బంది నుంచి నేత్ర చికిత్స చేసే వైద్యుల వరకూ అందరూ ప్రధాన భూమిక వహిస్తున్నారని తెలిపారు. వీరందరూ తమ సంస్థ దృష్టిలో ఉన్నతాధికారులేనన్నారు. ఎవరి ఉద్యోగ

ధర్మం వాళ్ళు అత్యుత్తమంగా నిర్వహిస్తున్నారని అందరినీ అభినందించారు. 

ఐనాక్స్ కు అవకాశం ఇవ్వడం మా అదృష్టం : మోహిత్ భార్గవ 

శంకర్ ఫౌండేషన్ వంటి

అత్యున్నత సేవ సంస్థ తో కలిసి పనిచేసే అవకాశం తమకు లభించడం అదృష్టమని ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ సంస్థ సౌత్ విభాగ డైరక్టర్ మోహిత్ భార్గవ అన్నారు. వ్యాపార పరంగా

ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, అయితే శంకర్ ఫౌండేషన్ తో కలిసి పనిచెయ్యడం మా అదృష్టమన్నారు. 

అనంతరం ద్రోణంరాజు శ్రీనివాస్, శంకర్ ఫౌండేషన్

ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఆపరేషన్ ధియేటర్, నేత్ర పరీక్షల విభాగాలను పరిశీలించి, వివరాలను తెలుసుకున్నారు. 

కార్యక్రమం లో సంస్థ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ

అత్మకూరి విజయ్ కుమార్, వైద్యులు, వైద్యేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam