DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జలవనరుల ప్రాజక్టుల పూర్తే లక్ష్యం– కలెక్టర్ నివాస్

ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్ధలాలు

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 31, 2019 (డిఎన్‌ఎస్‌): నూతన సంవత్సరంలో

జలవనరుల ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా

ప్రతినిధులతో మంగళ వారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాగు నీటి వనరుల పూర్తి సామర్ధ్యాన్ని ఉపయోగించుకొనుటకు అత్యంత

ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. హిరమండలం రిజర్వాయర్ పనులను పూర్తి చేసి 2 లక్షల ఎకరాలకు సాగు నీరు కల్పించాలని భావిస్తున్నట్లు నివాస్ చెప్పారు. మహేంద్ర తనయపై

ఆఫ్ షోర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సాగు నీరు, తాగు నీరు కల్పించుటకు, నాగావళి – వంశధార నదుల అనుసంధానం పూర్తి చేయుటకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

నాగావళి – వంశధార అనుసంధానం పనులు 60 శాతం మేర పూర్తి అయ్యాయని చెప్పారు. తద్వారా నారాయణపురం ఆనకట్ట దిగువన ఉన్న 30 వేల ఎకరాల్లో రెండవ పంట వేయుటకు అవకాశం ఉంటుందని

తెలిపారు. వచ్చే రబీ నాటికి సాగు నీరు అందించుటకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. బొంతు ఎత్తిపోతల పథకం క్రింద 11,700 ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని, ఎత్తిపోతల పనులు 50

శాతం పూర్తి అయ్యాయని చెప్పారు. రెండు నెలల్లో మొదటి దశ పనులు పూర్తి చేయడం వలన దాదాపు 5 వేల ఎకరాలకు సాగునీరు కల్పించుటకు అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఉగాది నాటికి

పేదలకు ఇళ్ళ స్ధలాలు అందించుటకు అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ అన్నారు. లబ్దిదారుల గుర్తింపు కార్యక్రమం జరిగిందని, అన్ని మండలాల్లో ఒక్కొక్క లే

అవుట్ ను సిద్ధం చేసామని చెప్పారు. సర్వే నంబరు, ప్లాట్ నంబరుతో సహా లబ్దిదారులకు ఇళ్ళ స్ధలాలను పంపిణీ చేస్తామని నివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు

చేస్తున్న నవశకం కార్యక్రమంను సమర్ధవంతంగా జిల్లాలో అమలు చేసి ప్రతి లబ్దిదారునికి ప్రయోజనం కలిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 
    2019

సంవత్సరం ఒక మధురమైన వసంతంగా గుర్తుంటుందని కలెక్టర్ పేర్కొంటూ ఎన్నికలను సమర్ధవంతగా పూర్తి చేసామన్నారు. వివిప్యాట్ లు ఈ ఏడాది కొత్తగా పరిచయం చేయడం

జరిగిందని అయినప్పటికి ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి విజయవంతంగా పూర్తి చేసామని పేర్కొన్నారు. ఫోని తుఫానులోను ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా యంత్రాంగం

యావత్తు పనిచేసిందని వివరించారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా నాణ్యమైన బియ్యం పంపిణీ ఇంటింటికి చేపట్టడం జరిగిందని, గ్రామ సచివాలయ పోస్టుల భర్తీ ప్రక్రియను

చక్కగా పూర్తి చేసిన అనుభూతి మిగిలిందన్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులకు వసతి, భోజన సౌకర్యాలను కల్పించడంతోపాటు పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారి జాబితాలు

తయారు చేసి పోస్టింగులు ఇచ్చే వరకు ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించిన జ్ఞాపకాలు ఉంటాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వై.యస్.ఆర్ వాహన

మిత్ర పథకంలో అత్యధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు దరఖాస్తు చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పించామని, తద్వారా లబ్దిపొందిన ఆటో డ్రైవర్లలో రాష్ట్రంలో 2వ స్ధానంలో

నిలిచామన్నారు. 13,539 మంది ఇందులో ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. వై.యస్.ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి అర్హులైన

జాబితాలను తయారు చేసి 3,28,453 మంది రైతులకు మొత్తాలను జమ చేయడం జరిగిందన్నారు. 40 వేల మంది అన్ సీడెడ్ రైతులు ఇబ్బందులకు గురికాగా వారి పేర్లను పరిశీలించి జాబితాలో

చేర్చామని పేర్కొన్నారు. అగ్రీ గోల్డు బాధితులు తమ పేర్లను నమోదు చేసుకొనుటకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేసి అన్ని సౌకర్యాలను కల్పించామని కలెక్టర్ అన్నారు.

45,834 మందిని నమోదు చేయగా 40,624 మందిని అర్హులుగా గుర్తించడం జరిగిందని చెప్పారు. వై.యస్.ఆర్ మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం కార్యక్రమాల క్రింద రూ.10 వేలు, రూ.24 వేలు చొప్పున

లబ్దిదారులకు అందించడం జరిగిందని చెప్పారు. గ్రామ సచివాలయ వ్యవస్ధను జనవరి 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుటకు రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రకటించారని

తెలిపారు. ప్రతి సచివాలయానికి అన్ని సౌకర్యాలు కల్పించామని, ఒక నోడల్ అధికారిని నియమించామని చెప్పారు. నోడల్ అధికారి ప్రతి శుక్ర వారం సమావేశాన్ని

నిర్వహిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించుటకు ఉపాధి జ్యోతి వెబ్ సైట్ ను

ప్రారంభించామని వివరించారు. ఇప్పటికే మూడు జాబ్ మేళాలు నిర్వహించామని అన్నారు. ఏడాదికి 50 వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

పాఠశాలలు, వసతి గృహాల్లో నాడు – నేడు కార్యక్రమం క్రింద మౌళికసదుపాయాలు కల్పించుట జరుగుతుందని అన్నారు. జిల్లాలో ప్రతి వసతి గృహానికి à°’à°• ఇంజనీరును నియమించామని

చెప్పారు. ఇంజనీరు వసతి గృహంలోగల మౌళికవసతులు పరిశీలించి వెంటనే కల్పించాలని అన్నారు. వసతి గృహంలకు ప్రామాణిక డిజైన్లను ఇచ్చామని ఆ మేరకు ఆహ్లాదంగా తయారు

అవుతాయని చెప్పారు. నాడు – నేడు కార్యక్రమం క్రింద 1238 పాఠశాలల్లో మౌళికసదుపాయాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. సి.ఎస్.ఆర్ కార్యక్రమం క్రింద ఆసుపత్రుల్లో

సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి, సిహెచ్ సిలపై దృష్టి సారించామన్నారు. ప్రభుత్వ సర్వజన

ఆసుపత్రిలో రూ.7 లక్షలతో ఎక్స్ రే డిజిటల్ విధానంలో పరిశీలించే విధానాన్ని ఏర్పాటు చేసామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు కార్పోరేట్ స్దాయిలో ముఖచిత్రం ఉండాలని

భావిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మహిళా వైద్యులకు మంచి వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. వసతి సౌకర్యాలు ఆదర్శంగా

ఉండగలదని చెప్పారు. మంచి వసతి కల్పించినపుడే మంచి సేవలు అందించగలరని పేర్కొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam