DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రక్షణ రంగం తో ఏ యూ ఒప్పందం - రూ. 100 కోట్ల రూసా నిధులు


వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు

విశాఖపట్నం, జూన్‌ 26 , 2018 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రవిశ్వవిద్యాలయంలో రక్షణ రంగాల కు నైపుణ్య శిక్షణ  à°…ందిచనున్నామని ఏయూ వీసీ ఆచార్య

జి.నాగేశ్వర రావు తెలిపారు. బుధవారం ఉదయం ఏయూ సెనేట్‌ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  à°¸à±à°•à°¿à°²à±‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సహాయంతో

ఏయూలో రక్షణ  à°‰à°¦à±à°¯à±‹à°—ులకు నైపుణ్యాలను అభివృద్ధి చేసే ప్రత్యేక కోర్సును నిర్వహించడం జరుగుతుందన్నారు. మూడు నెలకా వ్యవధి కలిగిన కోర్సును

ప్రారంభిస్తామన్నారు. ఒక్కో కోర్సులో 60 మందికి ప్రవేశం కల్పించడం జరుగుతుందన్నారు. ఫైర్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌, ఫారిన్‌ లాంగ్వేజెస్‌, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌

కోర్సును అందిస్తామన్నారు. ఏపి స్కిల్‌ డెవప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కోర్సు ఫీజును చెల్లిస్తుందని, జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ రక్షణ à°°à°‚à°—à°¾ ఉద్యోగులను

ఎంపికచేసి వారికి అవసరమైన కోర్సుల్లో ఎంపిక చేయడం జరుగుతందన్నారు. జులై నెల నుంచి ఈ కోర్సును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
    à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡

భారత వాయుసేనతో ఏడు ఎంఓయూలు చేసుకోవడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా వీరికి డిప్లమో, ఎంబిఏ, పీజీ డిప్లమో కోర్సు, సర్టిఫీకేట్‌లు జారీ చేస్తామన్నారు.భారత

నావికా దళంతో చేసుకున్న రెండు అవగాహన ఒప్పందాలో భాగంగా ఇంజనీరింగ్‌ కోర్సు, బిఎస్సీ (హల్‌ మెయింటెనెన్స్‌ అండ్‌ నేవల్‌ షిప్‌ డిజైన్‌ను) అందించడం

జరుగుతుందన్నారు.ఇప్పటికే 13 కోర్సుల్లో వెయ్యిమంది వరకు రక్షణ à°°à°‚à°— ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. విదేశీ భాష విభాగంలో ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులకు

ఫ్రెంచ్‌, ఉర్దు, జపనీస్‌, జర్మన్‌ భాషలో శిక్షణ అందిచామన్నారు.
    à°°à±‚సా తొలిదశలో భాగంగా రూ 20 కోట్లు వర్సిటీకి వచ్చాయని, తాజాగా రెండో దశలో రూ 100 కోట్లు వర్సిటీకి

వచ్చాయన్నారు. వీటితో నూతనంగా ఐఐఎం తరహాలో అంతర్జాతీయ స్థాయిలో ఎంబిఏ కోర్సును నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫార్మాసూటికల్స్‌, డ్రగ్‌ అనాసిస్‌లో

ప్రత్యేకంగా ప్రయోగశాలను రూ 15 కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాల ఆధునీకరణ, ప్రయోగశాల ఆధునీకరణకు ఇతర నిధులను వెచ్చించడం జరుగుతుందన్నారు.
/>     à°•à±à°°à±€à°¡à°²à±à°²à±‹ సైతం ముందుండే విధంగా à°ˆ విద్యా సంవత్సరంతో రెండు సౌత్‌ జోన్‌ టోర్నమెంట్‌లు, మూడు జాతీయ టోర్నమెంట్‌లకు ఏయూ ఆతిధ్యం ఇస్తుందన్నారు.
    à°­à°¾à°°à°¤

ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పి. హరి ప్రసాద్‌ మాట్లాడుతూ స్కిల్‌ డెవప్‌మెంట్‌, రక్షణ à°°à°‚à°— ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

తీసుకోవడం జరుగుతోందన్నారు. నైపుణ్యాభివృద్ది, రక్షణ à°°à°‚à°— ఉద్యోగులకు సమానమైన విద్యార్హత సర్టిఫీకేట్ల జారీ చేయడం వలన వారి భవిష్యత్‌ జీవనం ఎంతో

మెరుగవుతుందన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ కె.గాయిత్రి దేవి, రిజిస్ట్రార్‌ వి.ఉమా మహేశ్వర రావు, ఉజ్వల్‌ కుమార్‌ ఘటక్‌, రక్షణ à°°à°‚à°—à°¾ సిబ్బంది, సైనిక్‌ వెల్ఫేర్‌

అధికారులు తదితరులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam