DNS Media | Latest News, Breaking News And Update In Telugu

5 న మీ ఇంట భారతీయ జ్ఞాన జ్యోతులు వెలిగించండి: ప్రధాని మోడీ 

*విద్యుత్ ఆపండి, 9 నిమిషాల పాటు దీపం వెలిగించండి.*

*దేశం మొత్తం రాత్రి 9 à°—à°‚. నుంచి 9 .09 వరకు దీపాలు పెట్టాలి*  

*భారత్ లో జ్ఞాన జ్యోతులు విశ్వానికి

మార్గదర్శకం కావలి*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 03, 2020 (డిఎన్ఎస్) : ఈ నెల 5 వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 .09 గంటల వరకూ భారత

దేశం మొత్తం విద్యుత్ దీపాలు ఆపి, ఇంటి ఆవరణలో దీపాలని వెలిగించాలని భారత ప్రధాని నరేద్ర మోడీ పిలుపు ఇచ్చారు. శుక్రవారం ఉదయం దేశాన్ని ఉద్దేశించి సంక్షిప్త

సందేశాన్ని అందించారు. భారత దేశంలో వెలిగించే ప్రతి జ్ఞాన జ్యోతి మొత్తం ప్రపంచానికి మార్గదర్శకం కావాలన్నారు. ఆదివారం రాత్రి ప్రతి ఇంట్లోని విద్యుత్ దీపాలను

తొమ్మిది నిమిషాల సమయం పూర్తిగా నిలిపి వేసి, తమ ఇంటి గుమ్మం వద్ద, బాల్కనీలోనూ కొవ్వొత్తులతో గానీ, ప్రమిదల్లో గానీ దీపాలు ( జ్యోతి) వెలిగించాలని, అదే సమయంలో

మొబైల్ ఫోన్ లోని టార్చ్ లైట్ ను కూడా వెలిగించాలని సూచించారు.  à°®à±Šà°¤à±à°¤à°‚ 130 కోట్లమంది భారతీయులు ఒకే మాటపై నిలబడి కరోనా మహమ్మారి అనే రాక్షసిని à°ˆ విశ్వం నుంచి

పారద్రోలాలని కోరారు.  

à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘ మేము ఒక్కరమే ఇంట్లో ఉంటే ఏమి సాధిస్తామని ప్రజలు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను

జయించినట్లే. జనతా కర్ఫ్యూ ద్వారా భారతీయులు తమ శక్తి సామర్థ్యాలు చాటారు. భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.  à°ªà±à°°à°ªà°‚à°š దేశాలన్నీ ఇప్పుడు మన బాటలోనే

నడుస్తున్నాయి. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా పాటించాలి. à°ˆ ఆదివారం దేశ ప్రజలంతా కరోనాను తిప్పికొట్టే సంకల్పం తీసుకోవాలన్నారు. సంకట సమయంలో ఇది భారతీయులకు

శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. కరోనాపై పోరాడుతున్న అందరికీ ధన్యవాదాలు’’ అని మోదీ అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam