DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మద్యం విక్రయాలే ప్రభుత్వ పతనానికి తొలిమెట్టు: డా. కెవివివి

*ఇదేనా విద్యావిధానం లో తీసుకొచ్చే కొత్తమార్పులు.?*

*పాఠాలు చెప్పే టీచర్లకు మందు డ్యూటీలు వేస్తారా?

*ప్రజా ఆరోగ్యం భాద్యత వీళ్ళకి అవసరం లేదా

?*

*కేంద్రం చేసిన 40 రోజుల లాక్ డౌన్ ని నీరుగార్చేసారు.* 

*బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ సత్యనారాయణ

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్ , రిపోర్టర్ ,

విశాఖపట్నం ). . .*

విశాఖపట్నం, మే 05, 2020 (డిఎన్ఎస్) : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మద్యం విక్రయాల నిర్ణయం ప్రభుత్వ పతనానికి తొలిమెట్టు అని భారతీయ జనతా పార్టీ

రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్ కెవివివి సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలను ప్రారంభించడం తో ప్రభుత్వ వైఫల్యాలు బయట పడ్డాయన్నారు. మద్యం

కొనుగోళ్ల కోసం క్యూలో నుంచున్న వారిని అదుపు చేసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులను వినియోగిచడం కన్నా మరో దౌర్భాగ్యం ఇంకోటి లేదన్నారు. 

విద్యార్థుల

ప్రశ్నకు జవాబేదీ?  . .

మంచి సంస్కృతి నేర్చుకోమంటూ టీచర్లు స్కూళ్లల్లో పాఠాలు చెప్తారని , అదే టీచర్ ఇక్కడ మద్యం విక్రయాల్లో డ్యూటీలు చేస్తున్నాడన్నారు.

మద్యం తాగడం తప్పు అని మాకు చెప్పి , ఇప్పుడు మీరు చేస్తున్న పనేంటి అని ఇతని స్టూడెంట్స్ ప్రశ్నిస్తే టీచర్ ఏమి సమాధానం చెప్తాడన్నారు.  

లక్షల్లో జీతాలు

పొందే వీళ్ళకి భాద్యత లేదా? . . .

à°ˆ రాష్ట్రంలో మేధావులైన ఐఏఎస్ ఐపీఎస్ , గ్రూప్ 1  à°…ధికారులు, విద్యావేత్తలూ , విద్యావంతులైన ఉద్యోగులూ, వేలాదిగా ఉపాధ్యాయులూ ,

కళాశాలల అధ్యాపకులూ ఉన్నారని వీళ్లెవరికీ మద్యం విక్రయాలు తప్పు అనిపించలేదా అని ప్రశ్నించారు. .  

అంతకు మించి లక్షల్లో జీతాలు తీసుకునే సలహాదారులను

పెద్ద మొత్తంలోనే à°ˆ ప్రభుత్వం  à°¨à°¿à°¯à°®à°¿à°‚చుకుందని కనీసం వాళ్ళు కూడా ప్రభుత్వానికి ఇది తప్పు అని చెప్పక పోవడం క్షమించరాని నేరం అన్నారు. వీళ్ళు ప్రభుత్వానికి

ఎటువంటి సలహాలు ఇవ్వక పొతే వీళ్ళకి లక్షలాది రూపాయల జీతాలు , మందీ మార్బలం మెహెర్బానీలు మేజువాణీలు కూడా ఎందుకన్నారు.  

మద్యం అమ్మకాలు చెయ్యొద్దు అని

ప్రభుత్వానికి చెప్పవలసిన భాద్యత వీళ్ళెవ్వరికీ లేదా. . . ఇది తప్పు అని కనీసం ఒక్కరు కూడా చెప్పలేకపోయారా? అని ప్రశ్నించారు. 

పైగా ప్రజలు కట్టే పన్నులనే

వీళ్ళు లక్షలాది రూపాయలు జీతాలుగా తీసుకుంటున్నారు. à°† ప్రజల ఆరోగ్యం వీళ్ళకి అవసరం లేదా? అని అడుగుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam