DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా రవాణా బస్సుల్లో అన్ని ప్రయాణ రాయితీలు తాత్కాలిక రద్దు 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, మే 20, 2020 (డి ఎన్ ఎస్ ): గత 53 రోజులుగా లాక్ డౌన్ నేపథ్యంలో బస్సులు నడవని కారణంగా, అనంతరం నిబంధనల ప్రభావంతో

ఆర్ధిక భారాన్ని ద్రుష్టి లో పెట్టుకుని  à°†à°‚ధ్రప్రదేశ్‌ ప్రజా రవాణా సంస్థ (ఎస్ఆర్టీసీ)  à°µà°¿à°µà°¿à°§ వర్గాల వారికి కల్పిస్తున్న రాయితీ లను రద్దు చేస్తున్నట్టు కీలక

నిర్ణయం తీసుకుంది. ఇంత కాలం వరకూ వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, పాత్రికేయులు సహా వివిధ వర్గాలకు రాయితీలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ధిక భారం

నేపథ్యంలో à°ˆ రాయితీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. దాదాపు రెండు నెలల లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో రేపటి నుంచి

ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు ఇప్పటికే ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం

పాటించాల్సిన నేపథ్యంలో బస్సుల్లో సీట్ల సంఖ్యను ఆర్టీసీ కుదించింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ సహా ఏసీ సర్వీసుల్లో సీట్లను

తగ్గించింది. దీంతో ఆర్థికంగా సంస్థకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నందున వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ

యాజమాన్యం వివరించింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam