DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంపూర్ణ ప్రజారోగ్యమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం

*జిల్లా కు ఇచ్చిన మెడికల్ కళాశాల స్థలంపై దృష్టి పెట్టండి*

*తూగో జిల్లా అధికారుల సమీక్షలో ఏపి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని* 

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో,

అమరావతి)

అమరావతి, మే 26, 2020 (డి ఎన్ ఎస్ ): రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో కొత్తగా మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాల

నిర్మాణానికి స్థలం సేకరణ లో ప్రత్యేకంగా దృష్టి పెట్టమని ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ ( నాని ) సూచించారు.

 à°¤à±‚ర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టర్ à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯à°‚లో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశం లో ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతోవైద్య

ఆరోగ్య శాఖ పని తీరును పరిశీలించారు.పై  

అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో పేదలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

 

ఖాళీగా ఉన్న వైద్యుల పోస్ట్ లు , నర్సింగ్ సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిందన్నారు. 

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందోస్తు

చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. 
 
ప్రధానంగా ఏజన్సీ ప్రాంతాలలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న గిరిజనలకు వైద్యం అందించడానికి

24గంటలు పని చేయడానికి వైద్యులను నియమించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. 

మారుమూల గ్రామీణ ప్రాంతంలో ప్రత్యేకంగా వైద్య క్యాంపు లు

నిర్వహించడం కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించాలని అదేశాలు జారీ చేసారు.  

చింతూరు మండలంలోని పలు గ్రామాలలో గిరిజనలు అవగాహన లేక నాటు

వైద్యం వాడుతున్న దృష్ట్యా వారికి అవగాహన కల్పించడానికి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వైద్య సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య

శాఖాధికారిని ఆదేశించారు.   

ఏజెన్సీ లో కాళ్ళ వాపులతో బాధ పడుతున్న వారికీ కాకినాడ లో మెరుగైన వైద్యం అందించడానికి సత్వరమే చర్యలు

తీసుకోవాలన్నారు. 

చింతూరు లో పది పడకల డయాలసిస్ సెంటర్ రెండు రోజులలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులను అదేశిoచారు.  

ఏజెన్సీ

ఏరియా హాస్పిటల్స్ లో 24గంటలు వైద్యులు అందుబాటులో ఉండడానికి చర్యలు చేపట్టాం అన్నారు. 

త్వరలో మళ్ళీ జిల్లాలో మరో సారి పర్యటించి, వైద్య సదుపాయాల తీరును

స్వయంగా పరిశీలిస్తానాని తెలిపారు.  

వ్యాధులు ఎక్కువగా ప్రభులుతున్న ప్రాంతాలలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తరసుగా పర్యటన చేయాలన్నారు. 

పేదలకు

వైద్య సదుపాయం కల్పించడంలో అలసత్వం వహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి పేదలకు వైద్యం అందించే

విషయంలో ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టారు. 

కరోనా వైరస్ సోకకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.  

మాస్క్ లు తప్పనిసరిగా వినియోగించుకోవాలి.. బౌతిక

దూరం పాటించాలన్నారు.  

ఈ సమావేశంలో పాల్గొన్న ఏపి రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి శుబోస్ చంద్రబోస్, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే

చంద్రశేఖర్ రెడ్డి  à°µà±ˆà°¦à±à°¯ ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam