DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రా అభివృద్ధికై శ్రమిస్తున్న తెలంగాణ పాత్రికేయునికి అదనపు భాద్యతలు

*అమర్ కు మరో బంపర్ అఫర్, అదనపు భాద్యతలు అప్పగింత. .*

*జాతీయ మీడియా సలహాదారుకు ఏపీ జెన్‌కో భాద్యతలు కూడానూ. .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 05, 2020 (డిఎన్ఎస్):* జాతీయ మీడియా సలహాదారు గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పడికే బంపర్ అఫర్ పొందిన దేవులపల్లి అమర్

కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాక్ పాక్ లాంటి మరో బంపర్ అఫర్ ఇచ్చారు. 

విద్యుత్ రంగ వ్యవహారాల్లో దేవులపల్లి అమర్ కు ఉన్న అత్యున్నత అనుభవం గమనించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ను ఆంధ్ర ప్రదేశ్ జెన్ కో సలహాదారుగా నియమించినట్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకాలం వరకూ అయన ఒక మీడియా ప్రతినిధిగానే ఉభయ తెలుగు

రాష్ట్రాల ప్రజలకు తెలుసు. అయితే అయనకు విద్యుత్‌రంగంలో విశేషానుభవం ఉన్న విషయం గమనించిన 
ఏపీ సర్కారు  జెన్‌కో సలహాదారు పదవి ఇచ్చింది. విద్యుత్ రంగంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అవాంతరాలన్నంటినీ తన అనుభవంతో తృణప్రాయంగా తప్పించగలరని విద్యుత్‌రంగ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నట్టు

సమాచారం. గతంలో తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొన్న విద్యుత్ సమస్యలకు పరిష్కారం కోసం అమర్ ను సంప్రదించి ఉండవలసిందనే అభిప్రాయాలూ కూడా వ్యక్తమవుతున్నాయి.

ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లో నడిపించాలి అని నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి తెలంగాణకు చెందిన పాత్రికేయుడు కావడం గమనార్హం. గతంలో

తెలంగాణ కు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని పాత్రికేయులతో ఉద్యమం నడిపించిన మహనీయులు ఈయన. ఇంతకీ ఆయన పోరాటం చేసింది ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసమే అనే విషయం తెలిసి అందరూ అభినందిస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam