DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైష్ణవ సంప్రదాయంలో వైభవంగా కణ్ణన్ తిరునక్షత్రం

*(DNS report : Sairam CVS, బ్యూరో, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 10, 2020 (డి ఎన్ ఎస్):* శ్రీవైష్ణవ సంప్రదాయం లో రోహిణి నక్షత్ర ఆధారంగా అనుసరించి శ్రీ కృష్ణ జన్మాష్టమిని  కణ్ణన్ తిరునక్షత్రం ' లేక "శ్రీ జయంతి గా కృష్ణుడి పుట్టినరోజు జరుపుకుంటారు. ఈ నక్షత్ర తేదీ ప్రకారం సెప్టెంబర్ 10 గురువారం దేశవ్యాప్తంగా అన్ని

వైష్ణవ గృహాల్లోనూ, వైష్ణవ క్షేత్రాల్లోనూ అత్యంత వైభవంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. సాధారణంగా కృష్ణుడు పుట్టినది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి పూట చేసుకుంటారు దాన్నే కృష్ణాష్టమి అనడం ఆనవాయితీ. అయితే శ్రీకృష్ణాష్టమి ఎప్పుడు చేసుకోవాలి అనే దాని గురించి ఒక నిర్ణయం ఉంది. సూర్యుడు సింహమాసంలో ఉండాలి,

బహుళ ఆష్టమి రోహిణి నక్షత్రం ఉండాలి. మొట్టమొదట స్వామి అవతరించినప్పటి గ్రహస్థితి అది. ప్రతి సంవత్సరం అన్నీ కలిసి అట్లానే రావడం రాక పోవచ్చు, కానీ అవతారం జరపాలి అంటే నక్షత్రాన్ని ప్రధానం చేసుకొని చేయాలి.

సింహమాసే సితే పక్షే రోహిణ్యామష్టమీ తిథౌ |
చరమార్థ ప్రదాతారం కృష్ణం వన్దే జగద్గురుమ్

!!

పవిత్రమైన తిథి, నక్షత్రము, లగ్నము, సమయము అన్నీ కలిపినదానిని 'జయంతి ' అంటారు. అటువంటి శుభముహూర్తంలో పుట్టినది కృష్ణుడు ఒక్కడే కాబట్టి కృష్ణుడి పుట్టినరోజుకే జయంతి అన్నపదం వాడాలి. కృష్ణాష్టమి జరిపేది నక్షత్రాన్ని అనుసరించి.

శుభ కార్యక్రమాలన్నీ నక్షత్రం ప్రకారమే జరుపుకోవాలి తప్ప తిధి

ప్రకారం కాదు అన్నది పెద్దల వాక్కు. అందుకే ఎవరి పుట్టినరోజు అయినా నక్షత్రం అనుసరించే చేయ్యాలంటారు. ఎవరేనా మీ జన్మనక్షత్రం ఏదీ అని అడుగుతారు కానీ, మీ జనం తిథి ఏదీ అని అడగరు కదా? జాతకాలకు కూడా జన్మ నక్షత్రాన్నే ఎక్కువ వాడతారు. కాబట్టి కొన్ని సాంప్రదాయాల వారు నక్షత్రాన్ని అనుసరించే పుట్టినరోజు

చేస్తారు.

విశాఖ ప్రాంతంలోని సింహాచలం, శ్రీకూర్మం, తదితర దివ్యక్షేత్రాల్లోనూ, అన్ని శ్రీ వైష్ణవ సాంప్రదాయ గృహాల్లోనూ ఉదయం నుంచే ప్రత్యేక ఆరాధనలు, ఉట్టి కొట్టే ప్రక్రియలో, చిన్నారులచే వేష ధారణలు, శ్లోక పఠనం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

విశేష ఆరాధనలు మాత్రం సాయంత్రం సమయంలోనే

జరుగుతాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam