DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తర్వేది నృసింహుని కొత్త రథం తయారీకి సన్నాహాలు 

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 19, 2020 (డి ఎన్ ఎస్ ):* తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ  నరసింహస్వామి వారి రధం దగ్ధం అయిన తదుపరి నూతన రధాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దపడింది. హిందూమత విధానాలపై బద్దవిరోధులుగా తయారైన అన్యమతమతోన్మాదులైన పిచ్చొళ్ళు 65 ఏళ్ళ కాలం

నాటి స్వామి రధాన్ని తగులబెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ భక్తులు నిరసనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో భక్తుల ఒత్తిడి తట్టుకోలేని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరొక రథాన్ని అదే నమూనాలో తయారు చేస్తున్నట్టు ప్రకటించింది. నాటి నిరసనల్లో 43 మందిపై అక్రమంగా కేసులు పెట్టిన ఘటనలు జరగడంతో బీజేపీ, సంఘ్ పరివార నేటికీ

నిరసనలు తెలియచేస్తూనే ఉన్నాయి.  

ఆ మెరకు శనివారం శాస్త్రోక్తంగా నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభ మయ్యాయి. వచ్చే స్వామి వారి కల్యాణోత్సవం కి నూతన రథం పై స్వామి వారి ఊరేగింపు జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించడం తో  నూతన రథం నిర్మాణం పనులను పూజ చేసి శరవేగంగా అధికారులు ప్రారంభించారు.  దీనిలో భాగంగా

కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం వెంకట సాయి  టింబర్ డిపో లో ఉన్న కలపను గుర్తించి నేడు శాస్త్రోక్తంగా పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ నూతన రధం నిర్మాణానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 95 లక్షల రూపాయిలు కేటాయించి, నూతన రధం న మూనా కు ఆమోదం తెలపడం తో నిర్మాణ పనులు అధికారులు శరవేగంగా చేస్తున్నారని అధికారులు

తెలిపారు.

ఈ కార్యక్రమం లో రాజమహేంద్రవరం ప్రాంతీయ కమిషనర్ డి. భ్రమరాంబ ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం లో పాల్గొన్న ఆలయ సిబ్బంది వారి వారి సంప్రదాయాల ప్రకారం అర్చనలో పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam