DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సచివాలయ సిబ్బంది పనితీరును మెరుగు పర్చుకోవాలి

*సిబ్బందికి తూగో జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి ఆదేశం*

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 24, 2020 (డి ఎన్ ఎస్ ):* రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న సచివాలయ సిబ్బంది తమతమ పనితీరును మరింతగా

మెరుగుపెర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి ఆదేశించారు. రామచంద్రపురం పట్టణంలో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఏడో నెంబర్‌ సచివాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వార్డు సచివాలయాల్లో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ముఖ్యంగా కుల, ఆదాయ దృవపత్రాల మంజూరు చేస్తున్న తీరును ఆయన

అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఇచ్చిన సమాధానంపై ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నా లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది తమ వృత్తిపట్ల మరింతగా అంకితమై

ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆదేశించారు. అనంతరం కొత్తూరు మున్సిపల్‌ పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమంలో చేపడుతున్న పనుల తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనుల తీరు పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి మాట్లాడుతూ నాడు-నేడు పథకంలో చేపడుతున్న పనులను

నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో రామచంద్రపురం ఆర్‌డిఒ గాంధీ, మున్సిపల్‌ కమిషనర్‌ రాజు గోపాల్‌ రావు, ఎంఈఓ శ్రీనివాస్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam