DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కన్నకొడుకే కర్కశుడిగా మారాడు: విశాఖ లో ఓ మహిళ ఆవేదన

*కన్నకొడుకు చేసే భౌతిక వేధింపుల నుంచి రక్షించండి:*

*ఫుట్ బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షునిపై పోలీసులకు ఫిర్యాదు*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 09, 2021  (డి ఎన్ ఎస్):* కన్నకొడుకు నుంచి నిత్యం ఎదురవుతున్న మానసిక, భౌతిక దాడుల నుంచి తనను రక్షించమంటూ 75

ఏళ్ళ ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే. . విశాఖ లోని కృష్ణానగర్ కు చెందిన కొసరాజు విజయలక్ష్మి ( 75 ఏళ్ళు) పేరిట ఉన్న స్థిర, చరాస్తులు తన పేరిట మార్చాలంటూ ఆమె కుమారుడు కొసరాజు గోపాల కృష్ణ ( ఆంధ్ర ప్రదేశ్ ఫుట్ బాల్ సంఘం అధ్యక్షుడు ) గత కొన్ని నెలలుగా ఆమెను వేధిస్తున్నారు. ఆమె పేరిట విశాఖ సహా ఇతర

ప్రాంతాల్లోనూ ఉన్న అత్యంత ఖరీదైన ఆస్తులను అక్రమంగా ఆక్రమించుకోడమే కాక, వాటిని తక్షణం తన పేరిట మార్చవలసినదిగా తీవ్రమైన ఒత్తిళ్లకు లోనుచేశారు. అయితే ఆమె ససేమిరా అనడంతో మానసిక వేదనకు గురి చేయడం మొదలు పెట్టారు. తదుపరి తన చర్యలను మరింత తీవ్రతరం చేసి భౌతిక దాడులు సైతం చెయ్యడంతో ఆమె తమ సమీప బంధువులకు ఈ సమస్యను

వివరించారు. వారు గోపాలకృష్ణ తో మాట్లాడి, సమస్యను సామరస్యంగా పరిషష్కరించే ప్రయత్నం చేసారు. ఆపై గోపాలకృష్ణ మరింత మనోవేదనకు గురి చెయ్యడం తో విజయలక్ష్మి 19- 7- 2019 న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనిపై విచారణ చేసిన పొలిసు సిబ్బంది, ఎఫ్ ఐ ఆర్ ను సైతం నమోదు చేయడం జరిగింది. తదుపరి కొంత సాధారణంగా ఉన్నప్పడికి గత రెండు

రోజులుగా ఈ వేధింపులు మరింత ఉదృతం చెయ్యడం ఈ నెల 7 న మరొకసారి స్థానిక మహారాణిపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది.  
తన కుమారుడు రాష్ట్ర ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు కావడంతో స్థానికంగా పరపతి ఉందని, అయితే తనకు ఎవరి సహాయం లభించకుండా చేసేందుకు ప్రయత్నాలు కూడా జరిగినట్టు తెలుస్తోందన్నారు. ఈ వయసులో తనకు కలుగుతున్న

మనోవేదన, భౌతిక దాడుల నుంచి తనను రక్షించాలని విజయలక్ష్మి కోరుతున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam