DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరిపై సమాచార వ్యవస్థలోనే సమాచార లోపాలెన్నో?

*సింహగిరిపై అర్చనలే కాదు,  సమాచారం కూడా గోప్యమేనా?* 

*చందన యాత్ర వివరాలు చెప్పకూడదని ఆదేశాలున్నాయా?* 

*చందన మిశ్రమ ద్రవ్యాలు, ఘటాభిషేకంపై సమాచార లోపం*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 12, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాలల ఇలవేల్పు గా

కొనియాడబడుతున్న శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి, దేవస్థానం సింహాచలం లో సమాచార శాఖా లో లోపాలు కొట్టవచ్చినట్టు పూర్తిగా దర్శనమిస్తున్నాయి. దేవస్థానాన్ని ప్రపంచ దేశాల్లో విస్తృతంగా వ్యాపించి చేసి, సాంకేతిక ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం  చేసేందుకు దేవస్థానం ఈఓ, ట్రస్ట్ చైర్ పర్సన్ లు ప్రవేశ పెట్టిన పిఆర్ఓ

వ్యవస్థ నుంచి మీడియా వారికి పూర్తిస్థాయి సమాచారం లభించడం లేదు. ఈ పిఆర్ ఓ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి మీడియా పై ఆంక్షలు అమలు లోకి వచ్చాయి. దేవస్థానం గురించిన ఏ విధమైన సమాచారాన్నైనా పిఆర్ ఓ సిబ్బంది నుంచే లభిస్తుంది అని అధికారులు ప్రకటించారు. 

అయితే ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి పూర్తి సమాచారం

అంకెలతో సహా   పిఆర్ సిబ్బంది వద్ద ఉండవలసిన అవసరం ఉంది. తెలియని అంశాలను సంబంధిత సిబ్బంది నుంచి సేకరించిన తదుపరి మీడియా ద్వారా సమాచారాన్ని అనిందించవలసి ఉంటుంది. 

అసంపూర్తి సమాచారం తో మీడియా వార్తలను ప్రచురణ చెయ్యడం కుదరదు. వార్తల ప్రచురణ కోసం అదనపు సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం మీడియా చేస్తుంది.

వాటికి తగిన సమాధానాన్ని సేకరించి తిరిగి మీడియా కు తెలియచేయవలసిన విధి పిఆర్ సిబ్బంది పైనే ఉంటుంది. అయితే ఆ విధుల నిర్వహణలో పూర్తి వైఫల్యం కొట్టవచ్చినట్టు సింహాచల దేవస్థానం లో కనిపిస్తోంది. 

ఈ అంశంపై ఆలయ ఈఓ సైతం స్పందించాల్సిన అవసరం ఉంది. దేవస్థానానికి సంబంధించినా విషయాలను ఎటువంటి సమాచార లోపం లేకుండా

మీడియా ద్వారా ప్రజలకు అందించాల్సిన పిఆర్ వ్యవస్థలోనే సమాచార లోపం ఉండడం గమనార్హం. 

ప్రస్తుతం జరుగుతున్న స్వామి నిజరూప దర్శనం ( చందనయాత్ర ) గురించిన రెండు అంశాలను తెలియచేయాల్సిందిగా DNS మీడియా పిఆర్ సిబ్బందిని, ఈఓ ను, ఆలయ స్థానాచార్యులనూ సోషల్ మీడియా కూడా కోరడం జరిగింది. అయితే ఎటువంటి సమాచారం

లభించలేదు. 

ఆలయానికి సంబంధించిన అంశాలను వివరించకూడదు అనే నిబంధనలు ఉన్నయామో తెలియదు, కనీసం ఆ విషయాన్నైనా మీడియా కు తెలియచేయాల్సి ఉంది.  

DNS మీడియా అడిగిన అంశాలు ఇవే. .. 

1 .చందనం లో కలిపే ద్రవ్యాల కొలతలు గురించి

2 .సహస్ర ఘటాభిషేకం జరిపే విధానం.  
                     

       = = = 

1 .చందనం లో కలిపే ద్రవ్యాల కొలతలు గురించి

శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి, సింహాచలం దేవస్థానం లో చందన యాత్ర తర్వాత  రోజున స్వామికి సమర్పించే చందనం మొత్తం 125 కిలోలు ఉంటుంది. 

వీటిలో చందనం తో పాటు, ఇతర సుగంధ ద్రవ్యాలు కూడా కలుపుతారు. 

గత 5 రోజుల పాటు మొత్తం ఎన్ని

కిలోల చందనం తీశారు?

సుగంధ ద్రవ్యాలు. ఏవేవి కలుపుతున్నారు?

వీటిల్లో ఏ ఏ సుగంధ ద్రవ్యాలు కలుపుతున్నారు. ఒక్కోటి ఎన్ని కిలోల కలుపుతున్నారు.


2 .సహస్ర ఘటాభిషేకం జరిపే విధానం.

ప్రతి ఏడాది గంగ ధర నుంచి శ్రీవైష్ణవ స్వాములు మట్టి కళాశాలతో జలాన్ని తీసుకుని గర్భాలయం లోకి రావడం

జరుగుతుంది. అక్కడ స్వామికి అభిషేకం ఉంటుంది.

అయితే ఈ ఏడాది ఆ అవకాశం లేనందున, కేవలం అర్చక స్వాములే జరపాల్సిన సందర్భం.

వీళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేశారు. ఒక్కో కలశను  గంగాధర నుంచే తీసుకు వస్తారా ?  లేక  ఆలయంలోనే పెద్ద  గంగాళాల్లో ముందుగానే నీరు నింపుకుని  అక్కడ నుంచి కళాశాలతో అభిషేకం చేస్తారా?

 తెలియచేయగలరు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam