DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఖాకీ నుంచి కాషాయం వరకూ. .బీజేపీ కర్మయోగి ప్రస్థానం 

*పరమార్ధం కోసం పోలీసు డ్రెస్ వీడిన జయచంద్ర రాజు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*చిత్తూరు / విశాఖపట్నం, జులై 15, 2021 (డిఎన్ఎస్):* ప్రస్తుత సమాజంలో అన్ని ప్రభుత్వ కొలువుల్లోనూ ప్రజల్లో అత్యంత విలువైన, ఆదాయ వనరులు వచ్చే వాటిల్లో పోలీసు ఉద్యోగం కూడా ఉంది అనడం అతిశయోక్తి కాదు. విధుల్లో ఎన్ని కష్టాలు

వచ్చినా అలాంటి అదనపు ఆర్ధిక వనరులు వచ్చే ఉద్యోగాన్ని వదులుకోడానికి చాలామంది సిద్ధంగా ఉండరు.  అయితే తానూ పుట్టిన మానవ జన్మకు తగిన పరమార్ధాన్ని తెలుసుకుని అమలుచేసేందుకు సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా విడిచి పెట్టి, నేడు ఎందరికో అండగా నిలిచినా వారు ముసునూరు జయచంద్ర రాజు. 

కేవలం

కరెన్సీ నోట్ల కోసం తమ సిద్దాంతాలను, విలువలను, జీవితాన్ని సైతం తాకట్టు పెడుతున్న ప్రజా జీవనం నుంచి తాను నమ్మిన ధర్మం కోసం తన ఉద్యోగాన్ని సైతం లెక్క చేయనిమహా వ్యక్తి ఈయన.  

పోలీస్ ఆఫీసరయిన జయచంద్ర రాజు గారు, తన 19 సంవత్సరాల సర్వీసులొ 25 సార్లు ట్రాన్స్‌ఫర్లయ్యారు. గొప్ప నిజాయితీతో పనిచేస్తుండటంతో

అడుగడుగునా అధికారులు, రాజకీయనాయకుల వేధింపుల ఎక్కువవ్వడంతో తన ఉద్యోగానికి 2010 లొ రాజీనామా చేశారు. 
తరువాత భారతీయ జనతా పార్టీ లొ జాయినయ్యారు. అప్పటి నుండి చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం లోని రాజుల కండ్రిక లో తనకున్న పొలాన్ని అమ్మి రాజులకండ్రిగ గ్రామంలొ గొప్ప దేవాలయాన్ని, ఒక ఆశ్రమం  నిర్మించారు. తన ఆశ్రమంలో

నిరుపేదలకు అన్నదానం చేస్తూ, ప్రజలకు పిల్లలకు భగవద్గీత , ధర్మం బోధిస్తూ, అవినీతికి వ్యతిరేకంగా పాదయాత్రలు చేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నారు.  

ధర్మరక్షణసమితి ని స్ధాపించి ప్రజల సమస్యల పై పోరాటం చేస్తూ జనం మధ్య బతుకుతున్నారు. అమాయక ప్రజలపై కుటుంబ పార్టీలు పెడుతున్న అక్రమ కేసులను చూడలేక, 50 సంవత్సరాల

వయస్సులొ లా విద్య ను చదివి ఇప్పుడు న్యాయవాదిగా ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్నారు. 

జయచంద్ర రాజు గొప్పతనాన్ని గుర్తించిన బిజెపి, ఈయనను చిత్తూరు జిల్లా లీగల్‌ సెల్ కన్వీనర్ గా నియమించడం విశేషం. ఇలాంటి మహానుభావులను మనం నూటికో కోటికో ఒకరిని చూడగలం

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam