DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కార్తీకంలో పంచారామ క్షేత్ర దర్శిని కై ఆర్టీసీ బస్సులు 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 13,  2021 (డిఎన్ఎస్):* కార్తీక మాసం సందర్భంగా విశాఖపట్నం నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలకు ( ఐదు శివాలయాలు) APSRTC ప్రత్యేక బస్సులను నడపనుంది. అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట మొత్తం ఐదు శివాలయాలకు బస్సులు నడపనున్నారు. కార్తీకమాసం లో

ప్రతి ఆదివారం ( నవంబర్ 7, 14, 21, 28 తేదీల్లో)  సాయంత్రం 5 గంటలకు విశాఖ నుంచి బయలు దేరి సోమవారం ( నవంబర్ 8, 15, 22, 29 తేదీల్లో) ఉదయం నుంచి ఈ క్షేత్రాలు దర్శనం అనంతరం రాత్రికి విశాఖ చేరుకుంటాయి.  

ఈ సర్వీస్ టిక్కెట్లు సూపర్ లక్సరీ బస్సులో పెద్దలకు రూ. 2000 /-, పిల్లలకు రూ. 1700 /-, అల్ట్రా డీలక్స్ బస్సులో పెద్దలకు రూ. 1900 /-, పిల్లలకు రూ. 1600

/-, లుగా నిర్ణయించారు. 
1 . అమరావతి లోని శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయం,  
2 . భీమవరం లోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం,  
3 . పాలకొల్లు లోని శ్రీ క్షీరారామ స్వామి దేవాలయం,  
4 . ద్రాక్షారామం లోని శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం,  
5 . సామర్లకోట లోని శ్రీ కుమార రామ లింగేశ్వర స్వామి దేవాలయం,  

ఆసక్తి

ఉన్నవారు పూర్తి వివరాలకు 9959225602, 7382914183, 9959221199, 7382921540, నెంబర్లలో సంప్రదించవచ్చు లేదా  www.apsrtconline.in వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam