DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రిటిష్ సంస్థ చేసిన ప్రకటన పాక్ విమాన ప్రమాద రహస్యాన్ని బయట పెట్టింది 

మార్టిన్ బేకర్ తన సీటు సామర్ధ్యం చెప్పింది, పాక్ పరువు తీసింది.

(Report:Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)

*విశాఖపట్నం, జూన్ 22, 2024 (డి ఎన్ ఎస్ ):* బ్రిటన్ కు చెందిన మార్టిన్ బేకర్ సంస్థ తన గొప్ప చెప్పుకోడానికి చేసిన ప్రకటన పొరుగుదేశం పాకిసాన్ గుట్టు రట్టు చేసి, పరువు తీసేసింది సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం

జరుగుతోంది. ఈ నెల 5 వ తేదీన పాకిస్తాన్ కు చెందిన జేఎఫ్ 17 వైమానిక దళం బ్లాక్ 2 విమానం ఝంగ్ జిల్లాలో ఘోర ప్రమాదానికి గురయ్యింది. దీని పైలట్ సీట్ లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల విమానం నడుపుతున్న పైలట్ సురక్షితంగా బయట పడ్డాడు. ఈ విషయాన్నీ బయటకు పొక్కనివ్వకుండా మీడియా, సోషల్ మెదిలేలా పై పాకిస్తాన్ అన్ని ఆంక్షలు

విధించింది. మిలిటరీ విమానం కావడంతో మీడియా పై మరిన్ని ఆంక్షలు విధించారు. ఇన్ని రోజుల పాటు ఈ ఘటన బయటకు తెలియ లేదు. అయితే ఈ విమానం పైలట్ సీటు తయారు చేసిన సంస్థ బ్రిటన్ కు చెందిన మార్టిన్ బేకర్ సంస్థ జూన్ 11 న బయట పెట్టేసింది. ఈ సంస్థ తమ నాణ్యత, నైపుణ్యం ప్రపంచానికి తెలియచేయడం కోసం విడుదల చేసిన ప్రకటన లో జూన్ 5 ,2024 న (బుధవారం)

 పాకిస్తాన్ లోని ఝంగ్ జిల్లా లో జరిగిన  జేఎఫ్ 17 పాక్ విమానం జేఎఫ్ 17 ప్రమాదానికి గురయ్యింది. ఈ విమానం లో వాడిన మార్టిన్ బేకర్ పీకే 16 ఎల్ ఈ ఎజెక్ట్డ్ డ్  సీట్ వల్ల పైలర్ సురక్షితంగా బయటపడాడ్డు. తమ సంస్థ ఇంతవరకూ సీటు వల్ల 7723 జీవితాలను కాపాడగలిగాం అని సోషల్ మీడియా లో జూన్ 11 న ప్రకటించింది. ఈ ప్రకటన పాకిస్తాన్ లో జరిగిన జె

ఎఫ్ 17 విమాన ప్రమాదాన్ని బయట పెట్టేసింది. 
చైనా తయారు చేసిన ఈ విమానాన్ని చూపించే భారత్ పై దురుసుగా వ్యాఖ్యలు చేస్తోంది పాకిస్తాన్.  అంతటి  సూపర్ పవర్ కుప్పకూలిపోవడంతో పాక్ పరువు రచ్చ కెక్కినట్టయ్యింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam