DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాంగ్రెస్ కుట్రల్లో భాగమే.. గంగాసాగర్ కెనాల్ పేరు ఇందిర గా మార్పు

*కెనాల్ కట్టింది బికనీర్ రాజా,  ఇందిర కెనాల్ గా పేరు మార్చేసింది కాంగ్రెస్*  

*కాంగ్రెస్ కుట్రకు మార్వాడా భగీరధుడు మహారాజ్ గంగ సింహ్ బలి* 

*ఇతరుల శ్రమను దోచుకుని తమ ఖాతాలో వేసుకోవడంతో కాంగ్రెస్ నెం. 1*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*

*విశాఖపట్నం, ఆగస్టు 15, 2024 (డిఎన్ఎస్):* శ్రమ

ఒకరిది, పేరు, గొప్ప మరొకరిది అనడానికి భారత దేశంలో ఎన్నో ప్రత్యక్ష నిదర్శనాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి గంగాసాగర్ కెనాల్ అదే ఇందిరాగాంధీ కెనాల్. ఇది రాజస్థాన్ లోని థార్ ఎడారి లో బికనీర్ లో ఉంది.
ఆసియాలోనే అతిపెద్దకాలువ,  ఈ కెనాల్ కోసం బికనీర్ మహారాజు గంగా సింహ్ జీ రాథోడ్, తన ఆస్తులను పూర్తిగా విరాళం ఇవ్వడమే కాక

బ్రిటిష్ వారితో పోరాడి మరీ నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి గంగా నహర్ కెనాల్ అని పేరు పెట్టారు. స్వాతంత్య్రం  వచ్చాక కాంగ్రెస్ పాలకులు దీనికి ఇందిరా గాంధీ కెనాల్ అని పేరు మార్చారు. శ్రమ మహారాజు ది, పేరు మాత్రం ఇందిరకు ఇచ్చేసారు. పేరు మార్చడం తప్ప కాంగ్రెస్ ఈ కెనాల్ కు చేసింది ఏమి లేదు. 

ఈ గంగా సాగర్ కెనాల్

నిర్మాణం :
రాజస్థాన్ లోని థార్ ఎడారి లో బికనీర్ ప్రాంతం  పూర్తిగా ఎడారి ప్రాంతం కావడం తో చుక్కనీరు దొరకని ప్రదేశం. పైగా 1899-1900 సం: లో తీవ్రమైన కరవు వచ్చింది. ఎడారి ప్రజలకు నీటి బాధలు ఉండకూడదని  బికనీర్ మహారాజు గంగా సింహ్ జీ రాథోడ్, ప్రజల బాధలను తీర్చడానికి పంజాబ్ లోని సట్లెజ్ నది హరికే బారేజ్ నుండి ఎడారి ప్రాంతంలో

బికనీర్ వరకు ఒక కాలువను తవ్వించారు. అది ఆసియాలోనే అతిపెద్దకాలువ. దానికి గంగా నహర్ అని ( గంగా కాలువ ) పేరుపెట్టారు. 

ఆ కాలువ పనులు 5 డిసెంబర్ 1925 లోప్రారంభించారు. దాన్ని 26 అక్టోబర్ 1927 నుండి వాడటం ప్రారంభించారు. దానికి పంజాబ్ లోని సట్లెజ్ నది హరికే బారేజ్ నుండి నీరు తీసుకుని అక్కడనుండి బికనీర్ వరకూ కాలువ తవ్వారు.

దానికోసం బ్రిటిష్ వారితో పోరాడి సాధించారు. గంగాసింగ్ రాథోడ్ కి మార్వాడా భగీరధుడని పేరు. ఆయన ఆకాలువకై తన సర్వాన్నీ సమర్పించి కాలువ తవ్వించారు. విశేషమేమంటే 650 కిలోమీటర్ల పొడవునా కాలువకింద రాగి ప్లేట్లను అమర్చి కాలువకిరువైపులా లైమ్ స్టోన్ రాళ్ళతో రివిటింగ్ చేయించారు. నీరు ఇసుకలో ఇంకి పోకుండా ఈ ఏర్పాటు చేశారు.

ఇప్పుడు ఇదే కాలువ మొదటిదశ మరమ్మతులు చేయించడానికి వరల్డ్ బాంక్ అప్పుగా రూ. 500 కోట్లు ఇచ్చింది. రెండవ దశ కింకెంతవుతుందో తెలియదు. అంటే అసలు కాలువ నిర్మించడానికి 100సం: ల క్రితం ఎన్నివేల కోట్ల రూపాయలు మహారాజా గంగాసింగ్ ఖర్చుచేశారో ఊహించండి. ఈ కాలువ వలన 11-12 జిల్లాలకు తాగునీరు సాగునీరు అందుతుంది. ఈ రోజు నవ్య బికనీర్ ఇలా ఉందీ

అంటే అది గంగాసింహ్ జీ రాథోడ్ గారి చలవే! 

ఇది భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సమీపంలోని సట్లెజ్ నది నుండి సరఫరా చేయబడుతుంది. ఫరీద్‌కోట్ , ఫజిల్కా మరియు ముక్త్‌సర్ జిల్లాల గుండా వెళుతుంది . ఫరీద్‌కోట్‌లోని జోక్ సర్కారీ గ్రామం దాని మార్గంలో ఉంది.

మొత్తం

ప్రాజెక్టు వ్యయం 1943 వరకు రూ. 310.97 లక్షలు. గ్యాంగ్ కాలనీ మరియు రైల్వేల అభివృద్ధికి మరో 60 లక్షలు ఖర్చు చేశారు. కాలువ నిర్మాణం తరువాత, దక్షిణ పంజాబ్ నుండి చాలా మంది ప్రజలు ఈ ప్రాంతానికి వలస వచ్చారు, రాష్ట్ర పరిపాలన వారికి అనేక సౌకర్యాలను కల్పించింది. కాలువ నుండి నీటి లభ్యతతో, ఈ ప్రాంతం ధనిక భూమిగా రూపాంతరం చెందింది మరియు

గంగానగర్ రాజస్థాన్ యొక్క ధాన్యాగారంగా మారింది

కట్టడం పూర్తి అయ్యాక . . .. కాంగ్రెస్ దోపిడీ 

కాణీ ఖర్చు చెయ్యకుండా శ్రమలేకుండా ఎవరో చేసిన దాతృత్వాన్ని దొంగిలించడం మనదేశంలోని ఒక కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. ఇందిరా గాంధీ మరణం తర్వాత నవంబర్ 2 , 1984 సంవత్సరం లో ఆకస్మికంగా ఆ కాలువ పేరును ఇందిరా

గాంధీ కెనాల్ గా మార్చేశారు. ఈ నిర్మాణం లో కాంగ్రెస్ కు గానీ, ఇందిరా గాంధీ కి గానీ ఏమాత్రం అనుబంధం లేదు. అయినప్పడికి బికనీర్ మహారాజ  గంగాసింగ్ రాథోడ్ పేరు తొలగించి ఇందిరా పేరు పెట్టేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 
ప్రజల దాహార్తి తీర్చేందుకు బికనీర్ మహారాజు చేసిన భూరి విరాళం, నిర్మాణం కృషి మొత్తం తుంగలోకి

తొక్కి కాంగ్రెస్ పూర్తిగా ఆయనను అవమానించింది.  కనీసం దీన్ని ప్రశ్నించే వాడు కూడా లేదు. ఈ దేశంలో తమ పేరు పెట్టుకోవడానికి వారికి సిగ్గులేదు. కనీసం  ఇదేం అన్యాయమని అడగకపోవడానికి ప్రజలకు కూడ కృతజ్ఞత లేదు.

ఇతరుల ఉదారత తో నిర్మించిన చాలా ప్రాజెక్ట్ లకు కాంగ్రెస్ తన పేర్లు పెట్టేసుకుని, వాళ్ళ శ్రమను

పూర్తిగా దోపిడీ చేసింది అనడానికి గంగా నెహెర్ కాలువ ప్రత్యక్ష నిదర్శనం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam