Jun 7, 2026 3:54 pm
*దేశ విద్రోహులు జన్ జి ఎలా అవుతారు బొద్దింకలు అవుతారు ?*
*డీప్ స్టేట్, విద్రోహ శక్తులు, తేడా యూట్యూబర్ల పై చర్యలకు డిమాండ్*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, జూన్ 07, 2026 (డిఎన్ఎస్ ):* భారత జన్ జి కి ప్రతినిధి అంటే నార్వే చదరంగం పోటీల్లో విజేతగా నిలిచిన యువ మేధావి రమేష్ బాబు ప్రజ్ఞనంద నిలుస్తాడు తప్ప దేశాన్ని విద్వంసం చెయ్యాలి అని ఉద్యమాలు చేసే దేశద్రోహులు ఎలా అవుతారని విద్యార్థి లోకం మండిపడుతోంది. గత మూడు వారాలుగా సోషల్ మీడియాల్లో నానా రచ్చ చేసిన బొద్దింకలు శనివారం ఢిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర మహాగ్రహ కూటమితో కలిసి నిరసన కి దిగాయి.
మొబైళ్లల్లో అరిచేవి కోట్లు, వచ్చింది వందే :
సోషల్ మీడియాలో కోట్లల్లో ఫాలోయర్స్ ఉన్న బొద్దింకలు ప్రత్యక్షంగా ఉద్యమం చేస్తే వఛ్చినవి 100 కూడా లేవు. వీళ్ళని నెత్తిన పెట్టుకునేందుకు సోల్డ్ మీడియా లు, సోషల్ మీడియా లు, యు ట్యూబ్ గాళ్ళు వీళ్ళే సుమారు 1000 మంది రాగా, ఈ బొద్దింకలు ఏదైనా తేడా చేస్తే తోలు తియ్యడానికి 2000 మందికి పైగా పోలీసులు జంతర్ మంతర్ దగ్గరకి వచ్చారు. అమెరికా నుంచి వచ్చిన పెద్ద బొద్దింక మధ్యలోనే కారులో జంప్ అవ్వగా, వీళ్ళకి మద్దతుగా విద్యార్థి సంఘాలు గా జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ నుంచి తల నెరిసిపోయి వఛ్చిన అంకుల్స్, ఆంటీలు నానా హంగామా చేశారు.
అనుమతి లో దిమ్మతిరిగి పోయింది:
అసలు ఒక నిరసనకు అనుమతి ఇవ్వాలి అంటే ఒక వారం రోజుల ముందుగా ఢిల్లీ పోలీసులకు అనుమతి లేఖ ఇవ్వాలి. అయితే ఈ బొద్దింకలు శుక్రవారం వరకూ ఎటువంటి లేఖ పోలీసులకు ఇవ్వలేదు. ఒకవేళ పోలీసులు అనుమతి ఇవ్వక పొతే మోడీ భయపడి తోకముడిచాడు అని రోడ్డెక్కాలి అని బొద్దింకలను తెరవెనక నడిపిస్తున్న డీప్ స్టేట్ హుకుం జారీ చేసింది. ఈ పెద్ద బొద్దింక అమెరికా నుంచి ఢిల్లీ రాగానే అరెస్ట్ చేస్తే. . అక్కడే నిరసన చెప్పాలి అని కూడా తెరవెనుక డాన్ పథకం వేసినట్టు తెలుస్తోంది.
దేశద్రోహుల కుట్రలు భగ్నం:
అయితే.. . ఈ కుట్రలన్నీ గ్రహించిన భారత ప్రభుత్వం ఈ బొద్దింకని విమానాశ్రయం లో ఎవ్వరూ అరెస్ట్ చెయ్యలేదు, పైగా శుక్రవారం వీళ్ళు అనుమతి లేఖ పెట్టగానే వెంటనే అనుమతి ఇచ్చేసారు. దీంతో బొద్దింకలకు దిమ్మ తిరిగి పోయింది. వీళ్ళ అజెండా లో కేంద్ర విద్య శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై నిరసనలు లేవు. ఒక్కసారిగా జె ఎన్ యు లోని ఉగ్రబ్యాచ్ ఆజాది నినాదాలు చెయ్యడంతో ఈ బొద్దింకలు గుంపు వెనుక ఉండి ఎవడు నడిపిస్తున్నాడో పోలీసులకు, ప్రజలకు కూడా తెలిసి పోయింది.
ఎందుకు వచ్చారో కూడా తెలియదు:
అక్కడికి బొద్దింకలు రాకపోవడంతో స్థానికంగా ఉన్న స్కూళ్ల విద్యార్థులను బస్సుల్లో తీసుకువచ్చాయి. ఈ వచ్చిన విద్యార్థులకు అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంటో తెలియక పోవడంతో పాటు, సోషల్ మీడియాల్లో వచ్చిన ఇంటర్వ్యూ ల ప్రకారం... ఇరాన్ కి అమెరికాకి జరుగుతున్నా యుద్ధం గురించి వచ్చాం అని చెప్పడం గమనార్హం. అక్కడి కి తీసుకు వచ్చిన వాళ్ళల్లో ఎక్కువమంది 8 వ తరగతి, 9 వ తరగతి చదువుతున్న వాళ్ళే. వాళ్లకి అసలు అక్కడ ఏమి జరుగుతోందో కూడా తెలియని దుస్థితి.
విద్రోహాలను రెచ్చగొట్టే యు ట్యూబేర్లు:
ఇదిలా ఉంటె కొన్ని పైడ్ యు ట్యూబేర్లు ఈ ఉద్యమం ఎదో దేశ స్వాతంత్య్రం కోసం జరుగుతోంది అన్నట్టు చెప్తూ... దేశ ప్రధాని మోడీ కి వ్యతిరేకంగా నానా వాగుడూ వాగుతున్నారు. తద్వారా దేశంలో ఉద్రిక్తతలకు దారి తీయించే ప్రయత్నాలకు వీళ్ళు కారణం అవుతున్నారు. తక్షణం ఇలాంటి తేడా విద్వంసకర యు ట్యూబేర్ల పై బాన్ విధించి, వీళ్ళని ప్రాసిక్యూట్ చెయ్యడం వల్ల ఈ కుట్రలను తెలుసుకోవచ్చు అని జాతీయవాదులు భావిస్తున్నారు.
Jun 6, 2026 5:09 pm
అన్నామలై పోతే పార్టీ కి దమ్మిడీ నష్టం లేదు : bjp
గతం లో తమిళనాట భారీ క్యాడర్ ఉండేది కదా ఇప్పుడుపోడానికి?
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, జూన్ 05, 2026 (డిఎన్ఎస్ ):* ఏ ఐ డీఎంకే తో పొత్తు కోసం అత్యంత ప్రజాదరణ కల్గిన యువ ఐపీఎస్ కె. అన్నామలై ను పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ తన్ని తగిలేసిందా ? అంటే అవుననే తెలుస్తోంది. పైగా అన్నామలై పార్టీ నుంచి బయటకు పోయినా మాకు ఎటువంటి నష్టం లేదు అంటూ బీజేపీ ప్రకటించింది. తమిళనాడు లో ఇంతకూ ముందు బీజేపీ కి భారీ క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్నట్టుగా పెద్ద బిల్డప్ ఇచ్చింది. కనీసం జండా మోసేవాడు కూడా లేని పార్టీ లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీ తిరోగమనం కాక మరేమి అవుతుంది.
ఈ నిర్ణయం 2025 లోనే నిర్ణయం అయిపొయింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎఇ డీఎంకే తో పొత్తుకు సిద్దపడింది. అక్కడ నుంచే అన్నామలై కి బీజేపీ కుట్ర మొదలయ్యింది. కేవలం 2 % ఓట్లు మాత్రమే ఉన్న తమిళనాడు లో బీజేపీ కి 13 % కి ఓటు బ్యాంకు పెంచడంతో అన్నామలై పై ఏఐడీమెకే తో పాటు, స్థానిక బీజేపీ నేతల్లో సైతం ఈర్ష్య పెరిగిపోయింది. భారీ ప్రజాదరణ ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా పార్టీ నుంచి బయటకు తన్ని తగిలిస్తే. . ఈ పడే నాలుగు ఓట్లు కూడా పడవు అనే ఉద్దేశం తో ముందుగా అన్నామలై ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. దీనికి కారణం ఏఐడీఎంకే , పొత్తుకోసం అది పెట్టిన మొదటి కండిషన్ అన్నామలై ని బీజేపీ నుంచి తప్పించాలి. ఎక్కడా టికెట్ ఇవ్వకూడదు, అతనికి ఎటువంటి పదవి ఇవ్వకూడదు. ఏ ఐ డిమెకే తో మత్తులో ఉన్న బీజేపీ వీటన్నింటికీ ఒప్పేసుకుని, అన్నామలై ని పూర్తిగా డమ్మీ ని చేసేసింది. దీంతో ఎన్ని లక్ష్యాలతో పనిచేద్దామని బీజేపీ లోకి వచ్చిన అన్నామలై కి పూర్తి భంగపాటు ఎదురయ్యింది. దీంతో 2025 లోనే రాజీనామా చెయ్యాలని నిర్ణయం తీసుకున్న అన్నామలై ని ఎన్నికల వరకూ ఆగమని అమిత్ షా కోరడం తో అధిష్ఠానం పై గౌరవం తో జూన్ 2026 వరకూ వేచియున్నారు.
ఓటమి పాలైన నాయ్ నార్ ఎందుకు రాజీనామా చెయ్యలేదు?
ఏ ఐ డి ఎంకే తో కలిసి పోటీ చెయ్యడానికి పూర్తి కారణమైన ప్రస్తుత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాయ్ నార్ నాగేంద్రన్ ఎందుకు రాజీనామా చెయ్యలేదు అని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళ స్వార్ధ కూటమి వల్ల 4 సీట్లు ఉన్న బీజేపీ ఈ కూటమి వల్ల 1 సీటుకు మాత్రమే పరిమితం అయ్యింది. దీని కి పూర్తి భాద్యత నాగేంద్రన్ దే . 13 % ఓటు బ్యాంకు సాధించి పార్టీ క్యాడర్ పెంచిన అన్నామలై ను పార్టీ నుంచి బయటకు తన్ని తగిలేసి, పూర్తి ఓటమి కి కారణమైన నాగేంద్రన్ ను అందలం ఎక్కించిన ఘనత బీజేపీ అధిష్టానం దే.
ఇన్ని అవమానాలు మౌనంగా భరించిన అన్నామలై ఆఖరి అస్త్రంగా ఢిల్లీ కి వెళ్లి పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ , అమిత్ షా లను కలిసి మాట్లాడిన తర్వాత కూడా ఎటువంటి మార్పు లేకపోవడంతో ఇక రాజీనామా కు సిద్ధపడ్డారు.
పొమ్మన లేక పొగబెట్టడం అంటే ఇదే .
పార్టీలకు అతీతంగా అభిమానులు.
ఢిల్లీ లో పార్టీ కి రాజీనామా చేసి, తిరిగి చెన్నై కి వచ్చిన అన్నామలై కు విమానాశ్రయం లో పార్టీలకు అతీతంగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అతని జన్మదినం సందర్భంగా జూన్ 5 న ఒక భారీ ప్రకటన చేసారు. క్షేత్ర స్థాయి లో ప్రజలని కలుసుకుని, సమస్యలను తెలుసుకుని, పరిష్కార మార్గాలు చూపించనున్నట్టు తెలిపారు. వెంటనే ఈయన ప్రకటించిన సంస్థ లో 10 లక్షలకు పైగా సభ్యులు చేరడం జరిగింది. దీనిలో యువత, మహిళలు, మేధావులు, బీజేపీ లో భంగపడ్డ అభిమానులు భారీ సంఖ్యలో చేరుతుండడం గమనార్హం.
స్వయంకృతాపరాధం :
తమిళ నాడు ఫైర్ బ్రాండ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై రాజీనామా చెయ్యడం తో తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని, భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అతి తక్కువ సమయంలో లక్షలాది మంది అభిమానాన్ని పొందిన అన్నామలై అభిమాన ఫాలోయింగ్ ఎలా ఉందొ చూసిన తర్వాత కూడా బీజేపీ తీసుకున్న నిర్ణయం తప్పు అనే భావన ఢిల్లీ అధిష్టానం లో ఏ కోశానా కనపడడం లేదు. అస్సలు తమిళనాడు లో పార్టీ జండా మోసేవాడే లేకపోయినా బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తోంది. అతను బయటకు పోతున్నా కనీసం తీసుకోవాల్సిన భాద్యత చేపట్టలేక పోవడం అధికార మదం కనపడుతోంది. 18 రాష్ట్రాల్లో పార్టీ అధికారం లో ఉంది కేంద్రంలో ప్రభుత్వానికి ఏమాత్రం ఢోకా లేదు అనే భావన అధిష్ఠానం పెద్దల్లో బలంగా నాటుకుపోయింది. అయితే అన్నామలై విషయంలో బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ ని పాతాళానికి తొక్కేసేలా ఉందని సామాన్య కార్యకర్తలకు తెలిసింది, పార్టీ అగ్రనేతలకు తెలియలేదు.
అయితే తమిళనాడు లో బీజేపీ అనేది ఒకటి బ్రతికి ఉంది అని ప్రపంచానికి తెలియచేసింది మాత్రం అన్నామలై నే అనేది అక్షర సత్యం.
బీజేపీ ద్వారా సమాజానికి మంచి కార్యక్రమాలు చెయ్యాలి అనే సంకల్పంతో ఒక సుదీర్ఘ ప్రణాళిక తో పార్టీలోకి వెళ్లిన అన్నామలై కి పూర్తిగా ఆశాభంగం కల్గింది.
| Date : |
| Ruthuva : |
| Nakshatram : |
| Week : |
| Masam : |
| Amrithakalam : |
| Year : |
| Pakshamvarjam : |
| Samsthram : |
| Ayanam : |
| Tithi : |
| Durumuhratam : |

జగన్నాధునికి ఛప్పన్ ( 56 ) భోగాల నిత్య నైవేద్యాలు...
Jul 15, 2026 8:05 pm
*పూరి క్షేత్రంలో ప్రసాదమే అత్యంత ప్రాధాన్యం.*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार,)*
*విశాఖపట్నం, జులై &n...
Jul 15, 2026 5:47 pm
Jun 28, 2026 10:27 pm
Jun 28, 2026 6:24 pm

Jun 23, 2026 4:49 pm
*చతికిల స్థితి నుంచి చక్రం త్రిప్పే స్థితి కి వచ్చింది పీవీ వల్లే.*
*విజ్ఞాన గని, అపరమేధావి, బహు భాషాకోవిదునికి ఘన నివాళి*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, జూన్ 22, 2026 (డిఎన్ఎస్ ):* ప్రపంచ దేశాలకు ధీటుగా భారత దేశం అన్నిరంగాల్లో నిలబడడానికి ప్రధాన కారణం 1991 నుంచి 1996 వరకూ జరిగిన ఆర్ధిక సంస్కరణల బీజమే.
భారత దేశాన్ని దోచుకుతినేందుకు వెయ్యేళ్ళ కాలం లో ఎందరో బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీసు, హుణులు, శకులు, మొఘలులు, ఖిల్జీలు ఎందరో దాడులు చేసి, ఈ దేశ సంపదను దోచుకుతిన్న చరిత్ర అందరికీ తెలిసిందే. అయితే స్వాతంత్య్ర పు స్వేచ్ఛ లభించిన తర్వాత ఎందరో స్కాం ల పేరుతో దోచుకుతిన్న సందర్భాలు కూడా ఈ దేశం చవిచూసింది.
ఇంత దారుణ దోపిడీ చవి చూసిన తరుణంలో భారత దేశం ఆర్ధికంగా పూర్తిగా చతికిల పడిన సమయంలో ఈ దుస్థితి నుంచి గట్టు ఎక్కించేందుకు వచ్చిన అత్యున్నత శక్తి పేరే పీవీ. .. పాముల పార్టీ వెంకట నరసింహారావు . .
పదవి చేపట్టింది కేవలం ఐదేళ్లు మాత్రమే. . అందునా పూర్తి స్థాయి సంఖ్యా లో ఎంపీ లు లేకున్నా. . ప్రతిపక్షాలను సైతం ఆకట్టుకున్నా నైజం పీవీ ది.
భారత దేశ చరిత్రలో 1991 కి ముందు 1991 తర్వాత అనే సగర్వంగా చెప్పుకునే స్థితికి చేర్చారు.
పీవీ అనే నేను భారత ప్రధానిగా . . .
21 జూన్ , 1996 నాటి స్వర్ణయుగాన్ని భారత ప్రజలు మరిచిపోయే అవకాశం లేదు. వంగర అనే కుగ్రామం నుంచి దేశ రాజధాని హస్తిన లో భారత దేశ 9 వ ప్రధానమంత్రిగా పదవి చేపట్టిన ఏకైక తెలుగు వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు. అందునా ఒక బ్రహ్మాణ సామాజిక వర్గానికి చెందిన మేధావి దేశ ప్రధానిగా భాద్యతలు చేపడితే దేశ భవిత మారిపోతుంది అనడానికి నిదర్శనమే పీవీ పాలన.
భారత దేశపు ఆర్ధిక స్థితి విపత్తు అంచున ఉంది. దిగజారనున్న దేశాన్ని తిరిగి వెనుకకు మరల్చటానికి కార్యదక్షత గల ఒక బ్రాహ్మణుడు అపర చాణుక్యుడు గా రంగ ప్రవేశం చేసారు. తన ప్రభుత్వానికి తగిన సంఖ్యా బలం లేకున్నా. . . ఇతర కూటమి సభ్యులతో ఒక ప్రక్క సమన్వయము చేసుకుంటూ, మరోప్రక్క దేశ భవితను కాపాడుతూ, విదేశీ శత్రు దేశ ముష్కరులకు అడ్డుకట్ట వేస్తూ. . .ఆర్ధిక సంస్కరణలు చేపట్టిన అత్యంత మేధావి ఇతను మాత్రమే.
ఉత్తర తెలంగాణాలోని వరంగల్ జిల్లాలో లకినేపల్లిలో జూన్ 28, 1921 లో పుట్టిన పీవీ, కుటుంబ వృత్తి వ్యవసాయ మెళుకువలతో పాటు పాండిత్యం వారసత్వంగా పొందారు. చిన్న వయసులోనే దత్తతకు వెళ్లారు. గణితశాస్త్రంలో ప్రాధమిక విద్య వంగరలో మొదలెట్టారు. నాటి తెలంగాణ ఆచారాల ప్రకారం వీరికి అతి చిన్న వయసులోనే వివాహం జరిపించారు.
పీవీ ప్రయాణం . .. .
పీవీ విద్యా ప్రస్థానం అసాధారణమైనది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, నాగపూర్ విశ్వవిద్యాలయం వంటి సంస్థలలో చదువుకుని, చివరికి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. డజనుకు పైగా భాషలు మాట్లాడగల బహుభాషావేత్త పీవీ. తనకి నచ్చని విషయాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే. . . మరో భాషలో సమాధానం చెప్పడం గమనార్హం.
ప్రధానమంత్రి కాక ముందు, రక్షణ, విదేశీ వ్యవహారాలు, హోం వ్యవహారాలు వంటి కీలకమైన శాఖలను నిర్వహించి ఎంతో అనుభవాన్ని పొందారు. పరిశీలనాత్మక దృక్పథం ఉండడంతో పాటు, ఎంతో సహనశీలి.
అగాధం అంచునుంచి అగ్రస్థాయికి దేశం :
1991 లో భారతదేశం ఆర్ధిక స్థితి ఇబ్బందుల్లోనే కాదు, డోలాయమానంగా ఉంది. దేశం తీవ్రమైన చెల్లింపుల సంతులన సంక్షోభాన్ని ఎదుర్కొంది. విదేశీ మారక నిల్వలు ఎంతగా పడిపోయాయంటే, భారతదేశం కొన్ని వారాల దిగుమతులను కూడా భరించలేని స్థితికి చేరుకుంది. పూచీకత్తుగా బంగారాన్ని భౌతికంగా విదేశాలకు రవాణా చేయాల్సి వచ్చింది. దాదాపు జీవచ్చ వ స్థితి నుంచి జీవం పొయ్యాలి అంటే అంత సులభం కాదు.
అన్నింటినీ మార్చిన నిర్ణయాలు :
ఆర్ధిక స్థితిని మెరుగు పరిచేందుకు ఆయన రంగం లోకి దింపిన బ్రహ్మాస్త్రం పేరు మన్మోహన్ సింగ్. ఆయన్ని ఆర్థిక మంత్రిగా నియమించారు. వారిద్దరూ కలిసి భారతదేశ భవిష్యత్తును మౌలికంగా మార్చివేసిన అనేక ఆర్థిక సంస్కరణలను ప్రారంభించారు. వాటిలో కొన్ని మచ్ఛుతునకలు
• సరళీకరణ: అనేక అనుమతుల పొరల కింద వ్యాపారాలను ఉక్కిరిబిక్కిరి చేసిన అపఖ్యాతి పాలైన “లైసెన్స్ రాజ్”కు ముగింపు పలకడం.
• ప్రైవేటీకరణ: అత్యవసరం కాని పరిశ్రమలలో ప్రభుత్వ రంగ పాత్రను తగ్గించడం.
• ప్రపంచీకరణ: విదేశీ పెట్టుబడులు మరియు వాణిజ్యం కోసం భారతదేశానికి ద్వారాలు తెరవడం.
ఇవన్నీ నిర్మాణాత్మకమైన మార్పులు. బాధాకరమైనవి, వివాదాస్పదమైనవి, మరియు అవసరమైనవి.
ఒత్తిడిలో నాయకత్వం :
పీవీ తీసుకున్న ప్రతి చర్యకు ప్రతిపక్ష పార్టీల నుండి మరియు తన సొంత కాంగ్రెస్ పార్టీలోనే ప్రతిఘటన ఎదురైంది. పాత సామ్యవాద చట్రంతో సౌకర్యవంతంగా ఉన్న సంప్రదాయవాదులలో ఆర్థిక వ్యవస్థను సరళీకరించాలనే ఆలోచన అంతగా ప్రజాదరణ పొందలేదు. అయినప్పటికీ, ముందుకు సాగారు.
ఆర్థిక శాస్త్రానికి అతీతంగా
ఆర్థిక సంస్కరణలే ఆయన అతిపెద్ద వారసత్వం అయినప్పటికీ, వాటికే పరిమితం కాలేదు. విదేశాంగ విధానాన్ని బలోపేతం చేశారు, కీలకమైన ప్రపంచ దేశాలతో సంబంధాలను మెరుగుపరిచారు. వేగంగా మారుతున్న ప్రచ్ఛన్న యుద్ధానంతర ప్రపంచంలో మార్గనిర్దేశం చేశారు.
బాబ్రీ మసీదు కూల్చివేత పరిణామాలు :
బాబ్రీ మసీదు కూల్చివేత తదనంతర పరిణామాలలో పీవీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు నేటికీ హిందూ సమాజాన్ని పీడిస్తున్నాయి. అయినప్పటికీ తన నిర్ణయానికి కట్టుపడి ఉన్నారు. ముస్లిం వర్గాలకు అవిచ్చ్చన్న హక్కులు, చట్టాలు ప్రత్యేకంగా అమలు చేసారు. తద్వారా వక్ఫ్ పేరిట భూ ఆక్రమణలు పెరిగిపోయాయి.
వీరి హయం లోనే ఐటీ వృద్ధి విస్తృతంగా పెరిగింది.
ఆధునిక భారతదేశ రూపశిల్పి పీవీ :
ఆధునిక భారతదేశ రూపశిల్పి గా పీవీ ఖ్యాతి గాంచారు. ఆర్థిక పరివర్తన ఎప్పుడూ ఒక్కరి వల్ల జరిగేది కాదు. కానీ రూపశిల్పులు ముఖ్యమే. వారు వ్యవస్థను రూపొందిస్తారు, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, అంతా కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నప్పుడు బాధ్యత తీసుకుంటారు. పీవీ సరిగ్గా అదే చేశారు.
భారతదేశం ఆర్థిక పతనాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో, ఆయన కేవలం వ్యవస్థను స్థిరీకరించడమే కాదు. దానిని పునర్నిర్మించారు. నిశ్శబ్దంగా, పద్ధతిగా, దశాబ్దాల తర్వాత మాత్రమే స్పష్టమయ్యే దూరదృష్టితో ఆయన ఈ పని చేశారు.
పి. వి. నరసింహారావు లేకపోతే, అభివృద్ధి చెందుతున్న భారతదేశపు కథ చాలా చాలా భిన్నంగా ఉండేది. బహుశా మరింత నెమ్మదిగా. బహుశా మరింత బలహీనంగా. మరియు కచ్చితంగా అంత ఆసక్తికరంగా ఉండేది కాదు.
భూ సంస్కరణల్లో వివాదం :
ఆర్ధిక సంస్కరణలతో పాటు, భూమి వ్యవహారం లో సైతం సంస్కరణలను చేపట్టారు. స్వయంగా తన సొంత భూమిని సైతం ప్రభుత్వ పరం చేసి, ధీరోదాత్తుడు అయ్యాడు పీవీ. అయితే ఈయన చేసిన సంస్కరణలను వక్ఫ్ పేరిట అపరిమిత భూ దోపిడీ జరిగిన మాట మాత్రం వాస్తవం. ప్రభుత్వ స్థలాలతో పాటుగా, ప్రయివేట్ వ్యక్తుల భూములను సైతం బలవంతంగా ఆక్రమించుకున్న ఘటనలు కూడా పీవీ హయాంలోనే జరిగాయి.
బాబ్రీ ఘటనలు సాకుగా చూపించి, ముస్లిం లకు మేలు చేసే ఎన్నో చట్టాలను అమలు చెయ్యడమే కాక, రాజ్యాంగం లో సైతం కూడని మార్పులు చేసి, హిందూ సమాజం నుంచి నేటికీ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఒక వ్యక్తి తన పరిధిలో చేసే పనుల ద్వారా అన్ని వర్గాలను సంతృప్తి పరచడం అసాధ్యం. అయితే. . . అధిక భాగం ప్రజానీకానికి మేలు జరిగే అంశాలను అందరూ అభినందించవలసిందే. .
సొంత పార్టీ నుంచే ఘోర పరాభవం :
చిన్న నాటి నుంచి తానూ నమ్మిన కాంగ్రెస్ పార్టీ ద్వారా సామాన్య కార్యకర్త స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎన్నికైన పీవీ అదే ఖాన్ గ్రెస్ పార్టీ నుంచి అత్యంత ఘోరమైన అవమానాన్ని ఎదుర్కొన్నారు. పదవి పూర్తి అయినా తర్వాత ఖాన్ గ్రెస్ పార్టీ పీవీ పట్ల అత్యంత నీచమైన వైఖరి చూపింది. విదేశీ మహిళా సారధ్యంలో ఉన్న పార్టీ లో దేశీయ మహా నాయకులకు ఎటువంటి చోటు లేదని నిరూపితమయ్యింది. పీవీ మరణం తర్వాత భౌతిక కాయాన్ని సాధారణంగా ఆయా పార్టీ కార్యాలయాల వద్ద సందర్శన కోసం ఉంచుతారు. అయితే పీవీ భౌతిక కాయం ఖాన్ గ్రెస్ పార్టీ గుమ్మం తొక్కడాని కి కూడా వీలు లేదు అని విదేశీ మహిళా సారధ్యంలోని ఖాన్ గ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో సొంత పార్టీ నేతలు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఎంతో నాటకీయ పరిణామాల మధ్య పీవీ కాయాన్ని తెలంగాణ లోని భాగ్యనగరానికి తీసుకు రావడం జరిగింది. అత్యంత ఘోరమైన పరిస్థితుల్లో పీవీ అంత్య క్రియలు జరగడం బాధాకరం. దీనికి ప్రధాన కారణం. . పీవీ బ్రాహ్మణుడు కావడమే అనేది వారి అభిమానుల మనోగతం.
ప్రతిపక్షాలలో సైతం అభిమానులు. . .:
అందరిని కలుపుకుంటూ వెళ్లే నైజం ఉన్న పీవీ తో ప్రతిపక్షాల సభ్యులు సైతం ఎంతో సన్నిహిత బంధాలు ఉండేవి. అభిప్రాయాల పరంగా ముఖ్యంగా భిన్న ధృవమైన భారతీయ జనతా పార్టీ నేతలలో అటల్ బిహారి వాజపేయి, ఎల్ కె అద్వానీ, వంటి మహానేతలు పీవీ తో ఏంతో సన్నిహితంగా ఉండేవారు.
పివి కి భారత రత్న ఇచ్చింది bjp :
సొంత ఖాన్ గ్రెస్ పార్టీ పీవీ ని అత్యంత దారుణంగా అవమానిస్తే. . ప్రతిపక్ష పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ పీవీ ఈ దేశానికి చేసిన సేవలకు గుర్తింపు గాను అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న పురస్కారం తో గౌరవించింది. తమకు పీవీ పట్ల ఎంతో ఉన్నతమైన గౌరవం ఉంది అని ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ పురస్కారం సందర్భంగా ప్రకటించడం ద్వారా విపక్షాలు సైతం పీవీ ని ఎంతగా ఆదరించాయో తెలుస్తోంది.
పీవీ జయంతి కి విశాఖ లో భారీ ఏర్పాట్లు :
ఇంతటి వైభవాన్ని సంతరించుకున్న పీవీ నరసింహారావు జయంతి జూన్ 28 . ఈ ఏడాది 105 జయంతి వేడుకలను విశాఖపట్నం మహా నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నగర బ్రాహ్మణ సంఘాల సమాఖ్య నిర్ణయించింది. నగర పరిధిలోని ప్రజా ప్రతినిధులు, ప్రముఖులను ఆహ్వానించి, భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.