DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏఐడిఎంకె కోసం  అన్నామలై ని బయటకు తన్నితగిలేశారా? 

అన్నామలై పోతే పార్టీ కి దమ్మిడీ నష్టం లేదు : bjp 

గతం లో తమిళనాట భారీ క్యాడర్ ఉండేది కదా ఇప్పుడుపోడానికి?   

(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్  05, 2026 (డిఎన్ఎస్ ):* ఏ ఐ డీఎంకే తో పొత్తు కోసం అత్యంత ప్రజాదరణ కల్గిన యువ ఐపీఎస్ కె. అన్నామలై ను పార్టీ నుంచి భారతీయ

జనతా పార్టీ తన్ని తగిలేసిందా ? అంటే అవుననే తెలుస్తోంది. పైగా అన్నామలై పార్టీ నుంచి బయటకు పోయినా మాకు ఎటువంటి నష్టం లేదు అంటూ బీజేపీ ప్రకటించింది. తమిళనాడు లో ఇంతకూ ముందు బీజేపీ కి భారీ క్యాడర్,  ఓటు బ్యాంకు ఉన్నట్టుగా పెద్ద బిల్డప్ ఇచ్చింది. కనీసం జండా మోసేవాడు కూడా లేని పార్టీ లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీ

తిరోగమనం  కాక మరేమి అవుతుంది. 

ఈ నిర్ణయం 2025 లోనే నిర్ణయం అయిపొయింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎఇ డీఎంకే తో పొత్తుకు సిద్దపడింది. అక్కడ నుంచే అన్నామలై కి బీజేపీ కుట్ర మొదలయ్యింది. కేవలం 2 %  ఓట్లు మాత్రమే ఉన్న తమిళనాడు లో బీజేపీ కి  13 % కి ఓటు బ్యాంకు పెంచడంతో అన్నామలై పై ఏఐడీమెకే తో పాటు, స్థానిక బీజేపీ

నేతల్లో సైతం ఈర్ష్య పెరిగిపోయింది. భారీ ప్రజాదరణ ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా పార్టీ నుంచి బయటకు తన్ని తగిలిస్తే. . ఈ పడే నాలుగు ఓట్లు కూడా పడవు అనే ఉద్దేశం తో  ముందుగా అన్నామలై ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. దీనికి కారణం ఏఐడీఎంకే , పొత్తుకోసం అది పెట్టిన మొదటి కండిషన్  అన్నామలై ని బీజేపీ నుంచి తప్పించాలి. ఎక్కడా

టికెట్ ఇవ్వకూడదు, అతనికి ఎటువంటి పదవి ఇవ్వకూడదు. ఏ ఐ డిమెకే తో మత్తులో ఉన్న బీజేపీ వీటన్నింటికీ ఒప్పేసుకుని, అన్నామలై ని పూర్తిగా డమ్మీ ని చేసేసింది.  దీంతో  ఎన్ని లక్ష్యాలతో పనిచేద్దామని బీజేపీ లోకి వచ్చిన అన్నామలై కి పూర్తి  భంగపాటు ఎదురయ్యింది. దీంతో 2025 లోనే రాజీనామా చెయ్యాలని నిర్ణయం తీసుకున్న అన్నామలై ని

ఎన్నికల వరకూ ఆగమని అమిత్ షా కోరడం తో అధిష్ఠానం పై గౌరవం తో జూన్  2026 వరకూ వేచియున్నారు. 

ఓటమి పాలైన నాయ్ నార్ ఎందుకు రాజీనామా చెయ్యలేదు? 

ఏ ఐ డి ఎంకే తో కలిసి పోటీ చెయ్యడానికి పూర్తి కారణమైన ప్రస్తుత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాయ్ నార్  నాగేంద్రన్ ఎందుకు రాజీనామా చెయ్యలేదు అని

 ప్రశ్నిస్తున్నారు.  వీళ్ళ స్వార్ధ కూటమి వల్ల  4 సీట్లు ఉన్న బీజేపీ ఈ కూటమి వల్ల 1  సీటుకు మాత్రమే పరిమితం అయ్యింది. దీని కి పూర్తి భాద్యత నాగేంద్రన్ దే . 13 % ఓటు బ్యాంకు సాధించి పార్టీ క్యాడర్ పెంచిన అన్నామలై ను పార్టీ నుంచి బయటకు తన్ని తగిలేసి,  పూర్తి  ఓటమి కి కారణమైన  నాగేంద్రన్  ను అందలం ఎక్కించిన ఘనత

బీజేపీ అధిష్టానం దే. 
ఇన్ని అవమానాలు మౌనంగా భరించిన అన్నామలై ఆఖరి అస్త్రంగా ఢిల్లీ కి వెళ్లి పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ , అమిత్ షా లను కలిసి మాట్లాడిన తర్వాత కూడా ఎటువంటి మార్పు లేకపోవడంతో ఇక రాజీనామా కు సిద్ధపడ్డారు. 
పొమ్మన లేక పొగబెట్టడం అంటే ఇదే .

పార్టీలకు అతీతంగా

అభిమానులు. 

ఢిల్లీ లో పార్టీ కి రాజీనామా చేసి, తిరిగి చెన్నై కి వచ్చిన అన్నామలై కు విమానాశ్రయం లో పార్టీలకు అతీతంగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అతని జన్మదినం సందర్భంగా జూన్ 5 న ఒక భారీ ప్రకటన చేసారు. క్షేత్ర స్థాయి లో ప్రజలని కలుసుకుని, సమస్యలను తెలుసుకుని, పరిష్కార మార్గాలు చూపించనున్నట్టు

తెలిపారు.  వెంటనే ఈయన ప్రకటించిన సంస్థ లో 10 లక్షలకు పైగా సభ్యులు చేరడం జరిగింది. దీనిలో యువత, మహిళలు, మేధావులు,  బీజేపీ లో భంగపడ్డ అభిమానులు భారీ సంఖ్యలో చేరుతుండడం గమనార్హం. 

స్వయంకృతాపరాధం :

తమిళ నాడు ఫైర్ బ్రాండ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు  అన్నామలై రాజీనామా చెయ్యడం తో తమకు వచ్చిన నష్టం ఏమీ

లేదని, భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.  అతి తక్కువ సమయంలో లక్షలాది మంది అభిమానాన్ని పొందిన అన్నామలై అభిమాన ఫాలోయింగ్ ఎలా ఉందొ చూసిన తర్వాత కూడా బీజేపీ తీసుకున్న నిర్ణయం తప్పు అనే భావన ఢిల్లీ అధిష్టానం లో ఏ కోశానా కనపడడం లేదు. అస్సలు తమిళనాడు లో పార్టీ జండా మోసేవాడే లేకపోయినా బీజేపీ మేకపోతు గాంభీర్యం

ప్రకటిస్తోంది.  అతను బయటకు పోతున్నా కనీసం తీసుకోవాల్సిన భాద్యత చేపట్టలేక పోవడం అధికార మదం కనపడుతోంది. 18 రాష్ట్రాల్లో పార్టీ అధికారం లో ఉంది కేంద్రంలో ప్రభుత్వానికి ఏమాత్రం ఢోకా లేదు అనే భావన అధిష్ఠానం పెద్దల్లో బలంగా నాటుకుపోయింది.  అయితే అన్నామలై విషయంలో బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ ని పాతాళానికి

తొక్కేసేలా ఉందని సామాన్య కార్యకర్తలకు తెలిసింది, పార్టీ అగ్రనేతలకు తెలియలేదు. 
అయితే తమిళనాడు లో  బీజేపీ అనేది ఒకటి బ్రతికి ఉంది అని ప్రపంచానికి తెలియచేసింది మాత్రం అన్నామలై నే అనేది అక్షర సత్యం. 

బీజేపీ ద్వారా సమాజానికి మంచి కార్యక్రమాలు చెయ్యాలి అనే సంకల్పంతో  ఒక సుదీర్ఘ ప్రణాళిక తో

పార్టీలోకి వెళ్లిన అన్నామలై కి పూర్తిగా ఆశాభంగం కల్గింది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Oct 23, 2026

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam