DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ ధర్మం పై దుష్ట దాడులకు అహోబిల జీయర్ స్వామి షాక్ ట్రీట్మెంట్

*శ్రీరామ హృదయం తో గ్రామస్థాయి నుంచి సనాతనధర్మ ప్రచారం* 

*జగదాచార్యులు చిన్న జీయర్ స్వామి సప్తతి వేడుకలకు ధార్మిక ఏర్పాట్లు*

*తెలుగు రాష్ట్రాల్లో అహోబిల జీయర్ స్వామి సుడిగాలి పర్యటనలు* 

(DNS  Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार,)*

విశాఖపట్నం, జులై  23, 2026 (డిఎన్ఎస్): సనాతన

ధర్మం పై జరుగుతున్న వ్యతిరేక కార్యక్రమాల ను సమర్ధవంతంగా నిలువరించేందుకు పరమపూజ్య  త్రిదండి అహోబిల జీయర్ స్వామి షాక్ ట్రీట్మెంట్  సిద్ధం చేసారు. 

పరమహంస పరివ్రాజకులు, జగదాచార్యులు, అపరరామానుజులు త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి సప్తతి మహోత్సవ వేడుకల్లో భాగంగా భారీ ఎత్తున ధార్మిక కార్యక్రమాలకు

శ్రీకారం చుట్టారు. ఈ వేడుకల గురించి భక్తులకు తెలియచేసేందుకు పరమపూజ్య  త్రిదండి అహోబిల జీయర్ స్వామి వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఆదిలాబాద్ వరకూ అవిశ్రాంతంగా పర్యటిస్తూ. . భక్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. 
ఈ సందర్బంగా ఈ మహోన్నత భక్తి ఉద్యమ

ప్రక్రియ ను అహోబిల జీయర్ స్వామి  DNS Media కు వివరించారు. 

విశిష్టాద్వైత సంప్రదాయ వైభవాన్ని దేశ విదేశాల్లో విస్తృత పరిచిన చిన్న జీయర్ స్వామి వారు ఈ ఏడాది దీపావళి నాటికి 70 వ తిరునక్షత్రం లోకి ( జన్మదినం) అడుగుపెడుతున్న సందర్బంగా ఈ వేడుకలను ధార్మిక పరంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 
అపరరామానుజులకు శిష్య,

ప్రశిష్యులు, భక్తులు  అందించే గురు వైభవం ఈ శ్రీరామ హృదయం యాత్ర  అని తెలియచేస్తున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని సనాతన సంప్రదాయాన్ని అన్ని గ్రామాల్లో మరింతగా విస్తరింపచేయడం కోసం శ్రీరామ హృదయం కార్యక్రమాన్ని చేపట్టినట్టు స్వామిజి తెలియచేసారు. 

శ్రీవైష్ణవ కుటుంబాల సభ్యులు, శ్రీవైష్ణవ దేవాలయాల

అర్చక, అర్చకేతర సిబ్బంది, సమాశ్రయణం పొందిన భక్తులు, సనాతన ధర్మం పై గౌరవం ఉన్న ధార్మికులు అందరితోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం నుంచి ఆదిలాబాద్ వరకూ అవిశ్రాంతంగా  పర్యటిస్తూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  శ్రీవైష్ణవ సంఘాలు,  చిన్న జీయర్ స్వామి వారి సేవ సంస్థల సభ్యులు,

భక్తులతో సమావేశం జరిపి కార్యక్రమాన్ని వివరించడం జరుగుతోందన్నారు.  

ఈ సప్తతి వేడుకల్లో ప్రధానంగా నిర్వహించే కార్యక్రమాలు ఇవే: 

1 . ప్రతీ గ్రామం లోనూ సత్సంగం :

ఆషాడ పౌర్ణమి నుండి ఆశ్వయుజ పౌర్ణమి వరకు ప్రతీ గ్రామం లోనూ తొంభై ఇళ్లల్లో సత్సంగాలు నిర్వహించాలి. 
ప్రతి గ్రామం లోనూ ప్రతి

రోజూ సాయంత్రం ఒక భక్తుని ఇంట్లో సత్సంగం నిర్వహించాలి. 
ఈ సత్సంగం లో  జీయర్ స్వామి వారు పాడిన  శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  ఆడియో పెడతారు. వారి స్వరం అనుకరిస్తూ మనం కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరగాలి. 
పారాయణ అయిన తరువాత మన సంప్రదాయ వైశిష్ట్యాన్ని రోజుకో అంశం చొప్పున ఆయా గోష్ఠులలో

 తెలియజేయాలి.  సనాతన ధర్మం ప్రచారం కోసం మంచిమాటలు చెప్పుకోవాలి. 
ఈ గోష్టిలో పాల్గొన్న వారి వివరాలు సేకరించాలి.  చిన్న జీయర్ స్వామి వారి సప్తతి ఉత్సవాలకు  జిల్లా, మండల, గ్రామ స్ధాయిలలో వీరు చేపట్టగలిగిన బాధ్యతలను అందించాలి. 

శ్రీరామ హృదయ యాత్ర : 

జగదాచార్యులు త్రిదండి చిన్న జీయర్

స్వామి వారి ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. ఈ సందర్భంగా శ్రీ రామహృదయ యాత్ర మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడి పేరిట ప్రతీ గ్రామం లోనూ తిరువీధి ఉత్సవాలు నిర్వహించాలి. 
చిన్న జీయర్ స్వామి వారి ఆశ్రమం  దివ్య సాకేతం  నుంచి  ప్రతీ మండలానికి ఒక శ్రీరామహృదయ కలశ పంపుతారు.  ఆ కలశం మన గ్రామానికి వచ్చినప్పుడు మన గ్రామ

భక్తులందరిలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొనాలి.  ఆ కలశాన్ని ఊరేగింపుగా ప్రతి ఇంటికి తీసుకువెళ్లి వారిచే ఆ పవిత్ర కలశాన్ని రామమంత్రంతో ఆ ఇంట్లోని వారితో తాకేలా చేసి, దానిలో వారికి తోచినంత బియ్యం వేయించడం చేయాలి. 
అలా వచ్చిన బియ్యాన్ని ఆ గ్రామంలోని ఒక దేవాలయానికి ఇవ్వాలి. ఇలా రోజుకి రెండు గ్రామాలలో ఆ కలశం

తిరగాలి.

నిర్వహణ కమిటీ లు:

శ్రీ రామహృదయ యాత్ర, పారాయణ, ధర్మ ప్రచారం నిర్వహించడం కోసం, జిల్లా స్థాయి,  మండల స్థాయి , గ్రామ స్ధాయిల్లో ఒక కమిటీ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమిటీ ల్లో శ్రీవైష్ణవ కుటుంబాల సభ్యులు, చిన్న జీయర్ స్వామివారి సేవా సంస్థ వికాస తరంగిణి సభ్యులు ఉంటారు. వీరందరూ సమన్వయంతో

ముందుకు తీసుకువెళ్లాలి.

ప్రధాన లక్ష్యం: -  

ప్రస్తుతం సనాతన ధర్మం పై జరుగుతున్న భౌతిక దాడులు,  సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూస్తున్న విపరీత ట్రోలింగ్ లు, హిందూ వ్యతిరేక కార్యక్రమాల ను సమర్ధవంతంగా నిలువరించేందుకు జరుగుతోంది. 

ఈ మహా కార్యక్రమం సనాతన హిందూ ధార్మిక భక్తులను అందరిని

 ఒక వేదికమీదకు తీసుకురావడం కోసం‌ నిర్వహిస్తున్నారు. 

సంప్రదించగలరు: -

చిన్న జీయర్ స్వామి వారి సప్తతి ఉత్సవాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారు  అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి  శ్రీమాన్ యతిరాజుల బాల బాలాజీ  స్వామిని  ఫోన్

నెంబర్ 6303691109 లో  సంప్రదించవచ్చును. 

Recent News

Latest Job Notifications

Panchangam - Oct 23, 2026

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam