DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవస్థాన ట్రస్టీలుగా ఎంపికైన విప్రులకు అభినందనలు: పూడిపెద్ది శర్మ

*సంప్రదాయ వైభవ సారధులకు శుభాకాంక్షలు : DNS Media*

(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

*విశాఖపట్నం, మే 16, 2026 (డిఎన్ఎస్ ):* మహా విశాఖపట్నం పరిధిలోని ప్రధాన దేవాలయాల కమిటీల్లో ట్రస్టీలుగా నియమితులైన బ్రాహ్మణ ప్రముఖులకు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మఠ్ మందిర్ ప్రముఖ్  పూడిపెద్ది శర్మ అభినందనలు

తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు అయినా శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం లో ప్రత్యేక ఆహ్వానితులుగా వేదుల దక్షిణామూర్తి ( భారతీయ జనతా పార్టీ, విశాఖపట్నం ), సుసరాపు గణపతి శర్మ ( తెలుగుదేశం, విజయనగరం), ఇసుక కొండ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ట్రస్టీ గా  వేదుల హనుమంత రావు ( తెలుగుదేశం, విశాఖపట్నం), శ్రీ

కనక మహాలక్ష్మి  అమ్మవారి దేవస్థానం ట్రస్టీ గా రాపర్తి శైలజ ( మాజీ కార్పొరేటర్, తెలుగుదేశం), శ్రీ దుర్గాలమ్మ దేవస్థానం ట్రస్టీ గా   సత్యవోలు ఆనంద రావు ( తెలుగుదేశం ) తదితరులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడం హర్షణీయమన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం లో ప్రతినిధులుగా వీరు ఆయా దేవస్థానాల్లో సంప్రదాయ

కార్యక్రమాలను మరింతగా అభివృద్ధి పరిచేందుకు కృషి చెయ్యాలని కోరారు. ఈ సందర్భంగా వీరందరికి హార్దిక శుభాకాంక్షలు పూడిపెద్ది శర్మ తెలియచేసారు. 

సంప్రదాయ వైభవ సారధులకు : DNS Media  

సనాతన సంప్రదాయ వైభవాన్ని మరింత గా పరిరక్షించేందుకు బ్రాహ్మణ సామాజిక వర్గం ప్రతినిధులకు వివిధ దేవాలయాల నూతన కమిటీల్లో

సభ్యులుగా నియమించడం పట్ల  DNS Media ధార్మిక న్యూస్ సంస్థ  అభినందనలు తెలియచేస్తోంది. ఇటీవల కాలం లో సనాతన ధర్మం పై కొందరు ధూర్తులు, సంఘ విద్రోహ శక్తులు అవాకులు చెవాకులు ప్రేలుతున్న సందర్బంలో  దేవాలయాలను మరింత పటిష్టం చెయ్యడం కోసం వీరు కృషి చెయ్యగలరు అని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.   

Recent News

Latest Job Notifications

Panchangam - Oct 23, 2026

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam