DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ దేవాలయాలను దోచుకోడానికేనా ట్రస్టీలను వేసింది?

*గుడి జిల్లా తో సంబంధమే లేనివాళ్ళు బోర్డు లో సభ్యులా?*

*ఈ ట్రస్టీ ల్లో ఎంతమంది కి ఆ గుడి చరిత్ర తెలుసును?* 

(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

*విశాఖపట్నం, మే 17, 2026 (డిఎన్ఎస్ ):* గత వారం రోజులుగా రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డు లను నియమిస్తున్నారు. అయితే ఈ ట్రస్ట్

బోర్డులు ఆయా దేవాలయాల ఆదాయాన్ని దోచుకోడానికేనా అనే అనుమానం భక్తుల్లోనూ, ఆయా రాజకీయ పార్టీల్లోనూ కూడా కలుగుతోంది. ప్రస్తుతం జరిగిన నియామకాలను చూస్తే. . విశాఖపట్నం నగరం లోని  సింహాచల క్షేత్రం లోని శ్రీ వరాహ లక్ష్మి దేవస్థానం లో ట్రస్ట్ బోర్డు నియామకం జరిగింది. ఈ బోర్డులో కేవలం విశాఖపట్నం నుంచి కొందరు ఉండగా,

టెక్కలి, అరకు, పుంగనూరు, నరసారావు పెట, అనపర్తి, చీపురుపల్లి, ఎస్ కోట ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.  ఈ బోర్డు కు అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు చైర్మన్ గా ఉన్నారు. వీళ్లల్లో ధార్మిక సంప్రదాయం పట్ల గానీ, సింహాచల క్షేత్ర వైభవం, చరిత్ర గురించి గానీ దమ్మిడీ కూడా తెలిసిన వాళ్ళు లేరు. వీళ్లంతా కేవలం తెలుగుదేశం,

జనసేన, భారతీయ జనతా పార్టీ కోటాలో ఈ బోర్డు లోకి చొరబడిన వాళ్ళే తప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాల  ద్వారా సమాజ సేవ చేసిన కోటాలో కాదు.  

ఒక దేవాలయానికి ట్రస్ట్ బోర్డు నియమించేది, కేవలం ఆ దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి పరిచేందుకే తప్ప, ఆ గుడి ద్వారా వచ్చే ఆదాయాన్ని దోచుకుని, పంచుకోడానికి కాదు. ఇంతవరకూ ఎన్నో

ట్రస్ట్ బోర్డు లు నియామకాలు జరిగాయి. అసలు ఈ బోర్డులు ఈ దేవాలయ అభివృద్ధి కి ఏ మేరకు సలహాలు సూచనలు ఇచ్చారు? 

ఈ దేవాలయం గ్రేడ్ టాప్ క్యాటగిరి లో ఉంది. ఆదాయం కూడా ఆశించిన స్థాయి కి మించి ఉంది. హుండీ ల్లోనూ, భక్తుల నుంచి భారీ మొత్తంలోనూ విరాళాలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి దేవాలయాలకు బోర్డు లు లేకపోయినంత మాత్రాన ఆ

దేవాలయాలు నడవడం లేదా?  ఈ దేవాలయానికి అసలు బోర్డు అవసరం ఏమాత్రం లేదు. 

లక్షలాది ఎకరాలు ఆస్తులు ఉన్న సింహాచలం గుడి కి గతం లో ఎన్నో బోర్డు లు ఉండగానే వేల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి. వాటి ని కాపాడాలి అనే ఇంగితం కూడా నాటి సభ్యుల్లో లేకపోవడం గమనార్హం. ఇప్పడికి ఎన్నో భూములు కోర్టుల పరిధిలోనే ఉన్నాయి.  ఇలా

ఇష్టానుసారంగా దేవాలయ ఆస్తులను విడిచిపెట్టేసిన వాళ్ళు బోర్డు లో ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే అనే అభిప్రాయం భక్తుల్లో ఉంది. 

ఈ ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో ఎంతమందికి భక్తి భావం ఉంది. అసలు ఎంతమందికి ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న చరిత్ర ఉంది. ఉత్సవాల సమయంలో టికెట్లు పొందడం, ఈ బోర్డు పదవి ఆధారంగా

వ్యాపారాలు పెంచుకోవడం పైనే దృష్టి ఉంటుంది తప్ప, భక్తులకు మెరుగైన సేవలు చెయ్యాలి అనే భావన ఏ కోశానా ఉండదు. 
గతంలో పోస్ట్ లు పొందినవాళ్లు దేవాలయాన్ని ఇబ్బడిముబ్బడిగా వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కాంట్రాక్టు లు పేరుతొ వాటాలు కూడా పొందిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి దుర్ఘటనలు గమనించిన అనువంశిక ధర్మకర్త  ఈ దేవాలయానికి

ఎటువంటి బోర్డు లు వేయవద్దని గతం లోనే తెలియచేసారు. అయితే ఈ ఏడాది మాత్రం బోర్డు వెయ్యడం జరిగింది. వీళ్లల్లో ఎంతమంది హిందువులు?  ఎంతమంది సెక్కులర్ పేరుతొ ఇతరమతాలను అందలం ఎక్కించుకుంటున్నారు. అసలు వీళ్ళ జీవన శైలి ఎలా ఉందొ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 

సింహాచల క్షేత్ర దేవాలయం లో జరిగే పూజలు  ఏ విధానం

లో జరుగుతాయో కూడా తెలియని వాళ్ళు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉంటె. .. ఆ గుడి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో. . . నియామకాలు చేసినవాళ్లకే తెలియాలి. 

Recent News

Latest Job Notifications

Panchangam - Oct 23, 2026

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam