DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం క్షేత్రం లో ప్రబంధం పోస్ట్ లేకపోడానికి వాళ్లే కారణమా?

*గుళ్లో అర్చనల్లో పాంచరాత్రం, దివ్య ప్రబంధం వినిపించాలి* 

*వేదపాఠశాలలో ఆ రెండు కోర్సులు లేవు?  గుళ్లో వాటి పోస్టులు లేవు?* 

*ఈవో కు, ఆచార్యులకు  భాద్యత లేదు, పాఠశాలకు గుర్తింపు లేదు* 

(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

*విశాఖపట్నం, మే 20, 2026 (డిఎన్ఎస్ ):*

ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు సింహాచలం క్షేత్రం లో వెలసిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం శ్రీవైష్ణవ శ్రీపాంచరాత్ర ఆగమం విధానం లో నడుస్తుంది. ఈ దేవాలయంలో నిత్యం పాంచరాత్రం ఆగమం ప్రకారం అర్చనలు జరగాలి. నాలాయిర దివ్య ప్రబంధం విన్నపాలు జరగాలి. ఈ పారాయణాలు చేసేందుకు కొన్ని దశాబ్దాల క్రితం వరకూ రెగ్యులర్

విధానం లో శ్రీవైష్ణవ పండితులను నియమించేవారు. అయితే దాదాపు మూడు దశాబ్దాలుగా సింహాచల క్షేత్రంలో నాలాయిర దివ్య ప్రబంధ పండితులు కాంట్రాక్టు విధానం లో రోజువారీ వేతనం ఇచ్చే విధంగా తీసుకు వస్తున్నారు. తప్పితే  పూర్తి స్థాయి పండితులను నియమించడం లేదు. అయితే గతంలో వీటికోసం ప్రభుత్వం నియామక ప్రకటన కూడా ఇచ్చింది. అయితే

 వీటి కి తగిన సూచనలు చేయవలసిన ఆచార్యులు, నాటి అర్చకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ పోస్టులను రద్దు చేసి, వేదం కేటగిరి లోకి మార్చేశారు. 

ఆచార్యులు,  అర్చకులు కారణమా ?
సింహాచల క్షేత్రం లో రెగ్యులర్ అధ్యాపకులు, పారాయణదారుల పోస్ట్ ల నియామకం కొన్ని దశాబ్దాలుగా జరగకుండా నిలిచిపోడానికి ప్రధాన కారణం

ఆచార్యులు,  అర్చకులు ఆధిపత్య పోరే కారణం అంటూ వైదిక సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పడికే కొన్నేళ్లుగా  రోజువారీ వేతనం విధానం లో పనిచేస్తున్న వాళ్లలో ఎక్కువమందికి పూర్తి అర్హతలు ఉన్నాయి. అయినప్పడికి వీళ్ళకి నియామకం వస్తే దేవస్థానం లో తమ ఆధిపత్యం తగ్గిపోతుంది అన్న కారణంతో ఆ ఇద్దరూ ఈ పోస్ట్ లను అడ్డుకున్నారని

ప్రచారం విస్తృతంగా సాగుతోంది. పైగా వీరిలో అర్చకులుగా ఉన్నవారు గతం లో సొంత వ్యవహారాల కోసం అమెరికా వెళ్లి రావడం తో పై కారణానికి మరింత బలం పెరిగింది. ఇటీవల కోర్టు ఇచ్చిన సూచనల ప్రకారం విదేశాలకు వెళ్లిన వాళ్ళు గర్భాలయంలో అర్చనలు చెయ్యరాదు అనే నిబంధన పై వైదిక సిబ్బంది పట్టుపడుతున్నారు. అయితే అతనికి ఉన్నతాధికారుల

వద్ద ఉన్న పరపతి కారణంగా ఈ తాత్కాలిక రోజువారీ వైదికులను రెగ్యులర్ నియమాకాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు ఆచార్యులు, అర్చకులు అడ్డకుంటున్నారన్న అభియోగాలకు నిదర్శనాలు కనపడుతున్నాయి. 
గత కొన్నేళ్లుగా వీరిద్దరూ సింహాచల క్షేత్రం లో  పూర్తిగా వైదిక ఆచారాలను తుంగలోకి తొక్కి తాము చెప్పినట్టే అర్చనలు చెయ్యాలి అని

శాసిస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్ళు పెట్టె నిబంధనలు ఇతర వైష్ణవ స్వాములకే తప్ప, తాము పాటించవలసిన అవసరం లేదని బహిరంగంగానే వ్యక్తమవుతోంది. దీనికి నిదర్శనమే ఇటీవలే జరిగిన చందన యాత్ర రోజు రాత్రి నాటి సహస్ర ఘటాభిషేకం లో వైష్ణవ స్వాములందరూ కచ్చితంగా ఓపనం, శిఖా తో ఉండాలి అనే నిబంధన పెట్టారు. వీరు మాత్రం పూర్తి జుట్టు,

గెడ్డం తో ఉండడం గమనార్హం. ఇదే ప్రశ్నించిన కొందరు వైష్ణవ స్వాములను ఆలయం నుంచి వెంటనే బయటకు పంపేశారు. 

వైదిక విషయాల్లో పూర్తి అధికారం కల్గిన ఆచార్యులు తనదైన శైలిలో చెప్పిన ప్రతి విషయానికి అధికారులు తానతందానా అంటూ తలూపడం జరుగుతోంది. 

వీళ్ళ ప్రతాపంతోనే వేదపాఠశాల కుంటూ పడిందా ?

 

గతంలో వందలాది మంది పండితులు శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం పరిధిలోని వేదపాఠశాలలో చేరి, ఉన్నత విద్యావంతులు అయ్యారు. ఇక్కడ ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వ వేదం తో పాటు, శైవాగమం, పాంచరాత్ర ఆగమం, స్మార్తం, సహా ఇతర కోర్సులను నేర్పించేవారు. అయితే కొండపై ఇద్దరు పెద్దల అధికార ప్రభావంతో ఈ పాఠశాల లో

గత ఐదేళ్లుగా శ్రీ పాంచరాత్ర కోర్సు మూతపడింది.  అంతకు ముందు 35 ఏళ్లుగా నాలాయిర దివ్య ప్రబంధం కోర్సు మూతపడింది. అసలు సింహాచల క్షేత్ర దేవాలయానికి ఆయువు పట్టులైన ఈ రెండు కోర్సులనూ మూసివేయడానికి వీళ్ళకి హక్కు ఎవరు ఇచ్చారు అని వైదికులు ప్రశ్నిస్తున్నారు. ఈ పాఠశాల గురించి ఎక్కడా ప్రచారం చెయ్యరు, అసలు ఇక్కడ వేదపాఠశాల

ఉంది అనే విషయం కూడా చాలామందికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. 
ఇటీవల సింహాచల దేవస్థానం విడుదల చేసిన వేదపాఠశాల ప్రవేశ ప్రకటన ప్రత్యక్ష నిదర్శనం గా నిలిచింది. దీనిలో వేదం, స్మార్తం, శైవ ఆగమం కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులకు ఆహ్వానం అని ఇచ్చారు. దీనిలో పాంచరాత్రం గానీ, దివ్యప్రబంధం గానీ

లేవు. 

దేవాలయానికి మూలబిందువైన పాచరాత్రం, దివ్య ప్రబంధం నేర్పించేందుకు అసలు అధ్యాపకులే వేదపాఠశాలలో లేరు. వాళ్ళ నియామకం కూడా అనవసరం అని కొండపై పెద్దలు తీర్మానించినట్టు సమాచారం. కొంతమంది వైదికులు ఇప్పడికే విద్యార్హతలు పొంది, వయసు మీరిపోవడంతో ఆందోళనలో ఉన్నారు. దేవస్థానంలో పాంచరాత్రం, దివ్య ప్రబంధం

విభాగాల్లో పూర్తి స్థాయి వైదికులను నియమించినట్టయితే. .. దేవాలయంలో పాటు, వేదపాఠశాల లో విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది.  

ఈ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు లేదు.

అన్నింటి కంటే మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే సింహాచల క్షేత్రం లో ఉన్న వేద, స్మార్త ఆగమ పాఠశాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర

ప్రభుత్వ గుర్తింపు లేదు. ఇక్కడ చేరిన విద్యార్థులు ప్రభుత్వ జాబితా లో ఈ పాఠశాల విద్యార్థులుగా ఉండరు. అయినా కూడా దేవస్థానం కార్యనిర్వహణ అధికారులకు గానీ, దేవస్థానం వైదిక ఆచార్యులకు గానీ, పాఠశాల నిర్వాహక అధ్యాపకులకు గానీ పట్టింపు లేక పోవడం గమనార్హం. 

ఇదే ఒక సాధారణ పాఠశాలకు ప్రభుత్వ  గుర్తింపు  లేకపోతె

వెంటనే ఆ స్కూల్ ను మూసేయిస్తారు అధికారులు. మరి అలాంటిది దశాబ్దాల తరబడి  ప్రభుత్వ గుర్తింపు లేకుండా సింహాచలం వేద పాఠశాల ఎలా నడుస్తోంది? 

గతం లో ఇక్కడ చదివిన విద్యార్థులు ఇతర సంస్థల నుంచి ప్రభుత్వ పరీక్షలు ప్రవేశ, వర, ప్రవర,  వంటి పరీక్షలకు హాజరై వ్యక్తిగతంగా వ్రాసేవారు. అలా వచ్చిన సర్టిఫికెట్లతొ వివిధ

దేవస్థానాల్లో ఉద్యోగాల్లో చేరారు తప్ప, సింహాచల దేవస్థానం ఆగమ పాఠశాల వాళ్ళ కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే. 
పాఠశాలకు గుర్తింపు లేనప్పుడు ఇక్కడ విద్యార్థులను ఎలా చేరుస్తారు. కనీసం 20 మంది కూడా విద్యార్థులు లేకుండా ఒక వేద పాఠశాలను ఎలా నిర్వహిస్తున్నారో సింహాచల దేవస్థానము ఈఓ కె తెలియాలి.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Oct 23, 2026

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam