DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ దేవాలయ భూముల్లో చర్చ్ కి అనుమతి ఎవరు ఇచ్చారు? పూడిపెద్ది శర్మ

సింహాచలం భూముల్లో కట్టిన వైన్ షాప్, చర్చ్ లకు అధికారుల అండ ఉందా?

దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం పై విహెచ్పి రాష్ట్ర నేత పూడిపెద్ది శర్మ మండిపాటు  

(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

*విశాఖపట్నం, మే 21, 2026 (డిఎన్ఎస్ ):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు సింహాచలం క్షేత్రం

లో వెలసిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం కు చెందిన భూములు ఇతరులు కబ్జా చేస్తున్న అధికారులు కళ్ళు మూసుకు కూర్చున్నారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర మఠ్ మందిర్  టోలి పూడిపెద్ది శర్మ మండిపడుతున్నారు. దేవస్థానం కొండకి కూతవేటు దూరంలోనే ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు

కడుతుండడంతో, పూడిపెద్ది శర్మ ఆలయ అధికారులు ఏఈవో శ్రీనివాస రావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ లను వ్రాతపూర్వక ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఎటువంటి చర్యలు లేదని తెలిపారు. 
విరాట్ నగర్ లో ఏపిఎస్ఈ విద్యుత్ శాఖా కార్యాలయం ఎదురుగా ఉన్న దేవస్థానం స్థలంలో  అక్రమం గా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి, అక్కడ మద్యం

దుకాణానికి అప్పగించారు. అయితే దేవస్థానం భూమిలో అనుమతులు తీసుకుని నిర్మాణం కట్టినా, మద్యం దుకాణాలను అక్కడ పెట్టరాదు. ఇదే స్థలం మీదుగా ఆలయ ఈఓ, ఇతర అధికారులు అందరూ తిరుగుతూనే ఉంటారు. ఎవ్వరికి దీని గురించి పట్టింపు లేదు. 

ఇక అడవివరం ఎస్ సి కొలని లో దేవస్థానం భూమిలో ఏకంగా చర్చ్ నిర్మాణం చేసి, ఎటువంటి సిగ్గు

లేకుండా చర్చ్ కార్యాలపాలతో పాటు గా, మతమార్పిళ్లు సైతం యధావిధిగా చేస్తున్నారని శర్మ మండిపడ్డారు. ఈ స్థానం లో ఇంటి కోసం అనుమతి తీసుకుని, చర్చ్ ని అక్రమం గా నడుపుతున్నారని, ఆధారాలతో చూపించినా దేవస్థానం అధికారులు కళ్ళు మూసుకుపోయారని మండిపడ్డారు. ఇప్పడికైనా ఆలయ ఈఓ వెంకట్రావు ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి, ఈ దేవస్థానం

భూములను స్వాధీనం చేసుకోవడం తో పాటు,  దోషులపై చట్టప్రకారం చెర్యలు చేపట్టాలని, వీళ్ళకి సహకరిస్తున్న సింహాచల దేవస్థానం అధికారులను తక్షణం ఉద్యోగం నుంచి తొలగించాలని విశ్వహిందూ పరిషత్ తరపున పూడిపెద్ది శర్మ డిమాండ్ చేసారు. లేని పక్షంలో విహెచ్ పి  ప్రత్యక్ష పోరాటానికి సిద్దపడుతున్నట్టు హెచ్చరించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Oct 23, 2026

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam