DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం భూముల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత, విహెచ్ హర్షం

*అడవివరంలో చర్చ్ కూడా కూల్చండి: రాష్ట్ర ప్రముఖ్ పూడిపెద్ది* 

*DNS వార్త కు స్పందనగా అక్రమ కట్టడాల కూల్చివేత*

(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

*విశాఖపట్నం, మే 22, 2026 (డిఎన్ఎస్ ):* సింహాచలం దేవస్థానం భూముల కబ్జా పై DNS మీడియా లో గురువారం వచ్చిన కథనం పై దేవస్థానం అధికారాలు

స్పందించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు సింహాచలం క్షేత్రం లో వెలసిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం కు చెందిన భూములు ఇతరులు కబ్జా చేస్తున్న అధికారులు కళ్ళు మూసుకు కూర్చున్నారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అర్చక, పురోహిత్, మఠ్ మందిర్  ప్రముఖ్ పూడిపెద్ది శర్మ పోరాటం చేస్తున్నారు. అయన పోరాట ఫలితంగా

శుక్రవారం దేవస్థానం అధికారులు, అక్రమంగా దేవస్థానం భూముల్లో నిర్మించిన కట్టడాలను కూల్చి వేశారు.  సింహాచలం కొండకు దగ్గరలోనే ఉన్న విరాట్ నగర్ లో ప్రధాన కూడలి దగ్గరే ఉన్న దేవస్థానం భూమిలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను శుక్రవారం పొలిసు సిబ్బంది సహకారం తో కూల్చేశారు. ఈ చర్య పట్ల పూడిపెద్ది శర్మ హర్షం వ్యక్తం

చేసారు. 
అదే విధంగా  అడవివరం ఎస్ సి కొలని లో దేవస్థానం భూమిలో ఏకంగా చర్చ్ నిర్మాణం చేసి, ఎటువంటి సిగ్గు లేకుండా చర్చ్ కార్యాలపాలతో పాటు గా, మతమార్పిళ్లు సైతం యధావిధిగా చేస్తున్నారని శర్మ మండిపడ్డారు. ఈ స్థానం లో ఇంటి కోసం అనుమతి తీసుకుని, చర్చ్ ని అక్రమం గా నడుపుతున్నారని తెలిపారు. దీని పై కూడా అధికారులు విచారణ

జరిపి, తక్షణం చర్చ్ ను కూల్చివేయాలని డిమాండ్ చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Oct 23, 2026

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam