DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చందన యాత్ర ఆన్లైన్ టికెట్లు విధానం అట్టర్ ఫ్లాప్ 

*అనుభవ రాహిత్యం తో చుక్కలు చూపిస్తున్న దేవస్థానం.* 

*భక్తుల అకౌంట్ నుంచి డబ్బులు కట్, నో టికెట్. . .* 

*(DNS Report: Sathya Ganesh, Cheif Reporter, visakhapatnam)*    

*విశాఖపట్నం, ఏప్రిల్ 14, 2026 (డిఎన్ఎస్ ):* అత్యంత దుర్లభమైన సింహాచల క్షేత్ర  శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది

భక్తులు ఎదురుచూస్తున్న తరుణం లో ఆన్లైన్ టికెట్ విధానం ద్వారా నరకం చూపిస్తోంది దేవస్థానం. పూర్తిగా అనుభవ రాహిత్యం కొత్త వచ్చినట్టు కనిపించింది. 
మొదటిసారిగా ఈ విధానం అమలు చేస్తున్నట్టు ప్రగల్బాలు పలికిన దేవస్థానం, మాట నిలబెట్టుకోవడంలో ఘోర వైఫల్యం చెందింది. 
వరుసగా ఒక గంట పనిచేస్తే ఒట్టు. ఈ నెల 12 నుంచి

టికెట్లు ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంటాయి అని ఈఓ జె వెంకట్రావు చెప్పడంతో భక్తులు మొబైళ్ళు, కంప్యూటర్లకే అతుక్కు పోయారు. చెప్పిన ప్రకారం 12 వ తేదీ వెబ్ సైట్  పనిచేయకపోవడంతో ఒకరోజు తర్వాత పనిచేస్తుందని సొంత మీడియా ద్వారా ప్రకటించారు. అయితే 13 వ తేదీన వెబ్ సైట్ ఓపెన్ అయ్యిన,  రోజంతా హ్యాంగ్ అవుతూనే ఉంది. ఒక సారి కేవలం

ఒక్క టికెట్ మాత్రమే బుక్ అయ్యేలా పెట్టారు. బాగుంది. అయితే ఒక ఫామిలీ లో 5 గురు ఉంటె. . కేవలం ఇద్దరికీ టికెట్లు బుక్ అయినా వెంటనే వెబ్సైట్ హ్యాంగ్ అవ్వడం గమనార్హం. 
ఆ ఒక్క రోజు మహా ఓ 50 టికెట్లు బుక్ అయి ఉంటాయి. అదే తరహా దృశ్యాలు 14 వ తేదీ కూడా జనాన్ని వెక్కిరించాయి. అయితే 14 వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో వెబ్సైట్ ఓపెన్

అయినా భక్తుల అకౌంట్ నుంచి డబ్బులు దేవస్థానానికి చేరినా, టికెట్లు ప్రింట్ అవ్వకపోవడం అత్యంత దారుణం. రెండు రోజుల పాటు వెబ్సైట్ పనిచేయలేదు. మూడవ రోజు రాత్రి వెబ్ సైట్ ఓపెన్ అయ్యి, డబ్బులు పోయి ... టికెట్ లేకపోవడం దేవస్థానం నిర్వహణ నిర్లక్ష్య వైఖరి సుస్పష్టంగా కనిపించింది. 
రెండవ రోజు ప్రింట్ అయినా టికెట్ల పై క్యూ

ఆర్ కోడ్ లు ఉన్నాయి. మూడవ రోజు అసలు టికెట్టే ప్రింట్ ( జనరేట్ ) అవ్వలేదు. దీంతో వెబ్సైట్ లో ఇచ్చిన దేవాలయం హెల్ప్లైన్ నెంబర్ 93987  34612 కు ఎన్ని సార్లు ఫోన్ చేసిన సమాధానం రాకపోవడం గమనార్హం. అసలు వీళ్ళకి టికెట్ వచ్చినట్టా లేదా అనే విషయం కూడా చెప్పే నాధుడు సింహాచలం దేవస్థానం లో లేడు. భక్తులకు విస్తృత సేవలు చేస్తున్నాం అని

ప్రకటించిన జిల్లా కలెక్టర్, రెవిన్యూ యంత్రాంగం, ఇతర ప్రభుత్వ అధికారులు భక్తులకు సమాధానం చెప్పవలసి ఉంది. పైగా ముగ్గురు మంత్రులతో పర్యవేక్షణ సంఘం ఏర్పాటు చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Oct 23, 2026

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam