DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచల వైభవం, కృష్ణమయ్య పాటకు - నృసింహుని ఆటకు చెల్లు

జగదాచార్యులు  రామానుజుల రాక తో సింహాచల క్షేత్రానికి వైదిక వైభవం...*

*(DNS Report: Sathya Ganesh, Cheif Reporter, visakhapatnam)*    

*విశాఖపట్నం, ఏప్రిల్ 19, 2026 (డిఎన్ఎస్ ):* ప్రసిద్ధ  సింహాచల క్షేత్రంలో  శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి పట్ల అచంచలమైన భక్తి ఉన్న పరమ వైదికుల్లో అగ్రగణ్యులు. శ్రీ కాంతా కృష్ణమాచార్యులు ఒకరు. వారు

ఎంతో విద్వత్ సంపన్నులు. కవి పండితులు. వీరు స్వామిని. కీర్తిస్తూ పాటలు పాడితే  స్వామి నృత్యం చేసేవాడు.  ప్రతీ రోజూ  ఇదే జరిగేది. దీంతో  వీరి ఖ్యాతి  ఎంతో పెరిగింది. దాంతో పాటు వీరికి కొంత  అహం కూడా పెరిగింది. దాంతో ఇతరుల పట్ల వీరి వైఖరి మారింది. 
అదే కాలంలో కొన్నాళ్ళకి యాతీశ్వరులు, జగదాచార్యులు శ్రీ

 భగవద్రామానుజాచార్యులు  ఈ క్షేత్రానికి విజయ యాత్ర చేశారు.  శ్రీ వైష్ణవ  సంప్రదాయం ప్రకారం పెద్దలు మన గ్రామానికి వస్తె వెళ్ళి వారిని దర్శించాలి.  అయితే కృష్ణమయ్య .. నేను పాడితే స్వామిని పలుకుతున్నాడు.. ఇక ఇతరులతో పనేంటి అనే కించత్ భావంతో రామానుజుల వద్ద కు వెళ్ళరు. 
అయితే వీరి వైభవం తెలుసుకున్నా రామానుజులు

అవకాశం చూసుకుని ఒకసారి తమ వద్దకు రావాల్సిందిగా కబురు పంపుతారు. తానూ రావడం కుదరదు అని తేల్చి చెప్పడం తో తమ శిష్యులతో ఒక సందేశాన్ని కృష్ణమయ్య వద్దకు పంపుతారు రామానుజులు. 

వీరు పంపిన సందేశం : 
1 .  రాత్రి మీ గాత్ర సమయం లో స్వామి వచ్చినప్పుడు. రామానుజులకు  మోక్షం ఉందా  అని స్వామిని అడిగి

తెలుసుకోవాల్సిందిగా కోరతారు. 
అదే ప్రశ్న ను రాత్రి సమయంలో కృష్ణమయ్యా శ్రీ వరాహ నృసింహ స్వామిని అడుగుతారు.
దానికి స్వామి ఓ కచ్చితంగా వారికి మోక్షం ఉంది అని చెప్తారు.

రెండవ రోజు రామానుజులు మరొక సందేహం అడగమని కోరతారు. 
2 . కృష్ణమాచార్యులు ku మోక్షం ఉందా అని అడగమంటారు.వెంటనే కృష్ణమ య్య గట్టిగా నవ్వి..

నేను పాడితే నృసింహుడు నృత్యం చేస్తాడు.  నాకు మోక్షం  లేకపోవడం ఏంటి అని ప్రశ్నిస్తాడు. అయినా స్వామిని అడుగుతా లే అని చెప్తారు.
రాత్రి ఏకాంత సేవలో స్వామి వచ్చినప్పుడు. కృష్ణమాచార్యులు ఇదే ప్రశ్న ను వరాహ నృసింహుని అడుగుతారు.
దానికి సమాధానంగా నృసింహుడు. తెలియదు అని చెప్తాడు.
అదేంటి నేను పిలిస్తే నువ్వు

వస్తున్నావు... నాకు మోక్షం లేకపోవడం  ఏంటి అని అడుగుతారు.
దానికి నవ్వి. నువ్వు పాడుతున్నావు...  దానికి నేను నృత్యం చేస్తున్నా.  రెండింటికీ చెల్లు అంతే.
ఇక మోక్షం సంగతి అంటావా..
.
నీతో సహా అందరికీ మోక్ష మార్గం చూపించేది రామానుజులే.  నీకు మోక్షం కావాలి అంటే రామానుజులు ను ఆశ్రయించమని చెప్తారు.
దాంతో

జ్ఞానోదయం కలిగి, రామానుజులు ను ఆశ్రయించి   సంప్రదాయ సేవ మరింత ఉధృతంగా చేస్తారు. స్థానికంగా చేపట్టవలసిన వైదిక క్రియలు తెలియచేసి, వారిని పర్యవేక్షించమని సూచిస్తారు.

ఎంత విద్వత్ ఉన్నా. . .పెద్దల ఎదుట వినయంగా ఉండాలి అనే సందేశాన్ని కాంతా కృష్ణమాచార్య  వృత్తాంతం తెలియచేస్తోంది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Oct 23, 2026

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam