DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైదిక రూల్స్ వైష్ణవ స్వాములకేనా? సింహాచలం అర్చకులకు వర్తించవా?

*విదేశీయానం చేసినా అర్చకులు గర్భాలయ సేవ చెయ్యోచ్ఛ?* 

*సింహాచల దేవాలయ అర్చకుల్లో విదేశాలకు వెళ్లినవాళ్ళెందరో?*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    
    
*విశాఖపట్నం, ఏప్రిల్ 21, 2026 (డిఎన్ఎస్ ):* అత్యంత దుర్లభమైన సింహాచల క్షేత్ర  శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం ఎంతో

మహోన్నతం. అలాంటి స్వామికి  ఉపచారాలు జరిపే వైదికులు ఎంతో  పవిత్రంగా ఉండాలి అనేది ఆగమశాస్త్ర సారం. అయితే ఈ రూల్స్ సింహాచలం క్షేత్రం అర్చకులకు ఏమాత్రం వర్తించవు అనేది సుస్పష్టంగా తెలుస్తోంది. 

అయితే సింహాచల క్షేత్రం లో నిబంధనలు ఎవరికీ వారే మార్చేసుకుంటారు. నిన్నటి రోజున ( ఏప్రిల్ 20 , 2026)  జరిగిన శ్రీ

వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం అనంతరం స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. అయితే దీనిలో పాల్గొని సేవచేసే అవకాశం కేవలం సమాశ్రయణపరులైన శ్రీవైష్ణవ స్వాములకు మాత్రమే ఉంటుంది. దీనికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. తలపై కేవలం శిఖ మాత్రమే ఉంచి, ముఖంపై ఉన్న మీసం, గెడ్డం కూడా పూర్తిగా క్షవరం చేయించాలి. దీనికి

ఓపనం అని పేరు. అయితే వివిధ దేవాలయాల్లో పనిచేసే అర్చకులు దీక్షాధారులుగా తలపై  పూర్తి జుట్టు, ముఖం పై మీసం, గెడ్డం కలిసి ఉన్నవాళ్లు కూడా పాల్గొన్నారు. వీరందరినీ తక్షణం బయటకు వెళ్ళవలసిందిగా సింహాచల క్షేత్రం అర్చిక, వైదిక సిబ్బంది ఆదేశాలు జారీచేశారు. గర్భాలయానికి ముందు నీలాద్రి మండపం వద్ద వీరంతా నిలబడి, ఇలా పూర్తి

జుట్టు ఉన్నవాళ్ళని, బయటకు లాగేసారు. వాళ్ళు దేవాలయ దీక్షలో ఉన్నామని చెప్పినా కూడా క్షమాపణ లేకుండా నిర్దాక్షిణ్యంగా బయటకు లాగేసారు. ఇంతవరకూ సంప్రదాయ నిబంధనలు వీరు అద్భుతంగా పాటించారు. భేష్. అయితే... ఇలా నిబంధనలు అమలు చేసిన సింహాచల క్షేత్ర అర్చకుల్లో చాలామంది ఇలా పూర్తి గెడ్డం, మీసం జుట్టుతో ఉండడం గమనార్హం..

 

ఈ రూల్స్ కేవలం సేవ చేసేవారికేనా? 
ఈ ఓపనం నిబంధనలు  కేవలం సహస్ర ఘటాభిషేకం చెయ్యడానికి వచ్చిన వైష్ణవ స్వాములకేనా?  సింహాచలం దేవస్థానం అర్చకులకు ఈ నిబంధనలు వర్తించవా అనే ప్రశ్నలు వెల్లువవుతున్నాయి. 
ఇదే ప్రశ్న వేసిన మిగిలిన వారిపై అర్చకులు మండిపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

విదేశీ

యానాం పై విమర్శలు...

ఆగమ శాస్త్రం ప్రకారం సముద్రయానం ( విదేశీ యానం ) చేసిన వైదికులు, అర్చకులు, గర్భాలయంలో మూలవిరాట్ ను ముట్టుకుని అర్చనలు చెయ్యడానికి నిషేధం. అంటే. . సముద్రం దాటి ప్రయాణించి, విదేశాలకు ఏ విధంగా వెళ్లినా తిరిగి వచ్చిన తర్వాత గర్భాలయంలో ఎటువంటి సేవ చెయ్యకూడదు అని ఆగమం తెలియచేస్తోంది. అయితే ఈ

నిబంధనలు సింహాచల క్షేత్రం లో ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ప్రస్తుతం విధుల్లో ఉన్న అర్చక, వైదిక సిబ్బంది లో చాలా మంది సముద్రం దాటి, విదేశీయానం ప్రయాణం చేసినవాళ్ళే కావడం గమనార్హం. పైగా ఒక్కసారి కాదు, పలుమార్లు అమెరికా, కెనడా వంటి దేశాలకు వెళ్లి, నెలలకు నెలలు కాలం గడిపిన సందర్భాలు ఉన్నాయి. వీళ్లల్లో సామాన్య అర్చకుల

నుంచి ప్రధాన అర్చకుల వారకూ ఉన్నారు అనేది వైదిక వర్గాల అభియోగం. 
వీళ్ళు నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికారుల వద్ద తమ పరపతిని వాడి, ప్రలోభపెట్టో, బ్రతిమాలో, ఇంకే విధంగానే, ఈ రూల్స్ ని తారుమారు చేసేసారు అనే విమర్శలు సాక్షాత్తు దేవస్థానం సహచర అర్చకుల్లోనే వినపడుతోంది. 

వైదిక నిబంధనలు

కేవలం సామాన్య వైష్ణవ స్వాములకు మాత్రమేనని,  పలుకుబడి ఉన్న అర్చకులు, వైదికులకు కాదు అనేది సింహాచల క్షేత్రం లో సుస్పష్టం అవుతోంది.  అయితే ఈ విధమైన పరిస్థితి కేవలం సింహాచల క్షేత్రంలో మాత్రమే కాదు,  రాష్ట్రంలోని ఇతర దేవాలయాల్లో కూడా ఉంది అన్నది వాస్తవం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Oct 23, 2026

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam