DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పక్కింట్లో పెళ్ళికి బాజాలు సరే, ఆంధ్ర సంగతి చూడండి

*రైల్వే జోన్ గెజిట్ పై ఆంధ్ర బీజేపీ నేతలకే పట్టింపు లేదాయె*

(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

*విశాఖపట్నం, మే 05, 2026 (డిఎన్ఎస్ ):* అన్ని చోట్ల బీజేపీ గెలుస్తున్నా. . . ఆంధ్ర బీజేపీ కి కనీసం పట్టింపు లేకుండా పోయాయి. అత్యంత ప్రమాదకరమైన పశ్చిమ బెంగాల్ లో  పోరాడి గెలిచినా బీజేపీ గురించి

ఆంధ్ర లో నాయకులూ చంకలు గుద్దుకుంటున్నారు. ఎప్పుడూ ఎదురింట్లో పెళ్లి కి వీళ్ళు చప్పట్లు కొట్టడం తప్ప, వీళ్ళింట్లో పెళ్లి చెయ్యాలి అనే జ్ఞానము లేకుండా పోయింది. ఇప్పడి వరకూ ఆ సోయి రాలేదు. ఇక ముందు వస్తుందన్న నమ్మకం పార్టీ క్యాడర్ లో పోయింది. 
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి ఆంధ్ర బీజేపీ నేతలు డబ్బాలు

కొట్టుకుంటున్నారు తప్ప,  కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు చేసిన అద్భుత మేలు గురించి ఒక్కడు నోరు ఎత్తిన పాపాల పోలేదు. 
కొన్ని దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్న విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ మంగళ వారం అధికారికంగా గెజిట్ విడుదల అయ్యింది. ఇది బీజేపీ చరిత్రలో అత్యంత పెద్ద విజయం. అయితే దీన్ని ప్రచారం చెయ్యడానికి

ఒక్క బీజేపీ నేత, ఆఖరికి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సైతం ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి మిఠాయిలు పంచాడు తప్పితే. . సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అధికారిక ప్రకటన గురించి నోరు విప్పలేదు. ఇలాంటి వాళ్ళు నేతలు రాష్ట్ర నేతలు గా ఉంటె. . .పార్టీ అడుక్కు తినక అధికారం లోకి వస్తుందా అని సగటు పార్ట్ క్యాడర్

ప్రశ్నిస్తోంది. 
ఈ ప్రకటన గతంలోనే వఛ్చినప్పడికి. . .అధికారిక ఉత్తర్వులు మాత్రం మంగళ వారమే వచ్చాయి. దీని ప్రకారం జూన్ 1 , 2026 నుంచి అమలు లోకి రానుంది. దీని కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. పోరాటాలు జరిగాయి. ఆఖరికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి, విశాఖ లో సభ పెట్టి మరీ రైల్వే జోన్ గురించిన ప్రకటన విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి.

అంతటి గొప్ప విషయాన్నీ ప్రకటించుకునే స్థాయి ఆంధ్ర బీజేపీ నాయకులకు లేకుండా పోయింది అంటే. . 
ఈ ప్రకటన విడుదలయ్యే సమయానికి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ విజయవాడ కార్యాలయం లోను, విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం శాసన సభ్యులు విష్ణు కుమార్ రాజు, తన కార్యాలయం లోనూ, విశాఖ నగర అధ్యక్షుడు పరశురామ రాజు నగర పార్టీ

కార్యాలయంలోనూ బెంగాల్ విజయం పై సంబరాలు చేసుకుంటున్నారు. అయితే విశాఖ రైల్వే జోన్ గురించి ఏ ఒక్కరూ ఒక్క మాట మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ నేతల వైఖ రి చూస్తే  ఈ రాష్ట్రంలో బీజేపీ ఏ స్థాయి లో అడుగంటిపోయిందో తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Oct 23, 2026

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam