DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమీ. . . సుబెందు అధికారి.  వినగానే..అక్కడ సంబరాలు

*తెలుగు రాష్ట్రాల్లో స్వయం మేతావులకు గుండెపోటు వచ్చిందిట?*   

*వాళ్ళకి సందేశ్ ఖాలీ కనపడదు, ఆర్జీ కార్  మర్డర్ కనపడవు.*

*50 ఏళ్లుగా నరకంలోనే ఉంది: మాజీ డిజిపి డా బిఎన్ రమేష్* 

(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

*విశాఖపట్నం, మే 09, 2026 (డిఎన్ఎస్ ):* పశ్చిమ బెంగాల్ లోని

కోలకతా వేదిక నుంచి అమీ. .. సువెందు అధికారి అని పదాలు వినపడగానే శనివారం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, లోని చాలామందికి గుండెపోటు వచ్చేసినట్టు తెలుస్తోంది. గత పాలకులకు వీళ్ళు తొత్తులు అనుకుంటే మహాతప్పు. వీళ్ళు కడుపుమంట అంతా భారతీయ జనతా పార్టీ కి వ్యతిరేకం, భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటే కడుపుమంట. వీళ్లల్లో అధికులు స్వయం

ప్రకటిత మేతావులు, హిందూ వ్యతిరేక శక్తులు, సెక్కులర్ నక్కలు. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిని పట్టించుకునే సమయం, తీరిక బీజేపీ కి లేవు. వాళ్ళ ఉనికి ని తెలియచేసుకునేందుకు కనిపించిన ప్రతీ మైకు  ముందు తమ కడుపుమంట  వ్రెళ్ళగక్కుతున్నారు. .  

భారత దేశంలో అత్యంత ప్రమాదకర ఘటనలు జరుగుతున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. గత ఏడు

దశాబ్దాలుగా అక్కడ జరుగుతున్నా అరాచకాలను, మహిళలపై పట్టపగలే అత్యాచారాలను,  భరించలేని స్థానిక ప్రజలు 2026 ఎన్నికల్లో కమ్మునిస్థులకు, తృణమూల్ ఖాన్ గ్రెస్ సహా ఖాన్ గ్రెస్ లాంటి అన్ని పార్టీలకు గట్టిగా బుద్దిచెప్పారు. దీని ఫలితంగా బీజేపీ కి 207 సీట్లు ఇచ్చారు. టిఎంసి కి 80 సీట్లు, ఖాన్ గ్రెస్ కి 2 సీట్లు, ఇచ్చారు. దశాబ్దాల

కాలం పాలించిన  కమ్యూనిస్ట్ లకు డిపాజిట్లు కూడా రాలేదు. 
దీంతో ఆంధ్ర లోని స్వయంప్రకటిత మేథావులు, ( వీళ్ళ సంఘం లో రెండో సభ్యుడు లేడు, ఎందులో మేతావో తెలియదు) తెగ విషయం క్రక్కుతున్నాడు. ఇతనికి మద్దతుగా ఆ ఒడిన  పార్టీల చెంచాలు సోషల్ మీడియా వేదికగా ఎన్నికల సంఘం పై దారుణంగా విషం క్రక్కుతున్నారు. ఈవీఎం లు మోసం చేశాయని,

బీజేపీ, మోడీ బెంగాల్ ని మోసం చేసారంటూ తెగ ఫీల్ అవుతున్నారు. గత 7 దశాబ్దాలుగా బెంగాల్ లో మహిళలపై జరిగిన  అఘాయిత్యాలు వీళ్ళకి కనపడలేదు. సందేశ్ ఖాళీ లో షాజహాన్ ఖాన్ నేరుగా పార్టీ కార్యాలయంలోనే  మహిళలపై చేసిన అఘాయిత్యాలు, మట్టుపెట్టడాలు, కోలకతా మహా నగరం నడిబొడ్డులో ఆర్ జి కార్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ పై పట్టపగలు

జరిగిన అఘాయిత్యం, హత్య లు ఈ ఉత్తుత్తి మేతావులకు కనపడలేదు. 
వీటిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని సువెందు అధికారి ప్రకటన చెయ్యగానే కలుగులోని ఎలకల్లా ఒక్కసారిగా ఈ హిందూ వ్యతిరేక శక్తులన్నీ రోడ్డెక్కి గుండెలు బాదుకుంటున్నాయి. 

అలాంటిది శనివారం సువెందు అధికారి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చెయ్యగానే

ఇక్కడ చాలా గుండెలు బాదేసుకున్నారు. 

సెక్రటేరియట్ లో సంబరాలు : 
అదే క్రమం లో బెంగాల్ లో ప్రభుత్వం పడిపోగానే ప్రభుత్వ సచివాలయంలో వందలాది మంది ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు అంటే గత ప్రభుత్వం ఉద్యోగులను ఎంతగా నరక బాధలు పెట్టిందో తెలుస్తోంది. బెంగాల్ లో హిందువులు అత్యంత మైనారిటీలుగా బ్రతుకులు

ఈడ్చారు అనడానికి నిదర్శనం. .. బెంగాల్ లోని హిందూ దేవాలయాలకు తాళాలు వెయ్యడమే. కోర్టు లు ఆదేశం ఇచ్చినా... ఈ గుళ్ళు తెరిస్తే  హిందువులను నడిరోడ్డుమీదే చంపేస్తాం అని బెదిరించిన ఘటనలు ఈ ఉగ్రమేతావులకు కనపడలేదు. వీళ్ళ కార్యాచరణ పరిశీలన చెయ్యవలసిన అవసరం ఉండనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. 

మాజీ డిజిపి రమేష్

సంచలన వ్యాఖ్యలు:

బెంగాల్ లో గత పాలకుల హయం లో జరిగిన దుర్ఘటనలు, అఘాయిత్యాలను మాజీ డిజిపి డా. రమేష్ ఒక మీడియా డిబేట్ లో వివరించారు. గత 50 ఏళ్ళ నుంచి అన్యాయాలు, అక్రమాలు విస్తృత కృత్యాలు జరిగాయన్నారు. గత మూడు దశాబ్దాలుగా బెంగాల్ లోనే ఉన్నామని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని తెలిపారు. సందేశ్ ఖాలీ, ఆర్ జి  కార్

లాంటి ఘటనల వెనుక కార్యాచరణ ఎంత భయంకరం గా ఉందొ తెలిపారు. ఆర్ధిక వనరులపై చావుదెబ్బ కొట్టి, పరిశ్రమలను తరిమికొట్టారన్నారు. అభయ ఘటనలో 500 మంది పోలీసులను పంపి, ఆ శరీరాన్ని ని హైజాక్ చేసి, 10 లక్షలు పంపి, మరో 5 లక్షలు ఇఛ్చి కేసుని బయటకు రాకుండా చేశారన్నారు. కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులను చేశారన్నారు. అదే గుండాలు,  మే 4

తర్వాత మిమ్మల్ని ఎవడు కాపాడతాడో మెం చూస్తాం అంటూ నేరుగా కేంద్ర పొలిసు బలగాలకు హెచ్చరిక జారీ చేశారంటే. .. బెంగాల్ లో స్థితి ఎలా ఉందొ తెలుస్తోందన్నారు. ఈ డీ చర్యలను సైతం అడ్డుకుని, రాజ్యాంగ వ్యవస్థ కార్యాచరణని అడ్డుకున్నారని, వాటిని ప్రక్షాళన చెయ్యవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను సరిదిద్దడానికి

కొంత సమయం పడుతుందని, రాబోయే ఐదేళ్లు కత్తిమీద సాములాంటిదన్నారు. 
బెంగాల్ చరిత్రలో 25 లక్షలకు మంది పైగా జనం  మొట్టమొదట సారి పోలింగ్ బూత్ లను చూసింది ఈ 2026 ఎన్నికల్లోనే అని అన్నారు .  

యోగి,  బాబు, హాజరు :
సువెందు అధికారి ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్య నాధ్,

చంద్ర బాబు నాయుడు, రేఖ గుప్త, సహా ప్రముఖులు హాజరయ్యారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Oct 23, 2026

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam