DNS Media | Latest News, Breaking News And Update In Telugu

1967 లో ఇందిరా చెప్తే లేవని నోళ్లు, మోడీ చెప్తే ఎందుకు ఏడుస్తున్నాయి?

*దేశ ఆర్ధిక భద్రతా కోసమే. . బంగారం కొనవద్దు ప్రధాని పిలుపు...*

(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

*విశాఖపట్నం, మే 12, 2026 (డిఎన్ఎస్ ):* ఒక ఏడాది పాటు బంగారం కొనవద్దు అని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇవ్వగానే. . .దేశం లోని వ్యతిరేకశక్తులన్నీ నోరు పట్టుకుని విరుచుకు పడ్డాయి .  అంతర్జాతీయ

ఆంక్షల పరిస్థితుల నేపథ్యంలో ఒక ఏడాది పాటు మనం జాగ్రత్తగా ఉండాలి అని మోడీ తెలియచేసారు. అయితే ఈ దేశంలో ఉంటూ.. ఈ దేశం లో తింటూ.. ఈ దేశ అభివృద్ధి కోసం ప్రధాని ఇచ్చిన పిలుపు ను మాత్రం అత్యంత దారుణంగా విమర్శిస్తున్నాయి.  ఇప్పుడు మోడిని విమర్శిస్తున్న ఖాన్ గ్రెస్,  కమ్యుని(కి)ష్టులు, 1967 జూన్ 6 నాడు ఇదే పిలుపు ఇచ్చిన నాటి

ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ని ఎందుకు ప్రశ్నించలేదు. అప్పుడు గొర్రెల్లా తలూపిన వీళ్ళకి ఇప్పుడు పరిస్థితి తెలియదా. .  ఏదో పెద్ద రోజుకో కేజీ  బంగారం కొనే మొహాలు వీళ్ళూనూ.. 

అసలు ప్రధాని ఇచ్చిన పిలుపు ఎందుకు?
పశ్చిమ దేశాల మధ్య జరుగుతున్నా యుద్ధ వాతావరణం నేపథ్యంలో అమెరికా బంగారం దిగుమతులపై అధిక పన్నులు

విధించి, భారత్ పై అదనపు భారాన్ని మోపింది. అదే నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ తదితర ఇంధన ఉత్పత్తులపై అరబ్ దేశాలు పన్నులు మోత  మ్రోగిస్తున్నాయి. వీటన్నింటీ నీ భారత్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ మారకం పైనే జరుగుతాయి. 
వీటిని కొంతకాలం తగ్గించుకుంటే. . డాలర్ మారకం

తగ్గుతుంది. భారత్ పై ఆర్ధిక భారం తగ్గుతుంది. అనవసరం గా బంగారం కొనడం వల్ల  భారత ధనం  డాలర్ల రూపంలో అమెరికాకు చేరుతుంది. పెట్రో ఉత్పత్తులు కొనడం వల్ల  ధనం  డాలర్ల రూపంలో అరబ్ దేశాలకు చేరుతుంది. వీటిని కొన్నాళ్ళు తగ్గించడం వలన , భారత్ నుంచి వెళ్లే డాలర్ల సంఖ్యా తగ్గుతుంది. భారత్ విలువ అమెరికాకు, అరబ్ దేశాలకు

తెలుస్తుంది. అని భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ మాటపై  ఖాన్ గ్రెస్, కమ్యుని (కి)ష్టులు నోటికి వచ్చిన విమర్శలు పేలుతున్నాయి. 
సరిగ్గా ఇలాంటి పరిస్థితులే 1967 లో వచ్చ్చాయి. జూన్ 6 , 1967 న  నాటి భారత దేశ  ప్రధాన మంత్రి ఇందిరా బంగారం కొనవద్దు అని  ప్రజలకు పిలుపు ఇచ్చారు. అదే విషయాన్నీ, హిందూ

దినపత్రిక ప్రధాన వార్తగా ప్రచురించింది. 

బంగారం కొనవద్దు, ప్రజలకు ఇందిర 1967 లో పిలుపు; 

'జాతీయ క్రమశిక్షణ' పాటించాలని విన్నపం విదేశీ మారక ద్రవ్యం పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉంది:  ఏ రూపంలోనూ బంగారం కొనవద్దని, దేశంలో బంగారు వినియోగం విషయంలో  "జాతీయ క్రమశిక్షణ" పాటించాలని ప్రధాన మంత్రి

ఇందిరా గాంధీ నేడు ప్రజలకు హృదయపూర్వక విన్నపం చేశారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషిలో భాగంగానే ఈ విన్నపం చేశారు. 

అందులో  విమర్శకుల నుంచి  ఒక్క విమర్శ కూడా లేదు.  పైగా అన్ని వర్గాలూ ఈ ప్రకటనను  పూర్తిగా సమర్ధించాయి.. మరి అదే

పరిస్థితులు ఉన్న నేడు అదే భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కొంతకాలం  బంగారం కొనవద్దు అని పిలుపు ఇస్తే. . .నేటి పత్రికల్లో స్వయం ప్రకటిత  మేతావులు, విమర్శకులు అనేక ప్రేలాపనలు  ప్రేలుతున్నారు. పైగా దిక్కుమాలిన సోషల్ మీడియా లో దారుణంగా దూషణలు కూడా మొదలు పెట్టేశాయి.  

అదే పరిస్థితులు - -  ప్రధాని ఒక ప్రకటన

ఇస్తే. . .సమర్ధించిన విమర్శకులు,  అలాంటి పరిస్థితుల్లో భారత ప్రధాని అదే ప్రకటన చేస్తే. . .
అసలు సొంతంగా పనిచేసి దమ్మిడీ కూడా సంపాదించలేని చవటలు, దేశ విద్రోహ శక్తులు విదిలించే  ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడుతున్న వాళ్ళు నోటికి వచ్చిన ప్రేలాపనలు చేస్తున్నారు అంటే. . . ఈ విమర్శకుల వెనుక ఉన్న దేశ విద్రోహ శక్తులను

అరెస్ట్ చేసి, విచారణ జరపవలసిన అవసరం ఉంది అని జాతీయ వాదులు అభిప్రాయపడుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Oct 23, 2026

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam