DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖలో భారీ అవినీతి తిమింగలం,  ఏసీబీ వలలో APIIC సర్వేయర్  

సాగర తీరం లో భారీ మొత్తం పట్టివేత 

విశాఖపట్నం, అక్టోబర్ 30, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) : ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల మౌలిక వసతుల సంస్థ (ఏ పీ ఐఐసి ) లో సర్వేయర్ à°—à°¾ చేస్తున్న

రోకలి చిరంజీవి రావు రూపంలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో భారీ తిమింగలం పట్టుబడింది. బుధవారం ఉదయం నుంచే దాదాపు ఇతనికి సంబంధించిన ఇల్లు, బంధువుల

ఇళ్లల్లో ఏక కాలం లో పది చోట్ల శోదాలు చేపట్టారు. ఇప్పడికే భారీ మొత్తం లో లెక్కలు తేలని విలువైన పత్రాలు, బంగారు, వెండి ఆభరణాలు లభించినట్టు తెలుస్తోంది. మురళి

నగర్ , ఎన్ జి ఓ యస్ కాలనీ, కపరాడ, మధురవాడ, రాంబిల్లీ, రెడ్డిపల్లి, ఎలమంచిలి, తదితర ప్రాంతాల్లో దాడులు. చిరంజీవరావు ఇంటి తో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కూడా

సోదాలు చేపట్టారు.

అవినీతి లో అగ్రస్థానం లో ఆంధ్ర ప్రదేశ్ ఉంది అన్న ప్రతిపక్ష పార్టీల విమర్శలు నిజమే అన్నట్టుగా అవినీతి నిరోధక శాఖ జరుపుతున్న దాడుల్లో

అక్రమార్కులు పుంఖానుపుంఖాలుగా దొరికేస్తున్నారు. పైగా ఆదాయానికి అందనంత మొత్తంలో లంచాలకు అలవాటు పడి సంపాదించిన ఆస్తులు భారీ మొత్తం లో దొరుకుతూ అవినీతి

నిరోధక శాఖ అధికారులకే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయంటే అతి శయోక్తి కాదు. చిన్న స్థాయి సిబ్బంది, అధికారుల వద్దే ఇంత మొత్తం లో కోట్లాది రూపాయలు అవినీతి సొమ్ము

దొరుకుతూ ఉంటే. . . ఇక ఉన్నత స్థాయి అధికారులు, అధికార పార్టీ పెద్దల వద్ద ఇంకెంత దొరుకుంటుందో అనే వ్యాఖ్యలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns

media  #vizag  #visakhapatnam  #ACB raids  #APIIC  #surveyor  #Chiranjeeva Rao  #Kancharapalem


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam