DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాయనాడ్ ఉపఎన్నిక హిందూ - ముస్లిం పోల్ వార్ కానుందా?

*కాంగ్రెస్ కు హిందు శక్తి చూపేందుకు బరిలోకి బీజేపీ మహిళా నవ్య* 

*(Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)

విశాఖపట్నం, అక్టోబర్ 26, 2024 (DNS): కేరళ లోని వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ కు గట్టి గుణపాఠం నేర్పేందుకు బీజేపీ చాల పెద్ద పథకం రచించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి 55 ఏళ్ళ నవ

యువకుడు రాహుల్ ఎన్నికైన రాజీనామా చేయడంతో నవంబర్ 20 న ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. 
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రియాంక వాద్రా గాంధీ నెహ్రు బరిలోకి దిగుతోంది. ఈమెకు ముస్లిం సంఘాలన్నీ మద్దతు ప్రకటించాయి. కేరళ లో కొన్నేళ్లుగా ముస్లిం జనాభా ఎక్కువ కావడం, వారంతా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో కేరళ కాంగ్రెస్ కు

కంచుకోటగా మారింది. అయితే ఇటీవల కాంగ్రెస్ నేతలు తమది ముస్లిం పార్టీ అని ప్రకటన లు చేయడంతో హిందూ సమాజం మేలుకుంటోంది. ఈ క్రమం లో ఉప ఎన్నిక జరగడం బీజేపీ కి బాగా కలిసి వచ్చింది. హిందూ సమాజాన్ని మేలుకొలిపేందుకు రంగంలోకి యువ మహిళా నేత నవ్య హరిదాసు ను బరిలో నిలిపింది. ఈమె కేరళ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన

కార్యదర్శిగా ఉన్నారు. ఈమె పేరు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ ఖంగుతింది. 

ఈ ఎన్నిక హిందూ ముస్లిం వార్ పోల్ ప్రదర్శనగా మారె అవకాశం ఉండవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. 

అత్యంత ఉన్నత విద్యావంతురాలు ( బి టెక్, న్యాయ వాదీ కూడా )  కావడం, దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేయడం, స్థానిక కౌన్సిలర్ గా

రెండు విడతలుగా ఎన్నికై పరిపాలన అనుభవం ఉండడం నవ్య హరిదాసు కు బాగా కలిసి వచ్చింది. స్థానిక సమస్యల పై అవగాహనా, స్థానికులతో పరిచయాలు ఉండడం,   అందరిని కలుపుకుంటూ వెళ్లే మనస్తత్వం, అందరూ ఈమెను నేరుగా కలుసుకుని సమస్యలు చెప్పుకోగలిగే అవకాశం ఉంది. దీంతో స్థానిక ప్రజలు నవ్య కు సంఘీభావం ప్రకటిస్తున్నారు. హిందూ సంఘాలు,

ధార్మిక సంస్థలు ఇప్పడికే ప్రచారం లోకి దిగాయి. 

ఈమె నేపథ్యం క్లుప్తం...

నవ్య హరిదాస్ జనవరి 5, 1985న కేరళ రాష్ట్రంలో కోజికోడ్‌లో జన్మించారు. 39 సంవత్సరాల వయస్సులో, ఆమె మహిళా సాధికారత కోసం ప్రముఖ న్యాయవాదిగా మారింది, ఇది భారతదేశంలో రాజకీయాల యొక్క మారుతున్న ముఖాన్ని సూచిస్తుంది.

ఈమె కుటుంబం

హిందూ జాతీయవాద సంస్థ లైన సంఘ్ పరివార్‌ తో అనుబంధం ఉంది. ఈమె రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో విద్యార్థి దశ నుంచి  కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంది. ఈ వాతావరణం నవ్య  భవిష్యత్తు ప్రయత్నాలకు బలమైన పునాది వేసింది.

నవ్య కోజికోడ్ జిల్లాలోని చిన్మయ విద్యాలయంలో, KMCT కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో చేరింది, అక్కడ ఆమె

B.Tech సంపాదించింది, 2007లో న్యాయ శాస్త్రం లో పట్టభద్రురాలైంది. ఆమె సాంకేతిక నేపథ్యం ఆమెకు సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మక విధానాన్ని అందించింది, ఈ నైపుణ్యం ఆమె రాజకీయ జీవితంలో అమూల్యమైనదిగా నిరూపించబడింది. .

సాఫ్ట్ వెర్  ఉద్యోగి గా. .

ఇంజనీరింగ్ తర్వాత, నవ్య హెచ్ఎస్ బిసి  బ్యాంక్‌లో

సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది. నవ్యకు సింగపూర్ మరియు నెదర్లాండ్స్ రెండింటిలోనూ పని అనుభవం ఉంది.

స్థానిక ఎన్నికల్లో.. 

2015లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆమెకు టిక్కెట్ ఇచ్చింది. ఎన్నికల్లో విజయం సాధించి, "యాక్సిడెంటల్ పొలిటీషియన్"గా తన

ప్రయాణానికి నాంది పలికింది. 2020లో ఆమె తిరిగి ఎన్నిక కావడం, ఆమె ఓటర్లు ఆమెపై ఉంచిన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. 

రాష్ట్ర మహిళా మోర్చా లో... 

బీజేపీ మహిళా మోర్చా యూనిట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ పాత్రలో, ఆమె దళిత స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను చురుకుగా ప్రస్తావించారు మరియు

పార్టీ ఔట్రీచ్ ప్రయత్నాలను మెరుగుపరచడానికి పనిచేశారు.

2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కోజికోడ్ సౌత్ స్థానంలో పోటీ చేశారు. ఆమె గెలవనప్పటికీ, ఈ ప్రాంతంలో బిజెపి ఓట్ల వాటాను పెంచడంలో ఆమె ప్రచారం విశేషమైనది, ఓటర్లతో ఆమె పెరుగుతున్న ప్రభావాన్ని చూపుతుంది.

ఈ ఎన్నికల్లో నియోజక వర్గం మొత్తం

తిరుగుతూ, యువతి యువకులు, ఉద్యోగస్తులు, హిందూ ధార్మిక సంఘాలు తదితర ప్రతినిధులను కలుస్తున్నారు. 

కాంగ్రెస్ చేసిన హిందూ ద్రోహం ఇదే:..

గత 8 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ హిందువులకు చేసిన ద్రోహాన్ని పూస గుచ్చినట్టు వివరిస్తున్నారు. 
ఇటీవల కాలంలో వక్ఫ్ పేరిట హిందూ దేవాలయాల పై దాడులను

తెలియచేస్తున్నారు. ఎన్నో బహిరంగ సభల్లోనే కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత హిందువులని కించపరిస్తే యావత్ హిందూ సమాజం అగ్గిమీద గుగ్గిలం అయ్యింది.

దానికి తోడు వక్ఫ్ బోర్డు పేరిట ముస్లిం లకు భూములను దోపిడీ చేసుకుందుకు సర్వ హక్కులతో కూడిన చట్టాలను కూడా చేసింది. దాని ప్రభావమే నేడు పార్లమెంట్

భవనం కూడా వక్ఫ్ బోర్డు దేనంటూ కేంద్రానికి నోటీసులు ఇవ్వడం. 

ఇలాంటి వన్నీ ప్రజల్లో అవగాహనా కల్పించడం బీజేపీ కి బాగా కలియు వచ్చే అంశం. 

ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు అత్యంత కీలకం. ప్రత్యక్ష ఎన్నికల్లో మొట్టమొదటి సారి ప్రియాంక వాద్రా గాంధీ నెహ్రు పోటీ చేస్తున్నారు. ఈమె కచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి

తీరాలి. కారణం ఇది ఆమె సోదరుడు రాహుల్ గాంధీ నెహ్రు సిట్టింగ్ సీటు. ఇక్కడ ప్రియాంక ఓడిపోతే. .మొత్తం పార్టీకే అవమానం. 
అదే విధంగా నవ్య గెలిస్తే బంపర్ అఫర్ లభించినట్టే. ఈ ప్రాంతంలో బీజేపీ కి ఓటు బ్యాంకు పెద్దగాలేదు. గెలిస్తే అంతా అదనమే. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam