DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నో అద్భుతాలకు, ప్రపంచ రికార్డుల ఘట్టాలకు నిలయం మహా కుంభ మేళ

*హిందూ వ్యతిరేకులకు ఖంగు తినిపించింది ఈ ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేళ.*
 
*(DNS Report: శాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, 27, ఫిబ్రవరి 2025, (డిఎన్ఎస్ ):*  ఎన్నో అద్భుతమైన ఘట్టాలకు ఆలవాలంగా నిలిచింది ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా. 45 రోజుల పాటు 65 కోట్ల మందికి ఎన్నో అనుభూతులను అందించింది ఈ మహా యజ్ఞం. సుమారు

3.5 లక్షల కోట్లకు పైగా ఆర్ధిక లావాదేవీలు జరిగినట్టు అధికారిక అంచనాలు. ఖాన్ గ్రెస్ చేసిన వ్యాఖ్యలకు కుంభమేళా గట్టిగా ఖంగు తినిపించింది. 
కుంభ లో మునిగితే పేదరికం పోతుందా అంటూ ఖాన్ గ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన వెటకారపు విమర్శలకు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది కుంభమేళా. 
రోడ్డు పై టీ

అమ్మేవాళ్ళు రోజుకు రూ. 40 వేలు సంపాదించడం జరిగింది. వేప పుల్లలు అమ్ముకునే వాళ్ళు రోజుకి రూ. 5 నుంచి 10 వేలు వరకూ సంపాదించడం జరిగింది. ఇక స్థానిక ఆటోలు, బైక్ లు వాళ్ళు రోజుకు రూ, 20 వేలకు పైగానే సంపాదించారు. ప్రయాగ్ రాజ్ లో హోటళ్లు, తాత్కాలిక టెంట్ లు, వాళ్ళు కూడా ఒక బెడ్ కు రూ. 500 నుంచి 1500 వరకూ అద్దెకు ఇచ్చి, లక్షల్లోనే

కూడబెట్టారు. స్నాన ఘాట్ ల నుంచి త్రివేణి సంగం కు వెళ్లేందుకు పడవలను ఏర్పాటు చేసారు. ఒక పడవకు ఒకసారి కనీసం 10 మంది వెళ్లే అవకాశం ఉంది. సాధారణ రోజులో ఒక్కొక్కరికి రూ. 500 లు, రద్దీ రోజుల్లో రూ. 1500 కు పైగానే  ఛార్జ్ వసూళ్లు జరిగాయి. 
ఇక మిగిలిన ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలపై త్రివేణి సంగమ జలాలే సమాధానం చెప్పాయి. కోట్లాది

మంది భక్తులు వచ్చారు. స్నానం పేరుతొ అశౌచం అంతా అక్కడే చేసారు అంటూ నానా వాగుడు వాడిన వాళ్లకి గంగా నది జలాలే చెంపదెబ్బ కొట్టినట్టు జవాబిచ్చాయి. ఎన్ని కోట్లమంది గంగలో స్నానం చేసినా. నీళ్లు స్వఛ్చంగా ఉండడమే కారణం. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగిన మహా కుంభ మేళ కు ఒక్కరోజు ముందు గంగా జలాలను ల్యాబ్ లో పరీక్ష

నిర్వహించారు. మేళాలో ప్రతి రోజు ప్రతి రెండు గంటలకు ఒకసారి నీటిని పరిశీలనా చేసారు. 

అద్భుతమైన పారిశుధ్య నిర్వహణ:
కుంభ మేళాలో ప్రతి రెండు గంటలకు ఒకసారి గంగా నీటిని భారీ యంత్రాల ద్వారా పరిశుభ్రం చేశారు. భక్తులు నీళ్ళల్లో వేసే కోయిన్లను, పూజ సామాగ్రిని మిషన్ల ద్వారా ఏరి ఘాట్లకు చేర్చారు. ఇలా చేర్చిన

కోయిన్లు ఎన్ని టన్నులు వచ్చాయో లెక్క తెలియడం లేదు. వీటిని ప్రభుత్వ ఖజానాకు చేర్చనున్నారు. 

ఆర్ధిక కరువు తీరిపోయింది.:
 
మహా కుంభ మేళ తో ఉత్తర ప్రదేశ్ కు ఉన్న ఆర్ధిక కరువు తీరిపోయినట్టే అనిపిస్తోంది. కేవలం 45 రోజుల పాటు జరిగిన ఈ మేళా ద్వారా సుమారు 3.5 లక్షల కోట్లు ఆర్ధిక లావాదేవీలు జరిగాయి. వీటిల్లో జి

ఎస్ టి ద్వారా కోట్లాది నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. విరాళాల రూపంలో మరిన్ని కోట్లు చేరాయి. భారత దేశంలోని ఎన్నో రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువ ఇది. కేవలం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాద్ మహారాజ్ ప్రత్యక్ష పర్యవేక్షణ తో రెండేళ్ల పాటు చేసిన కృషి కి ఫలితం అని సాక్షాత్తు దేశాధినేతలు

కొనియాడుతున్నారు. 

ఎవరి ఘాట్ వారిదే:

సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా విఐపిలకు ప్రత్యేక ఘాట్ లు కేటాయించడం, ప్రత్యేక రవాణా రహదారులు ఏర్పాటు చెయ్యడం తో ఎవరికీ ఇబ్బంది తలెత్తలేదు. సామాన్య ప్రజా ప్రతినిధి నుంచి, దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, విదేశాల అధినేతలు సైతం ఈ కుంభమేళా లో పుణ్య

స్నానం ఆచరించడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. 

హిందూ వ్యతిరేకుల కుట్రలు భగ్నం:

మొదటి రోజు నుంచే మహా కుంభమేళా విజయవంతం కావడంతో దీన్ని భగ్నం చేసేందుకు హిందూ వ్యతిరేక పార్టీలు, విద్రోహ శక్తులు చెయ్యని ప్రయత్నం లేదు. తమకు అనుకూల మీడియాల్లో అన్ని వ్యతిరేక వార్తలను ప్రసారం చెయ్యడంతో పాటు,

వెళ్లే భక్తులను భయపెట్టే విధంగా లేని కధనాలు ప్రసారం చేయించారు. కుంభమేళా లో ప్రసిద్ధ అఖాడాలు, సాధువులు, సిద్ధపురుషులు వేలాది గా హాజరు కాగా,. ఒక పూసలు అమ్ముకునే పిల్లను అతిగా ప్రసారం చేసి, అక్కడ నుంచి పారిపోయేలా చేశారు. పైగా నకిలీ బాబాలు, సాధువులకు అతి ప్రచారం కల్పించి,  టీవీ చానెళ్లు చూడడానికే ప్రజలు

అసహ్యించుకునేలా ప్రయత్నాలు చేసారు. దీనికి తోడు అక్కడ జరిగిన కొన్ని అవాంఛిత దుర్ఘటనల వెనుక ఈ విద్రోహుల హస్తం ఉందా అనే అనుమానాలు కూడా భక్తుల్లో పెరిగిపోయాయి. 

అత్యంత భయంకరమైన ఘటన ఏంటంటే. . వామపక్ష, హిందూ వ్యతిరేక శక్తులు నేరుగా అక్కడ కుంభ మేళాలో టెంట్ లు వేసి, హిందూ ధర్మ వ్యతిరేక ప్రచారం, కుంభమేళా ఒక

మూర్ఖత్వం అంటూ ప్రత్యక్ష ప్రచారం చెయ్యడంతో సాధువులు తోలు తీశారు. 

కుంభమేళా వైభవం, ప్రాధాన్యత గురించి ప్రచారం చెయ్యడానికి ముందుకు రాని ఈ వ్యతిరేక టీవీలు... అక్కడ జరిపించిన అగ్ని ప్రమాదం, చేయించిన త్రొక్కిసలాట గురించి వ్యతిరేక ప్రచారం చెయ్యడానికి మాత్రం తోకలు ఊపుకుంటూ వచ్చేసాయి.  

వీటన్నింటి

కీ బ్రేక్ వేస్తూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తీసుకున్న కట్టుదిట్టమైన నిర్ణయాలకు మొత్తం హిందూ వ్యతిరేక విద్రోహ శక్తులకు ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ముందస్తు అంచనాల ప్రకారం 45 కోట్ల మంది భక్తులు కుంభ మేళాకు రానున్నట్టు ప్రకటించారు. అయితే అందరి అంచనాలకు మించి 65 కోట్లకు పైగా భక్తులు రావడంతో

ప్రతిపక్షాలు, హిందూ వ్యతిరేక విద్రోహ శక్తులు కుళ్ళికుళ్ళి మదనపడ్డాయి. 

అన్నింటికంటే ఆశ్చర్యకరంగా. . .హిందూ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన ఎంపీలు, రాష్ట్రాల మంత్రులు, ఇతరులు కూడా ఈ కుంభమేళా లో స్నానాలు ఆచరించడం గమనార్హం. 

గతంలో హిందూ వ్యతిరేక పార్టీల పాలనలో కూడా కుంభమేళా లు జరిగాయి.

అప్పుడు ఒక ముస్లిం మంత్రిని ఈ మేళాకు ఇంచార్జి గా నియమించిన ఘనుడు అఖిలేష్ యాదవ్. అప్పుడు పెద్దగా ప్రచారం చెయ్యక పోయినా. . భక్తులు రావడంతో ఆ ఘనత తమదే అని డబ్బాలు కొట్టేసుకున్నారు. ఇప్పుడు 65 కోట్లకు పైగా భక్తులు రావడం, పైగా ప్రయాగ్ రాజ్ తో పాటు, వారణాశి, అయోధ్య ప్రాంతాల్లో కూడా ఈ భక్తుల తాకిడి తగలడం, అక్కడ కూడా కోట్లాదిగా

ఆర్ధిక లావాదేవీలు జరగడం హిందూ వ్యతిరేక ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు.  

మొదటి రోజుల్లో జనం రాలేదు అని ఎగతాళి చేసిన అఖిలేష్ యాదవ్ .  . . కుంభమేళా ముగిసే నాటికి మీరు చెప్పిన దాని కన్నా 20 కోట్ల జనం వచ్చేసారు. మీరు ఏర్పాట్లు ఏం చేశారు అంటూ మీడియా ముందు బావురుమనడం ఆశ్చర్యాన్ని కల్గించింది. చివరి రోజున హిందూ

వ్యతిరేక ప్రతిపక్షాల ప్రెస్ మీట్ లు చూస్తే చాలు యోగి మహారాజ్  కుంభమేళ ను ఎంత గా  విజయవంతం చేసారో తెలుస్తోంది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 3, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam