DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి పై పెళ్లి మండప కాంట్రాక్టర్ కు దేవాదాయ శాఖ దాసోహం, విహెచ్పి

*సింహాచలంలో రోడ్డు బ్లాక్ చేసి అడ్డంగా పెళ్లి మండపాల నిర్మాణం*

*గాడి తప్పిన దేవాదాయ శాఖ, భక్తుల ఇబ్బందులు గాలికి* 

*విహెచ్పి రాష్ట్ర టోలి పూడిపెద్ది ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం.* 

*(DNS Report: గణేష్ BVS, Staff Reporter)*

*విశాఖపట్నం, 03, మార్చ్  2025, (డిఎన్ఎస్ ):* ఉత్తరాంధ్ర ప్రసిద్ధ సింహాచల

క్షేత్రంలో పెళ్లి మండపాల కాంట్రాక్టర్ కు దేవాదాయ శాఖా అధికారులు దాసోహమైపోయారని విశ్వ హిందూ పరిషత్ మండిపడుతోంది. విహెచ్పి రాష్ట్ర మఠ మందిర్ టోలి పూడిపెద్ది శర్మ మాట్లాడుతూ సింహాచలం కొండపై  లైసెన్సుడ్ పెళ్లి మండపాల కాంట్రాక్టర్ చేస్తున్న ఇష్టారాజ్య వ్యవహారానికి దేవాదాయశాఖ అధికారులు, సిబ్బంది పూర్తిగా

లొంగిపోయారనడానికి సోమవారం ఘటనే నిదర్శనం అన్నారు. కొండపై ఈ కాంట్రాక్టర్ కు కొన్ని ప్రాంతాల్లోనే మండప నిర్మాణం కోసం అనుమతి ఇచ్చారని, అయితే కొండ మొత్తం తనకే హక్కు ఉన్నట్టు, ఎక్కడ పడితే అక్కడ, భక్తులు నడిచే రోడ్లపై కూడా మండపాలు వేస్తున్నాడని మండిపడ్డారు. 
గుడి నుంచి భక్తులు బయటకు వచ్చి ప్రసాద వితరణ కౌంటర్ కు

నడిచే వెళ్లే రోడ్డును మొత్తం బ్లాక్ చేసి, అనుమతి లేని ప్రదేశంలో మండపం, భోజనం పందిళ్లు వేశారన్నారు. దేవస్థానంలో కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబంలో ఒకరి ఉపనయనం కోసం రోడ్డు ను బ్లాక్ చేసి, భారీ సెట్టింగ్ తో వేదిక, భోజన ఏర్పాట్లు, టేబుల్స్, కుర్చీలు వేయడాన్ని భక్తులు, ఉద్యోగులు సైతం తప్పు పడుతున్నారు. సోమవారం ఈ కాంట్రాక్టర్

మండపం వేసిన ప్రాంతానికి కూతవేటు దూరం లోనే ప్రసాద తయారీ కేంద్రం ఉంది. అక్కడ నుంచి ప్రసాదాలను విక్రయ కేంద్రాలకు వెళ్లే మార్గం కూడా ఇదే కావడం గమనార్హం. 
ఈ కాంట్రాక్టర్ గడువు జనవరి 31 తోనే ముగిసిపోయింది. అయితే ఇటీవల ఇంచార్జి కమిషనర్ గా వచ్చిన రామచంద్ర మోహన్ ఈ కాంట్రాక్టర్ గడువు మరో 6 నెలలు పొడిగిస్తున్నట్టు

అధికారిక ఉత్తర్వులు విడుదల చేసేసారు. ఈ కాంట్రాక్టర్ ఆగడాలు మితిమీరిపోయాయి అంటూ గత నెల్లో హైందవ సంఘాల ప్రతినిధులు కొండ దిగువన నిరాహార దీక్షలకు దిగింది. దాంతో ఆలయ ఏఈవో ఆనందకుమార్ ఈ కాంట్రాక్టర్ సమస్యను పరిష్కరిస్తామని, ఇకపై కొనసాగించమని హామీ ఇచ్చి, హైందవ సంఘాలకు హామీ ఇచ్చారు. ఇది జరిగి రెండు వారాలు ముగియక ముందే ఈ

కాంట్రాక్టర్ కు 6 నెలలు పొడిగింపు ఇవ్వడాన్ని హైందవ సంఘాలు తప్పుపడుతున్నాయి. 
ఇదే విషయాన్నీ ఇంచార్జి కమిషనర్ రామచంద్ర మోహన్ దృష్టి కి తీసుకు వెళ్లగా, పొడిగింపు ఉండదు అని చెప్పిన తర్వాత ఈ ఉత్తర్వులు విడుదల అయ్యాయన్నారు. 
దేవాదాయ శాఖను కొందరు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి హిందువుల మనోభావాలు

దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. 

ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం: పూడిపెద్ది 

సింహాచల క్షేత్రంలో జరుగుతున్నా అపచారాలపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో తానూ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్టు పూడిపెద్ది శర్మ ప్రకటించారు. పెళ్లి మండప కాంట్రాక్టర్ ఆగడాలను అడ్డుకోవడంలో దేవాదాయ శాఖ

చతికిల పడిందని, దేవాలయ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్న ఈ కాంట్రాక్టర్ ను తక్షణం నిలుపుదల చెయ్యాలని గత నెల్లో రిలే నిరాహార దీక్ష చేసినట్టు తెలిపారు. అప్పుడు దేవాదాయ శాఖ ఇచ్చిన హామీలు తుంగలోకి తొక్కిందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 3, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam