DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మార్చి 12 నుంచి  భద్రాచలం క్షేత్రం లో వైభవంగా శ్రీ అష్టలక్ష్మి యాగం

*దేశ సంక్షేమం కోసం విశ్వ శాంతియాగం: పీతాంబరం రఘునాథాచార్య స్వామి* 

*(DNS Report: శాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, 18, ఫిబ్రవరి 2025, (డిఎన్ఎస్ ):* భారత దేశ సంక్షేమం కోసం మార్చి 12 నుంచి 23 వరకూ భద్రాచలం క్షేత్రం లో 23 వ శ్రీ అష్టలక్ష్మి యాగం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు శ్రీ అష్టలక్ష్మి

పీఠం నిర్వాహకులు పీతాంబరం రఘునాథాచార్య స్వామి తెలియచేసారు. దేశ సంక్షేమం కోసం, ప్రజల సౌభాగ్యం కోసం ఈ యాగం అత్యంత వైభవం గా  నిర్వహిస్తున్నామన్నారు. సనాతన వైదిక సంప్రదాయాన్ని దశదిశలా ప్రచారం చేస్తూ. . ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ధర్మాచరణను అలవాటు చేయడం జరుగుతోందన్నారు. వాడవాడలా సనాతన ధార్మిక సౌరభాలు

ప్రసరింపచేసేందుకు గత 22 ఏళ్లుగా అవిశ్రాంతంగా శ్రీ అష్టలక్ష్మి యాగాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.  
ఈ ఏడాది దక్షిణ భారత దేశ అయోధ్య గా ఖ్యాతిగాంచిన భద్రాచల క్షేత్రం లో 23 వ యాగం జరిపేందుకు సంకల్పం చేసారు. కూనవరం రోడ్ లో కొల్లుగూడం, పాత గుండాల గ్రామం కి ఒక్క కిలోమీటర్ ముందు అష్టలక్ష్మి పీఠం ఆశ్రమం స్థలం లో ఈ యాగం

జరుగనుంది. 
శ్రీ గాయత్రీ మంత్రం లోని 24 బీజాక్షరాలు ఆధారం గా చేసుకుని ఒక్కో అక్షరం వైభవాన్ని తెలియచేస్తూ గత 22 ఏళ్లుగా అద్భుతమైన యాగాలు స్వామి నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది 23 వ సంవత్సరం. 

గతం లో నిర్వహించిన యాగాల వివరాలు:
1 . గజపతినగరం 2 ) కొండకొప్పాక , 3 ) చోడవరం  4 ) బొబ్బిలి, 5 ) తుని, 6 ) తణుకు, 7 ) ఏలూరు, 8 )

సింహాచలం, 9 ) గుంటూరు,  10 ) ఒంగోలు, 11 ) శ్రీకాకుళం, 12 ) రాజమండ్రి  13 ) ఖమ్మం, 14 ) అనంతపురం, 15 ) చింతలపూడి, 16 ) మంగళగిరి, 17 ) విజయనగరం 18 ) తాడేపల్లిగూడెం, 19 ) కాకినాడ, 20 ) జంగారెడ్డి గూడెం, 21 ) హైద్రాబాద్ 22 ) నెల్లూరు 

ఈ ఏడాది శ్రీ అష్టలక్ష్మి యాగం ప్రారంభ సూచికగా మార్చి 2 వ తేదీన ఇదే ప్రాంగణం లో భూమిపూజ నిర్వహించనున్నారు. సుమారు 108

మంది దంపతులచే భూమి సంకర్షణ జరుగుతుందని రఘునాథాచార్య స్వామి తెలియచేసారు. యాగ నిర్వహణ కార్యక్రమాలను వివరించారు.  

12 వ తేదీ సాయంత్రం 4 :30 గంటలకు అష్టలక్ష్మి అమ్మవార్ల భారీ శోభాయాత్ర జరుగుతుందని, 13 వ తేదీ సాయంత్రం 6 :45 గంటలకు యాగ అంకురారోపణ, 14 న ఉదయం 10 : 05 గంటలకు అగ్ని ప్రతిష్ట, ఉభయ వేదాంత పండిత సభలతో యాగం ఆరంభం

అవుతుందన్నారు. 15 వ తేదీ ప్రఖ్యాత పండితులచే అద్భుతమైన ప్రవచనాలు జరుగుతాయన్నారు. 16 వ తేదీ సాయంత్రం 7 :15 గంటలకు 108 దంపతులతో సామూహిక శ్రీ లక్ష్మి నారాయణ పూజ ఉంటుందని, 17 వ తేదీ ఉదయం  10 :11 గంటలకు విద్యార్థిని, విద్యార్థులకు శ్రీ హయగ్రీవ మంత్రోపదేశం జరుగుతుందన్నారు. 18 న మధ్యాహ్నం శ్రీరామదూతం శ్రీ ఆంజనేయ స్వామికి లక్ష

తమలపాకులతో అర్చన, 19 న శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి  నారాయణ పెరుమాళ్ కు  108 కళాశాలతో అభిషేకం, 20 న ఉదయం 11 :15 గంటలకు మంత్ర దీక్ష ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం మహిళామూర్తులచే సామూహిక శ్రీ అష్టలక్ష్మి అమ్మవార్లకు లక్ష కుంకుమార్చన. 21 న మధ్యాహ్నం కొట్నాల ఉత్సవం, రాత్రి శ్రీ అష్టలక్ష్మి అమ్మవారికి దీపోత్సవం,  22 న

మధ్యాహ్నం మహాపూర్ణాహుతి, రాత్రి శ్రీ లక్ష్మి నారాయణ కళ్యాణం జరుగుతుంది.    
 
యాగశాలలో నిర్వహించే విశేష కార్యక్రమాలు:
ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 :45 వరకూ, పెరుమాళ్ళ ఆరాధన, అభిషేకం, అర్చనలు, బాలభోగ నివేదన, మంగళాశాసనం, వేద విన్నపాలు, హోమాలు, భజనలు, కీర్తనలు, కొలతలు, వేద, దివ్య ప్రబంధ పారాయణాలు, పెద్దల

ప్రవచనాలు, గద్యాలు, నిత్యా పూర్ణాహుతి, జరుగుతుంది. తిరిగి సాయంత్రం ఇదే వైదిక కార్యాచరణ కొనసాగుతుంది. 

ప్రత్యేకించి ఒక కామ్య లక్ష్యం కోసం ప్రత్యేక ఇష్టి కార్యక్రమం, హోమం నిర్వహించడం జరుగుతుంది. శ్రీ విశ్వక్సేన ఇష్టి, శ్రీ ధన్వంతరి ఇష్టి, శ్రీ హయగ్రీవ ఇష్టి, శ్రీ లక్షి ఇష్టి, పుత్రకామేష్టి,  శ్రీ లక్ష్మి

నారాయణ ఇష్టి, వైనతేయ ఇష్టి, శ్రీ నరసింహ ఇష్టి, శ్రీ సుదర్శన ఇష్టి ఎంతో వైభవంగా నిర్వహించనున్నట్టు రఘునాథాచార్య స్వామి తెలియచేసారు. 

ఈ యాగ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు, పాల్గొని అష్టలక్ష్మి అమ్మ వారి, శ్రీమన్నారాయణుని  అనుగ్రహం పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 3, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam