DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉక్కు శాఖ మంత్రి పర్యటన విశాఖ కు నిరాశే: సిపిఎం

*విశాఖపట్నం, 31 జనవరి 2025, ( డి ఎన్ ఎస్ ):*  కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖా మంత్రి హెచ్‌డి. కుమార స్వామి, సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, కేంద్ర ఉక్కుశాఖ కార్యదర్శి సందీప్‌ ఫౌండ్రీ విశాఖ ఉక్కు పర్యటన అందరికి నిరాశను మిగిల్చిందని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు అన్నారు. గురువారం మంత్రి పర్యటనపై

సిపిఎం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ.. ఉక్కుశాఖ మంత్రి విశాఖ  స్టీల్‌ప్లాంట్‌ పర్యటన సందర్భంగా కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయిస్తుందని విశాఖ ఉక్కు కార్మికులు, ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కేంద్రమంత్రి ఉక్కు పర్యటనను, ఇటీవల ప్రకటించిన ప్యాకేజిని

స్వాగతిస్తూనే, కేంద్ర మంత్రి వర్గం  స్టీల్‌ప్లాంట్‌ స్ట్రాటజిక్‌ సేల్‌ ప్రకటన రద్దు, సెయిల్‌లో విలీనం, స్వంతగనులు కేటాయిస్తూ ప్రకటన చేయాలని కోరుతూ డిమాండ్‌ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాలు, ప్రజలు కూడా ఈ ప్రకటన వస్తుందని ఆశించారు. కానీ కేంద్రమంత్రి నుండి ఈ ప్రకటన

రాలేదు. స్టీల్‌ప్లాంట్‌ స్ట్రాటజిక్‌ సేల్‌ నిర్ణయం రద్దు అస్పష్టంగానే ఉన్నది. స్టీల్‌ప్లాంట్‌ నష్టాలకు ప్రభుత్వ లోపాలను అంగీకరిస్తూనే, ఇటీవల కేంద్ర ప్రకటించిన 11440 కోట్ల  ప్యాకేజితోనే స్టీల్‌ప్లాంట్‌ సమస్యను పరిష్కరించినట్లుగా మంత్రి ప్రకటన ఉన్నది. ప్లాంట్‌ను లాభాల బాట పట్టించే బాధ్యత స్టీల్‌

యాజమాన్యం, కార్మికులపై పెట్టారు. విశాఖ ఉక్కుకు స్వంత ఇనుపగనులు కేటాయించకుండా   ప్లాంటు ఎలా లాభాల బాట పడుతుంది ? స్వంతగనులు లేక విశాఖ ఉక్కుకు గత ఏడాది ప్రతిటన్నుకు రూ.6400లు అదనపు ఖర్చు అయింది.సంవత్సరానికి సుమారు 30వేల కోట్ల రూపాయిలు అదనపు ఉత్పత్తి వ్యయం అయింది. 
గత 4నెలలుగా సగం జీతాలతో కష్టపడి ఉత్పత్తి చేస్తున్న

విశాఖ ఉక్కు కార్మికులను మంత్రి అభినందిస్తూనే పూర్తిస్థాయి జీతాలు పొందేందుకు మరో 3నెలలు వేచిచూడాలని ప్రకటించడం అత్యంత ఆందోళనకరం. ఇది కార్మికుల కుటుంబాలను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేసే చర్య. చట్టవిరుద్ధం. కార్మిక చట్టాలను అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమే నెలలు తరబడి కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించకపోవడం

దుర్మార్గం. కేంద్ర ప్రకటించిన ప్యాకేజిలో కార్మికుల జీతభత్యాలు వెంటనే చెల్లిస్తారని కార్మికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసారు. మంత్రి ప్రకటన వీరి ఆశలపై నీరు చల్లింది. విశాఖ ఉక్కును తమలో విలీనం చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్‌ అంగీకరించడంలేదని కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖా సహాయమంత్రి శ్రీనివాస వర్మ ప్రకటించడం

ప్రజలను వంచించడమే అన్నారు. కుక్కతోకను ఆడిరచడంగా కాక ...తోక కుక్కను ఆడిరచినట్లుగా మంత్రి ప్రకటన ఉన్నది. సెయిల్‌ని ఆదేశించలేని స్థితిలో  కేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నదంటే విశాఖ ఉక్కు కార్మికులు, ప్రజలు నమ్మడానికి సిద్ధంగాలేదు. విశాఖ ఉక్కును పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపిస్తామని  ప్రకటించి రెండోవైపున ఉత్పత్తి

కారకులైన ఆఫీసర్లు , పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులను పెద్దఎత్తున తొలగింపుకు పూనుకుంటోంది. విఆర్‌ఎస్‌ను ముందుకు తెచ్చింది. కార్మికులను భారీగా తగ్గించి పూర్తి ఉత్పత్తి ఎలా సాధించగలదు ? స్టీల్‌ప్లాంట్‌ అభివృద్ధికి కేంద్రం అన్ని చర్యలు అంటునే రెండోవైపు దీనిని బలహీనపరిచే చర్యలు  ఆపడంలేదు.
రాష్ట్ర

ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణ పనులు 3నెలల్లో ప్రారంభించేందుకు, గనులు కేటాయింపుకు తహతహలాడుతున్నారు. విశాఖ ఉక్కుకు గనుల కోసం, సెయిల్‌లో విలీనం కోసం ఎందుకు కేంద్రాన్ని అడగటంలేదని ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో విశాఖ ఉక్కుకు స్వంతగనులు కేటాయించాలని డిమాండ్‌ చేసిన

నారా లోకేష్‌ మంత్రి అయ్యాక స్వంతగనులు అంశం అర్థంలేదని ప్రకటించడం దుర్మార్గమన్నారు.
ఇప్పటికైనా కేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు స్ట్రాటజిక్‌ సేల్‌ నిర్ణయం రద్దు, సెయిల్‌లో విలీనం, స్వంతగనులు కేటాయిస్తూ ప్రకటన చేయాలని, నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పన, కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కరించేలా రాష్ట్రంలోని

టిడిపి, జనసేన, బిజెపి కూటమి నేతలు కేంద్రంతో ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేసారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Feb 1, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam