DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒకే కుటుంబం నుంచి ఆరుగురు ? కుటుంబ పాలనా కాదుట 

విశాఖపట్నం, మార్చి 25 ,2019 (DNS Online ): దేశం లోనే అత్యధికంగా ఒకే కుటుంబం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో  à°’కే సారి  à°†à°°à±à°—ురు సభ్యులు à°ˆ మారు ఎన్నికల బరిలో ఉన్నారు. అయినా వీళ్లది

కుటుంబ పాలనా కాదట. ఎవరు గెలిచినా అధికారం ఇంట్లోనే ఉంటుందన్న పథకంతో నలుగురు  à°¤à±†à°²à±à°—ుదేశం తరపున బరిలో ఉండగా, కేంద్రం లో బీజేపీ మళ్ళీ అధికారం లోకి

వచ్చేస్తుందన్న నమ్మకంతో ఒకరిని బీజేపీ తరపున బరిలో నిలబెట్టగా, ఒకవేళ ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ పనులు చేసుకోడానికి వీలుగా తమ

కుటుంబం నుంచి ఒకరిని ఆ పార్టీ తరపున పోటీలో నిలబెట్టారు. అధికారం తమ కుటుంబానికి దూరమైతే తట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది ఈ కుటుంబానికి. దీంతో ఇతరులకు సైతం

టికెట్లు ఇవ్వకుండా తమ సామాజిక వర్గానికి చెందిన వారికే అధిక శాతం టికెట్లు ఇచ్చిన ఘనత అధికార తెలుగుదేశానిదే. 

ఆరుగురు వీరే. . :

సినీ నటుడు బాలకృష్ణ

హిందూపూర్ నుంచి ( అనంతపురం జిల్లా), అతని పెద్ద అల్లుడు మంత్రి లోకేష్ మంగళ గిరి నుంచి (గుంటూరు జిల్లా), చిన్నల్లుడు భరత్ విశాఖపట్నం లోక్ సభ నుంచి ( విశాఖపట్నం

జిల్లా), వియ్యంకుడు తెలుగుదేశం అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి (చిత్తూరు జిల్లా), బాలకృష్ణ అక్క దగ్గుబాటి పురంధేశ్వరి

విశాఖపట్నం లోక్ సభ నుంచి, బావ దగ్గుబాటి వెంకటేశ్వర రావు  à°ªà°°à±à°šà±à°°à± నుంచి ( ప్రకాశం జిల్లా) ఎన్నికల బరిలో నుంచున్నారు. వీరిలో పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ

తరపున, దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉండగా మిగిలిన నలుగురు తెలుగుదేశం అభ్యర్థులు గా నిలబడ్డారు. అయినా సరే వీళ్లది కుటుంబ

కూటమి కాదనే వాదన తెలుగు దేశం వినిపిస్తోంది. వీళ్ళెవరూ ఒకే కుటుంబం కాదు అనే క్యాడర్ కూడా ఫీలవుతోంది. 

నేర చరిత్ర ఉన్నవారికే పెద్ద పీట . . .

.

తెలుగుదేశం టికెట్లు కేటాయించిన వారిలో అధిక శాతం మంది వివిధ భూదందాలు, అవినీతి కేసుల్లో, మహిళపై లైంగిక వేధింపులు, ప్రత్యక్షంగా భౌతిక దాడులు, మహిళా

ఎమ్మార్వో పై భౌతిక దాడులు ఇలా చేయరాని పనులన్నీ చేసిన వారికి, సమాజానికి వీళ్ళు ప్రమాదకారి అంటూ రౌడీ షీటర్లు గా కేసులు నమోదు చెయ్యబడిన వారూ ఇలా సంఘ విద్రోహ

శక్తులకు పెద్దమనుషులు అనే బిల్డప్ ఇచ్చి ప్రస్తుత ఎన్నికల బరిలో అధికార తెలుగుదేశం పార్టీ టికెట్లు కేటాయించింది. దీనిపై వాళ్ళ పార్టీలోనే తీవ్ర విమర్శలు

వస్తున్నాయి. అయినా సరే పదవీ కాంక్షతో, ఎలాగైనా, ఏమి చేసైనా సరే వీళ్ళు గెలుస్తారు అనే నమ్మకంతో సంఘ విద్రోహ శక్తులుగా ముద్రపడిన వారికి టికెట్లు ఇవ్వడం పై

సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ పాలనా లో వెలుగు చూసిన విశాఖ లో కోట్లాది రూపాయల భూదందాలు, ఇసుక మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, కాల్ మనీ కేసులు,

హిందూ ఆలయాల ధ్వంసం తదితర కేసుల్లో ప్రధాన కరణ భూతులుగా ఉన్నవారి పై వ్యతిరేకత ప్రభుత్వం పై చూపించే అవకాశం ఉంది. ఈ కారణం తోనే ఒకే కుటుంబం నుంచి ఓటు హక్కు ఉన్న

వారందరికీ టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేసింది, అయితే పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం తో కేవలం నలుగురికి టికెట్లు ఈ పార్టీ ఇచ్చింది.

 

#dns  #dns live  #dns media  #dns news 

#dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #bjp  #telugudesam  #chandrababu naidu  #lokesh  #purandheswari  #venkateswara rao  #balakrishna  #bharat  #gitam  #kuppam  #hindupur  #paruchuru #mangalagiri


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam