DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామ సచివాలయ పరీక్షలకు జిల్లా సిద్ధం కలెక్టర్ 

25 మండలాల్లో  306 కేంద్రాలలో పరీక్షలు  

200 కు పైగా ఆర్.à°Ÿà°¿.సి బస్సులు ఉచిత రవాణా, 

ముందురోజు వచ్చే వారికి రాత్రి బస,  

వైద్య శిబిరాలు, మహిళలకు ప్రత్యేక

ఏర్పాట్లు,  

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు  27, 2019 (డిఎన్‌ఎస్‌) : జిల్లాలో గ్రామ సచివాలయ పరీక్షల

నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసామని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. పరీక్షల నిర్వహణ అధికారులతో మంగళ వారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్సును జిల్లా కలెక్టర్

నిర్వహించారు. జిల్లాలో 25 మండలాల్లో 74 రూట్ లుగా విభజించి 306 కేంద్రాలలో  à°ªà°°à±€à°•à±à°·à°²à± నిర్వహించుటకు ఏర్పాటు చేసామన్నారు. ఇందుకుగాను 3,955 మంది ఇన్విజిలేటర్లు, 1,114 మంది హాల్

సూపరింటిండెంట్లు, 337 మంది చీఫ్ సూపరింటిండెంట్లు, 47 మంది అదనపు చీఫ్ సూపరింటిండెంట్లు, 337 మంది కేంద్ర ప్రత్యేక అధికారులు, 347 మంది వెన్యూ ప్రత్యేక అధికారులు, 81 మంది

రూట్ అధికారులు, 36 ఫ్లైయింగు స్క్వాడ్ లను ఏర్పాటు చేసామని ఆయన వివరించారు. పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్ శనివారం సాయంత్రం నాటికి ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు ఉండరాదని స్పష్టం చేసారు. 33 వేల మంది మహిళలు

పరీక్షలకు హాజరు అగుచున్నారని తెలిపారు. మహిళలు ఇబ్బందులు పడరాదని అన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్ధులకు

ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. అభ్యర్ధులు తమ పరీక్షా కేంద్రాలు కనీసం గంట ముందుగా చేరుకోవాలని ఆయన సూచించారు. దూర

ప్రాంతాలకు చెందిన అభ్యర్ధులు పరీక్షా కేంద్రాలకు ముందు రోజు చేరుకొనుటకు ప్రయత్నించాలని కలెక్టర్ సూచించారు. ముందు రోజు చేరుకునే అభ్యర్ధులకు ఉచిత బస

ఏర్పాటు చేస్తున్నామని, ఈ మేరకు సంబంధిత పరీక్షా కేంద్రాల అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసామని ఆయన స్పష్టం చేసారు. పరీక్షలకు హాజరు అగుటకు 2 వందలకు పైగా

ఆర్.టి.సి బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, మండల కేంద్రాల నుండి లోపలకు ఉన్న కేంద్రాలకు చేరుకొనుటకు 17 మండల కేంద్రాల నుండి 118 బస్సులను ఏర్పాటు చేసామని వివరించారు.

రేగిడి ఆమదాలవలస మండల అభ్యర్ధులకు పలాస, వంగర మండల అభ్యర్ధులకు ఇచ్ఛాపురం వంటి దూర ప్రాంతాలలో పరీక్షా కేంద్రాలు మంజూరు అయ్యాయని అటువంటి అభ్యర్ధులు సకాలంలో

చేరుకొనుటకు పరీక్షా రోజు కూడా ఉదయాన్నే ఆర్.టి.సి బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, అయినప్పటికి ముందు రోజునే పరీక్షా కేంద్రాలకు చేరుకొనుటకు దృష్టి

సారించాలని అన్నారు. అటువంటి అభ్యర్థులకు బస ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. భవిష్యత్తు నిర్ణయించే పరీక్ష అని అటువంటి పరీక్షల పట్ల అశ్రద్ద వహించకుండా

అభ్యర్ధులు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్ధులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన

తెలిపారు.

అభ్యర్ధులు తమ పరీక్ష హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, హాల్ టికెట్ తోపాటు తెలిపిన నిబంధనలను పాటించి ఓ.ఎం.ఆర్ షీట్ నింపుటకు అవసరమగు పెన్ను

ఇతర సామగ్రి తీసుకురావాలని సూచించారు. సెల్ ఫోన్, కాలిక్యూలేటర్ తదితర ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరం పరీక్షా హాల్ లోనికి అనుమతించడం జరగదని ఆయన స్పష్టం చేసారు.

సీతంపేట మండలంలో 3 కేంద్రాలు, పాతపట్నం మండలంలో 18 కేంద్రాలు, పలాస మండలంలో 20 కేంద్రాలు, కంచిలి మండలంలో 8 కేంద్రాలు, కవిటి మండలంలో 5 కేంద్రాలు, సోంపేట మండంలో 12

కేంద్రాలు, వజ్రపు కొత్తూరు మండలంలో 7 కేంద్రాలు, నందిగాం మండంలో 2 కేంద్రాలు, హిరమండంలో 5, పాలకొండ మండలంలో 22, సారవకోట మండలంలో 4, టెక్కలి మండలంలో 13, కోటబొమ్మాళి

మండలంలో 7, జలుమూరు మండలంలో 8, సరుబుజ్జిలి మండంలో 6, సంతకవిటి మండలంలో 11, రాజాం మండలంలో 12, ఆమదాలవలస మండలంలో 11, నరసన్నపేట మండంలో 19, పోలాకి మండలంలో 4, గార మండంలో 9, శ్రీకాకుళం

మండలంలో 70, రణస్ధలం మండలంలో 9, ఎచ్చెర్ల మండలంలో 11, ఇచ్ఛాపురం మండలంలో  10 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.పరీక్ష కేంద్రాల

మార్గాలను తెలియజేసే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 à°µà±€à°¡à°¿à°¯à±‹ కాన్ఫరెన్స్ లో ఐటీడీఏ పిఓ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంత రావు, సహాయ

కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, జిల్లా రెవెన్యూ అధికారి కె.నరేంద్ర ప్రసాద్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఏ.కళ్యాణ చక్రవర్తి తదితరులు

పాల్గొన్నారు

 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam