DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశ రక్షణలో యువత ముందుండాలి: కలెక్టర్ నివాస్  

ఆర్మీ విధుల్లో  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా వాసులే ఎక్కువ    

నవంబరు 7 నుండి శ్రీకాకుళంలో ఆర్మీ రిక్రూట్ ర్యాలీ 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌): భారత దేశ రక్షణలో యువతీ యువకులు ముందంజ లో ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ జె .నివాస్

పిలుపునిచ్చారు. ఆర్మీ రిక్రూట్ మెంటు ర్యాలీపై మంగళ వారం కలెక్టర్ కార్యా లయం లో జరిగిన విలేకరుల  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚లో ఆయన మాట్లాడుతూ  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚లో వచ్చే నవంబరు 7à°µ

తేదీ నుండి 17వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్ మెంటు ర్యాలీ జరుగుతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచే భారత సైనిక కాల్బలం ( ఆర్మీ ) లో ఎక్కువ మంది పనిచేస్తు దేశ సేవ

చేస్తూన్నారని  à°µà°¿à°µà°°à°¿à°‚చారు.. ఆర్మీ రిక్రూట్ మెంటు ర్యాలీని శ్రీకాకుళంతో సహా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, విశాఖపట్నం, విజయనగరం, పాండిచ్ఛేరీ

రాష్ట్రంలోని యానాం జిల్లాల అభ్యర్ధులకు నిర్వహిస్తున్నారని చెప్పారు. సోల్జర్  (సైనికుడు), (జనరల్ డ్యూటీ), సోల్జర్ (ట్రేడ్స్ మెన్), సోల్జర్ (టెక్నికల్), సోల్జర్

(నర్సింగు అసిస్టెంట్, వెటర్నరీ నర్సింగు అసిస్టెంటు), సోల్జర్ (క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్) పోస్టులను భర్తీ చేస్తారని చెప్పారు. సెప్టెంబరు 8వ తేదీన

ప్రకటనను విడుదల చేసారని కలెక్టర్ పేర్కొన్నారు. www.joinindianarmy.nic.in వెబ్ సైట్ లో వివరాలకు సంప్రదించవచ్చని చెప్పారు. అభ్యర్ధులు సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 22వ తేదీ వరకు వెబ్

సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అడ్మిట్ కార్డులను అక్టోబరు 23 నుండి వెబ్ సైట్ నుండి పొందవచ్చని చెప్పారు. ఆర్మీ రిక్రూట్ మెంటు ర్యాలీ

శ్రీకాకుళంలో ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)లో జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. నియామకం పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, మద్యదళారులను

ఆశ్రయించాల్సిన అవసరం లేదని, పుకార్లను నమ్మరాదని ఆయన అన్నారు. అభ్యర్ధులు కష్టపడి చదవడం, శారీరక ధారుడ్యం ఆధారంగా ఎంపిక జరుగుతుందని గ్రహించాలని అన్నారు.

అభ్యర్ధులు ఆన్ లైన్ మొబైల్ యాప్ Army calling మరియు విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్ మెంటు కేంద్రం ఫోన్ నంబరు 0891 2754680 ఫోన్ చేసి నియామకానికి సంబంధించిన సందేహాలను నివృత్తి

చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్ధుల సౌకర్యార్ధం మొబైల్ యాప్ లో తెలుగులో లైవ్ చాట్ సౌకర్యం ఉందని అన్నారు. అభ్యర్దులు గూగుల్ ప్లే స్టోర్ నుండి అప్లికేషన్ డౌన్

లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 
    à°ˆ సందర్భంగా ఆర్మీ రిక్రూట్ మెంటు ర్యాలీ నోటిఫికేషన్ ను విడుదల చేసారు. ఆర్మీ రిక్రూట్ మెంటుకు 50 వేల మంది అభ్యర్ధులు

పాల్గొంటారని అంచనా వేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 
సకాలంలో దరఖాస్తు చేయండి : అభ్యర్ధులు సకాలంలో

దరఖాస్తు చేయాలని జిల్లా కలెక్టర్ నివాస్ అభ్యర్ధులను కోరారు. ఆర్మీలో చేరడం గొప్ప అవకాశమని ఆయన అన్నారు. మంచి భవితకు పునాది అని అన్నారు. మంచి అవకాశాన్ని

సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో దరఖాస్తు చేయాలని కోరారు. నోటిఫికేషన్ లోని వివరాలు పూర్తిగా అవగాహన చేసుకోవాలని తద్వారా వ్రాత, భౌతిక పరీక్షలలో సులభంగా

విజయం సాధించగలరని చెప్పారు. 
    à°ˆ సమావేశంలో ఆర్మీ రిక్రూట్ మెంటు డైరక్టర్ కల్నల్ భూపేందర్ సింగ్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి తదితరులు

పాల్గొన్నారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam