DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫండ్ ల కోసం పార్టీలు, పదవుల కోసమే నాయకులు ఇదేనా తీరు?

*పార్టీలకు నోట్ల పట్టింపే తప్ప ఓట్ల పట్టింపే లేదా? : రెబెల్స్*

స్టడీ టూర్ పేరు తో విదేశీ టూర్ల కోసమే ఎన్నికల్లో బరి లో. . .

(DNS  Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

విశాఖపట్నం,  25 అక్టోబర్ 2026 ( DNS ) : ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రాధాన్యత మారిపోయిందా అంటే అవుననే తెలుస్తోంది. గతంలో ఓట్లు

పొందగలిగిన వారికి మాత్రమే రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్ఛేవి. అయితే నేడు కోట్లు కుమ్మరించగలిగిన వాళ్ళకే  టికెట్లు కేటాయిస్తున్నాయి అనే విషయాన్నీ సాక్షాత్తుగా ఆయా పార్టీల క్యాడరులే ఆరోపిస్తున్నాయి. చట్ట పరిధిలో ఒక అభ్యర్థి ఖర్చు చేయగలిగిన మొత్తం మాత్రమే వెచ్చించి ప్రచారం చేసే అభ్యర్థులు ఏ ఒక్క రాజకీయ

పార్టీలోనే ఉండరు అంటే అతిశయోక్తి కాదు. 

విశాఖ ఓటర్లకు ఎన్నికలపై పట్టింపే లేదు. . .

మరో వారం లో జరుగనున్న మునిసిపల్ ఎన్నికలపై మహా విశాఖపట్నం లో సామాన్య జనానికి ఏమాత్రం ఆసక్తి  కనపడడం లేదు. పైగా రాజకీయ  పార్టీలపై పట్టింపు కూడా లేదు.  అభ్యర్థుల ఎంపిక ఒక వ్యసనంగా మార్చిన రాజకీయ పార్టీల పై

సామాన్య జనానికి ఏమాత్రం ఆసక్తి కనపడడం లేదు. పైగా ఎవరు గెలిచినా పెద్ద చేసేది ఏమీ ఉండదు, ఖర్చు చేసిన కోట్లు దండుకోవడం తప్ప అనే అభిప్రాయం విస్తృతంగా జనబాహుళ్యం లో ప్రచారం లో ఉంది. 

పార్టీలకు  నాడు ఓట్లు -   నేడు కోట్లే ప్రామాణికం.. . 

గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ లో వివిధ వార్డుల

సభ్యుల ఎన్నికల పై కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే వెంపర్లాడుతున్నాయి తప్పితే. .. వాళ్ళ కి ఓట్లు వెయ్యవలసిన ఓటర్లకు ఏమాత్రం ఆసక్తి  ఉన్నట్టుగా కనపడడం లేదు. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఎన్నికలకు, నేడు జరుగుతున్నా ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది. గతంలో  స్థానిక ఎన్నికలకు ఏడాది ముందుగానే ఔత్సాహిక అభ్యర్థులు

ఉత్సాహంతో క్షేత్ర స్థాయి లో తిరగడం, సేవా కార్యక్రమాలు మొదలు పెట్టి, జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు జరిగేవి. అంతే ధీటుగా వాళ్ళ కార్యకర్తలు కూడా నానా హైరానా పడేవాళ్ళు.  వీళ్ళ ఉత్సాహం చూసి, సామాన్య ఓటర్ల లో కూడా కొంత ఆశాభావం ఉండేది.  జనం మద్దతు ఉన్నవారికే పార్టీ లు టికెట్లు కేటాయించేవి. 

అయితే నేటి

పరిస్థితి పూర్తిగా భిన్నం గా ఉంది.  సామాన్య జనానికి ప్రజా ప్రతినిధుల పట్ల నమ్మకం పోయింది. పార్టీలకు ప్రజల అభిప్రాయాలూ, నమ్మకాలతో పనిలేదు. వాళ్ళకి పార్టీ ఫండ్ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళే అభ్యర్థులు  . వాళ్ళ గుణాలతో, వ్యాపార వ్యవహారాలు,  కేసులతో  పని ఉండదు. ప్రక్క పార్టీ లో టికెట్ రానివాళ్ళ కి ప్రాధాన్యత ఇస్తూ. .

.ఫండ్ వసూళ్లపైనే దృష్టి  సారిస్తున్నాయి. టికెట్ లు పొందిన అభ్యర్థులు కూడా తాము చేసిన ఖర్చులను రాబట్టుకోవడం లోనే ఐదేళ్ల కాలం గడిపేస్తున్నారు. 

స్టడీ టూర్ పేరు తో విదేశీ టూర్ల కోసమే ఎన్నికల్లో బరి లో. . .

విశాఖ కార్పొరేషన్ లో  పోటీ చేసే వాళ్ళు లక్ష్యం వేరే ఉంది. స్టడీ టూర్ పేరు తో ప్రజల డబ్బులతో

ఉచితంగా కుటుంబ పరంగా విదేశీ యాత్రలు చెయ్యడం కోసమే విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీలకు దిగుతున్నారు. గెలిచినా కార్పొరేటర్లను ఏడాది కోసమే మారు కుటుంబ సమేతం గా విదేశీ యాత్రలకు, భారత యాత్రలకు ఇబ్బడి ముబ్బడిగా చేయిస్తుంటారు. సొంత ఖర్చు తో ఇలాంటి యాత్రలు చెయ్యడానికి కనీసం ఆలోచన కూడా చెయ్యని వాళ్ళు ఏ పార్టీ

టికెట్ ఇస్తుందో వాళ్ళతో జతకట్టేస్తుంటారు. 

పార్టీ క్యాడర్ కు పూర్తి నిర్లక్ష్యం : 

ఒక పార్టీ ని నమ్ముకుని దశాబ్దాల తరబడి పనిచేసిన వాళ్లకి టికెట్లు నిరాకరించడం తో వాళ్లంతా రెబెల్స్ గా ఎన్నికల బరిలో నిలిచారు.  పార్టీ జిల్లా అధ్యక్షుడి కి నచ్చలేదని కొందరి కి టికెట్ నిరాకరించడంతో వాళ్లంతా

బరిలోకి దిగారు. తద్వారా. .  ఓట్లు భారీగా చీలే అవకాశం ఉంది. కూటమి పేరుతొ కొందరి కి టికెట్లు హుష్ కాకి అయ్యాయి. వాళ్ళు కూడా బరిలో ఉన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Oct 26, 2026

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam