DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి మీద కూడా ఎక్కేసారా?. కర్మ ...రా

సింహగిరి పై యధేచ్చగా క్రైస్తవ ప్రచార వాహనం? 

రవాణా ముసుగులో క్రైస్తవ ప్రచార యత్నం.?

కొండపైనే అడ్డుకున్న ఈఓ, అర్చకులు. . .

ఎప్పడి నుంచో తిరుమల,

నిన్న అన్నవరం, నేడు సింహగిరి 

( టి. శ్రీనివాస్ సౌజన్యం తో. . . .)

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం ): . . .

విశాఖపట్నం, నవంబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌):  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో

హిందూ దేవాలయాలే టార్గెట్ గా క్రైస్తవ ప్రచారం జరుగుతోంది అనే వార్తలకు బలం చేకూర్చే ఘటన శుక్రవారం సింహాచల క్షేత్రం పై జరిగింది. క్రైస్తవ మాట సంబంధ చిహ్నాలు,

బోర్డులు కల్గిన ఒక ప్రచార వాహనం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి వేంచేసిన సింహాచలం కొండపై విచ్చలవిడిగా తిరుగుతూ కనిపించింది. దీన్ని గమనించిన భక్తులు

అర్చకులకు ఫిర్యాదు చెయ్యడం తో ఒక అర్చకుడు ఈ వాహనాన్ని నిలువరించి, వాహన డ్రైవర్ ను అడ్డుకోవడం తో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సహచర అర్చకులకు, ఆలయ ఈఓ

లకు ఫోన్ ద్వారా తెలియచేయడంతో హుటాహుటిన ఈఓ ఘటన స్థలికి చేరుకున్నారు. ఈఓ ను చూసిన క్రైస్తవ ప్రచార వాహన డ్రైవర్ తానూ కేటరింగ్ సామాగ్రి ని రవాణా చెయ్యడానికే

కొండమీదకి వచ్చినట్టు చెప్పడం గమనార్హం. దీనిపై సింహగిరి పై రగడ జరిగింది. AP 39 TA 5118 నెంబర్ కల్గిన ఈ వాహనం నవమణి, డేవిడ్, డి ఆర్ లకు చెందినదిగా తెలుస్తోంది.

  

ఇటీవల కాలంలో హిందూ దేవాలయాలే టార్గెట్ à°—à°¾ క్రైస్తవ ప్రచారం జరుగుతోంది అనడానికి à°ˆ ఘటన మరో సాక్ష్యంగా నిలిచింది. 

అన్యమత సంబంధిత గుర్తులు,

బోర్డులు ఉన్న వాహనాలను పుణ్యక్షేత్రాల పరిసరాల్లోకి అనుమతించకూడదు అని నిబంధన ఉన్నప్పటికీ కొండ క్రింద టోల్ గేట్ సిబ్బంది పట్టించుకోక పోవడం గమనార్హం.

వాళ్లకి వాహనం టికెట్ తీసుకుందా లేదా అనే డబ్బు యావే తప్ప, అన్యమత ప్రచార వాహనాలు కొండపైకి అనుమతించకూడదు అనే విషయం పట్టించుకోక పోవడం శోచనీయం. 

తిరుమల

క్షేత్రం పై అధికారుల నిర్లక్ష్య ఫలితంగా అన్యమత ప్రచారకులు ఇష్టానుసారం గా తిరుగడుతున్నట్టు మీడియా ముఖంగా బయట పడింది. గత సోమవారం అన్నవరం క్షేత్రం లో ఏకంగా

గుడిలోనే క్రైస్తవ సంబంధ పాటలు పాడడం, నేడు సింహాచలం గుడి సమీపంలోనే ప్రచార వాహనాలు తిరగడం. . . హిందూ సమాజానికి ఏవిధమైన సంకేతాలు ఇస్తున్నాయి.?


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam