DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీలో మందుబాబులు - బేర్ , బార్ బిజినెస్ బేజార్   

జనవరి 1 నుంచీ కొత్త బార్ల విధానం అమల్లోకి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, నవంబర్ 23, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి మందు

బాబు లు బేర్ మానడం, బార్ ఓనర్లు బేజార్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మద్యం వ్యాపారులకు ఠారెత్తుతున్న,

మద్యం బారిన పడి రోడ్డెక్కిన కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా సంకల్ప యాత్రలో మద్యం దశల వారీగా నిషేధిస్తామని ఇచ్చిన హామీకి సాకార రూపం కల్పిస్తూ

 à°•à±Šà°¤à±à°¤ బార్లకు సంబంధించిన పాలసీ ఎలా ఉండాలన్నదానిపై సీఎం సమీక్షించారు. కొత్త బార్ల పాలసీని కూడా తెస్తూ... బార్ల సంఖ్యను 40 శాతం దాకా తగ్గిస్తోంది. కొత్త బార్ల

పాలసీ... జనవరి 1 నుంచీ అమల్లోకి వస్తుంది. అప్పటి నుంచీ ఏపీలో బార్లు రాత్రి 10 వరకు మాత్రమే మందు సరఫరా చేస్తాయి. ఆ తర్వాత మరో గంటవరకూ తెరచి ఉంచినా... మందు సరఫరా ఉండదు.

ఓన్లీ ఫుడ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. 11 తర్వాత బార్లు మూసివేయాల్సిందే. త్రీస్టార్, ఆపై స్థాయి హోటళ్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అందుబాటులో

ఉంటుంది. ఆహారాన్ని అర్ధరాత్రి 12 à°—à°‚à°Ÿà°² వరకు సర్వ్‌ చేస్తారు.

కొత్త బార్లను లాటరీ పద్ధతిలో కేటాయించబోతోంది. స్టార్‌ హోటళ్లను తప్పించి... మొత్తం  478 బార్లకు

మాత్రమే లైసెన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి అదనంగా బార్లలో అమ్మే మందు రేట్లు కూడా పెంచనుంది. దీని వల్ల ప్రభుత్వానికి డబ్బు పెరుగుతుంది. అదే

సమయంలో... మందు తాగేవాళ్ల సంఖ్య కూడా తగ్గుతుందని భావిస్తోంది.

కొత్త మద్యం పాలసీ 2020 జనవరి 1 నుంచీ 2021 డిసెంబర్ 31 వరకూ... రెండేళ్లు అమల్లో ఉంటుంది. బార్‌ లైసెన్స్‌

దరఖాస్తు ఫీజు రూ.10 లక్షలు. బార్‌ లైసెన్సు వచ్చినా, రాకపోయినా దరఖాస్తు ఫీజు తిరిగి చెల్లించరు. మద్యం కల్తీ, స్మగ్లింగ్‌, నాటుసారా తయారీ వంటివి చేస్తే ఇకపై à°•à° à°¿à°¨

చర్యలే. నాన్‌ బెయిలబుల్‌ కేసులు తప్పవు. లైసెన్స్‌ ఫీజుకు 3 రెట్లు ఎక్కువగా ఫైన్, 6 నెలల జైలు శిక్ష ఉంటుంది.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam