DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికార మదాన్ని దింపే వరకూ నిద్రించేది లేదు, పవన్ 

వైకాపా సంగతి తేల్చేదుకే పవన్ హస్తిన పయనమా?
 
ప్రజలతో ఆటలాడితే చూస్తూ ఊరుకునేది లేదు, జనసేనాని  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

.

అమరావతి, జనవరి  21, 2020 (డిఎన్‌ఎస్‌) : అధికార మదాన్ని దింపే వరకూ నిరాదరించేది లేదు అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా

 à°¸à°‚చలనం సృష్టిస్తున్నాయి. అస్తవ్యస్తంగా మారిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు చరమగీతం పాడేందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తినకు పయనమయ్యారంటూ

వార్తలు సంచలనం అవుతున్నాయి. ఇటీవల కాలం లో పవన్ కు హస్తిన పెద్దలతో జత కట్టడం తో ఉన్నట్టు ఉంది ఒక్కసారిగా ఢిల్లీ ప్రయాణం చేస్తుండడంతో  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో వార్తలకు

రెక్కలు వస్తున్నాయి. ఇలాగే గత వారం పార్టీ సమావేశంలో ఉండగానే హఠాత్తుగా బయలు దేరి ఢిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షునితో భేటీ అవ్వడం అందరినీ షాక్ కు గురి

చేసింది. అదే విధంగా బుధవారం మరోసారి ఢిల్లీ కి బయలుదేరుతున్నారు. ఇప్పడికే రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు అంతా ఢిల్లీ లోనే ఉండడం మరోసారి పవన్ ప్రయాణం సంచలనం

కానుంది. ఈసారి ప్రయాణం జగన్ ప్రభుత్వానికి బ్రేక్ వెయ్యడానికే అంటూ రాజకీయ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి బలం చేకూరుస్తున్నటుగా మంగళవారం

రాజధాని రైతులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ వారికి ఇచ్చిన భరోసా ప్రకారం ప్రజలతో ఆటలాడితే చూస్తూ ఊరుకునేది లేదు అని ప్రభుత్వాన్ని  à°¹à±†à°šà±à°šà°°à°¿à°‚చినట్టు

తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో ఈరోజు మంగళగిరిలో పవన్ మాట్లాడుతూ, వైసీపీని కూల్చేంత వరకు నిద్రపోనని తెలిపారు. ఢిల్లీ నుంచి తనకు ఫోన్ వచ్చిందని... తాను

వెళ్తున్నానని చెప్పారు. ఏం జరుగుతుందో ఇప్పుడు తాను చెప్పడం లేదని... కానీ, అద్భుతాలు జరగబోతున్నాయని అన్నారు. కూల్చివేతతో పాలనను మొదలు పెట్టిన వారు... కూలిపోక

తప్పదని చెప్పారు.

రైతులు, జనం జోలికి వస్తే ఊరుకునేది లేదు : . . .

151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తనను ఎన్ని తిట్టినా భరిస్తానని... వారి నోటి నుంచి వచ్చిన ప్రతి

మాటను కక్కేలా చేస్తానని పవన్ అన్నారు. సీఎం జగన్ రెడ్డిని మూడు కాదు 30 రాజధానులను పెట్టుకోమనండి... అన్నింటినీ మళ్లీ కలిపి ఒకే రాజధానిగా చేస్తామని చెప్పారు.

అమరావతే రాజధానిగా ఉండాలనే తమ ఆకాంక్ష అని, మీరు మద్దతిస్తారా? అని గత ఢిల్లీ పర్యటనలో బీజేపీ నేతలను అడిగానని... అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని,

అమరావతికి తాము అనుకూలమని వారు చెప్పారని తెలిపారు.

వైసీపీ నేతలు విశాఖలో భూములు కొనుక్కున్నారని... అందుకే రాజధానిని అక్కడకు మార్చాలనుకున్నారని పవన్

ఆరోపించారు. అమరావతిలో వైసీపీ వాళ్లకు భూములు ఉండి ఉంటే రాజధానిని మార్చాలనుకునే వారు కాదని చెప్పారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగుంటే కేసులు పెట్టి,

విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన ఢిల్లీ పర్యటనలో అక్కడి పెద్దలకు రాజధాని మార్పుపై అన్నీ వివరిస్తానని చెప్పారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచేలా

చేస్తానని మాటిస్తున్నానని అన్నారు. అవకాశవాద రాజకీయాలకు తాను దూరమని... ప్రజలకు మనశ్శాంతిని కలిగించే రాజకీయాలనే చేస్తానని చెప్పారు. తాను ప్రతి రోజు రోడ్డు

మీదకు రానని... కానీ అనుకున్నది సాధిస్తానని తెలిపారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam