DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నమ్మకం లేనప్పుడు మండలి లో టిడిపి ఎందుకుంది?

గతంలో మండలి ని రద్దు చేసిన ఘనత టిడిపి దే  

మండలి అంటే రాజకీయ పునరావాసమా, మరేమీ కాదా? 

లోకేష్ కు ఎమ్మెల్సీ ఇవ్వడం రాజకీయ పునరావాసం కాదా ?

  

నమ్మకం లేని సభకు లోకేష్ ను టీడీపీ ఎందుకు పంపినట్టు?

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . 

విశాఖపట్నం, జనవరి  22, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర

ప్రదేశ్ చట్టసభల చరిత్రలో శాసన మండలిని రద్దు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ దే. ఉమ్మడి రాష్ట్రంలో 1985 లో మండలిని రద్దు చేయమంటూ కేంద్రానికి సిఫార్సు చేసింది టిడిపి

యే. దీనికి చెప్పిన కారణం మండలి అంటే రాజకీయ పునరావాస కేంద్రంగా మాత్రమే ఉందని, మరో ఉపయోగం లేదని తెలిపింది. అయితే తదనంతర కాలంలో అధికారం లోకి వచ్చిన వై ఎస్

రాజశేఖర్ రెడ్డి మరోసారి మండలిని కార్యాచరణ లోకి తీసుకు వచ్చారు. 

అయితే మండలి అంటే విశ్వాసం లేనప్పుడు, నమ్మకం లేనప్పుడు తెలుగుదేశం తమ పార్టీ తరపున

ప్రతినిధులను ఎందుకు మండలికి పంపినట్టు? ఇప్పుడు రాజకీయ పునరావాస కేంద్రం కాదా? లేక అత్యంత విశ్వాసం కల్గిన సభ గా మారిపోయిందా? తామే రద్దు చేసిన మండలి సభ కు మళ్ళీ

వాళ్ళ పార్టీ సభ్యులను ఎందుకు ఎంపిక చేసినట్టు? వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత మరోసారి అధికారం లోకి వచ్చిన తెలుగుదేశం సభను ఎందుకు రద్దు చెయ్యలేదు? 

అంటే

వీళ్ళకి ఇష్టం లేదు కానీ, ప్రక్కవాళ్ళు ప్రవేశ పెడితే ఆనందంగా పదవులు అనుభవిస్తారు అనే విషయాన్నీ బహిర్గతం చేశారు. నేడు మండలి లో అత్యధికం గా ఉన్న సభ్యులు

తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. వీళ్ళందరికీ శాసనమండలి పునరావాస కేంద్రం కాలేదా, ? 

మరి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీ

తరపున తమ కుమారుడు లోకేష్ ను శాసన మండలికి ఎందుకు పంపినట్టు?  à°…ంటే వీళ్ళకి నమ్మకం లేని చోటకు తమ కుమారుణ్ణి పంపించడం వెనుక పార్టీ ఉద్దేశ్యం ఏంటి? అంటే టిడిపి

ప్రధాన కార్యదర్శి  à°²à±‹à°•à±‡à°·à± రాజకీయ పునరావాసాలకు అతీతులు అని భావిస్తున్నట్టు ఉంది. 

నమ్మకం లేని చోటకు టిడిపి తమ ప్రతినిధులను ఎందుకు పంపినట్టో వాళ్ళకే

తెలియాలి? పైగా ప్రస్తుతం జరుగుతున్నా మండలి సమావేశాల్లో హంగామా ఎందుకు చేస్తున్నట్టో?


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam